ప్రయోగానికి ముందే కూలిపోయిన ఎలాన్ మస్క్ రాకెట్
అంగారక గ్రహం మీద అడుగుపెట్టాలన్న తన ఆశయాల దిశగా స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఇంటర్ ప్లానెటరీ ప్లాన్స్ ను అమలు చేసుకుంటూ వెళుతున్నాడు.
అంగారక గ్రహం మీద అడుగుపెట్టాలన్న తన ఆశయాల దిశగా స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఇంటర్ ప్లానెటరీ ప్లాన్స్ ను అమలు చేసుకుంటూ వెళుతున్నాడు. మార్స్ మీదకు వెళ్లే రాకెట్ అయిన తన స్టార్‌షిప్ నమూనా ఫోటోను ఆ మధ్య ట్విట్టర్లో పోస్ట్ చేసి మార్స్ మీదకు వెళ్లే ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ స్టార్‌షిప్ టెస్ట్ ఫ్లైట్స్ ఇప్పటికే నిర్మణ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటి గురించి ఓ దురదృష్టకర వార్త బయటక వచ్చింది. అదేంటో ఓ సారి చూద్దాం.

బలమైన గాలులకు
తన మిస్టీరియస్ సిల్వర్ స్టార్‌షిప్ బలలమైన గాలులకు నేలను ఢీకొట్టిందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్టార్‌షిప్ తయారీలో వాడే మెటల్ బలమైన గాలులకు వంగిపోయి నేలను ఢీకొట్టినట్లు స్పష్టంగా ఫోటోలో తెలుస్తోంది.

టెక్సాస్ స్పేస్ క్రాప్ట్
ఈ స్టార్‌షిప్ను తయారుచేస్తున్న టెక్సాస్ స్పేస్ క్రాప్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్ల తెలుస్తోంది. అక్కడి నుంచే ఈ కూలిన ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. హాపర్ అనే పేరుతో పిలిచే ఈ ప్రొటోటైప్ రాకెట్ నేలను ఢీకొట్టిన దృశ్యం ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది.

అంగీకరింంచిన ఎలాన్ మస్క్
కాగా ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. నిజంగానే బలమైన గాలులకు ఇది కూలిపోయిందని తెలిపారు. అయితే అది పాక్షికంగా మాత్రమే జరిగిందని దీనిని రిపే్ చేయడం చాలా సులభమని తెలిపారు. నిర్మాణంలో చిన్న పొరపాట వల్ల ఇది జరిగిందని ముందు ముందు చాలా జాగ్రత్తగా దీని తయారీ చేపడతామని తెలిపారు.

50 mph winds
నేను ఈ వార్త విన్నాను 50 mph వేగంతో వచ్చిన గాలి ఈ మా రాకెట్ ని గత రాత్రి పాక్షికంగా దెబ్బతీసిందని దీని మరమ్మత్తులు కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అయితే అందులో ఉండే ఆయిల్ ట్యాంకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఇదిలా ఉంటే స్పేస్ మీద ఆసక్తి ఉన్న ఒకరు ఎలాన్ మస్క్ రాకెట్ పూర్తిగా కూలిపోయిందని దీనికి సంబంధించిన వీడియో ప్రముఖ వెబ్ పత్రిక Spadre.com పత్రికలో రావడం తాను చూశానని తెలిపారు. ఈ ఘటన సౌత్ టెక్సాస్ లోని బొక చికలో ఉన్న స్పేస్ ఎక్స్ సైటులో జరిగిందని తెలిపారు.

120 అడుగుల షిప్
కాగా ఈ షిప్ 120 అడుగులు పొడవుతో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్యామేజి అయిన భాగాలను శరవేగంతో నిర్మిస్తున్నారు. ఆయిల్ ట్యాంకులకు ఏమి కాకపోడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే కోట్ల డాలర్లను కుమ్మరిస్తున్నారు.

ఒక్కో వ్యక్తికి 2 లక్షల డాలర్ల వ్యయం
ఈ అంతరిక్ష నౌకలో ఆ గ్రహ ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి 2 లక్షల డాలర్ల వ్యయమవుతుందని, ఇదే టికెట్ ఖర్చని ఇదివరకే వార్తలు వచ్చాయి. మనుషులు లేకుండా స్పేస్ షిప్ ప్రయోగం 2022 సంవత్సరంలోను, వ్యోమగాములతో 2024 లోనూ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మధ్యలో ఒకేఒక ప్యాసింజర్ తో 2023 లో ఓ ప్రయివేట్ మిషన్ కు శ్రీకారం చుట్టాలన్న యోచన కూడా ఉంది మస్క్‌కు.

‘టిన్ టిన్’ రాకెట్ తో ఈ హాపర్ ని పోల్చవచ్చునంటున్నారు
1954 లో చంద్ర మండలం మీదికి ప్రయోగించడానికి వినియోగించిన ‘టిన్ టిన్' రాకెట్ తో ఈ హాపర్ ని పోల్చవచ్చునంటున్నారు. ఏమైనా.. ఇది మొదట చంద్రుని పైకి, అనంతరం అరుణ గ్రహం పైకి మనిషిని తీసుకువెళ్ళే అవకాశాలున్నాయని మస్క్ పేర్కొన్నాడు. అటు-చంద్ర మండలం,అంగారక గ్రహానికి వెళ్లి తిరిగి భూమికి చేరేందుకు సూపర్ హెవీ అనే భారీ రాకెట్ ను కూడా స్పేస్ ఎక్స్ రూపొందిస్తోంది.


Click it and Unblock the Notifications








