నాసా పని గోవిందా, ఇక రారాజు మన ఇస్రోనే !

Written By:

ప్రపంచ చరిత్రలో మరో మహోధ్యాయానికి తెరలేవబోతోంది. ఇది విజయవంతమయితే నాసాకి భారీ షాక్ తప్పదు. ఆ షాక్ ఇచ్చేది ఎవరో కాదు. మన ఇండియానే. భారతీయ అంతరిక్ష పరిశోధనలో మరో కొత్త అధ్యాయానికి తెరలేపుతూ ఇస్రో చంద్రయాన్ 2ని ముందుకు తీసుకురాబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ నెలలో ఇది ఆకాశంలోకి దూసుకువెళ్లనుంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించబోతున్నారు.

రోజంతా అపరిమితంగా మాట్లాడేయండి, డేటాను వాడేయండి, కేవలం రూ.9కే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 800కోట్ల బడ్జెట్‌తో చంద్రయాన్‌-2

అంతరిక్ష ప్రయోగ చరిత్రలో చంద్రయాన్‌-2ను ఓ మరుపురాని ప్రాజెక్టుగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) కసరత్తులు చేస్తోంది. సుమారు రూ. 800కోట్ల బడ్జెట్‌తో నాసా అపోలో మిషన్ల కన్నా పవర్ పుల్ చంద్రయాన్‌-2ను ప్రయోగించబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి(అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి మంత్రి) జితేంద్ర సింగ్‌ మీడియాకు తెలిపారు.

ప్రపంచంలోనే ఓ అద్భుత ఘట్టంగా దీనిని తీర్చిదిద్దేందుకు..

ఇస్రో ఇప్పటిదాకా చేపట్టిన ప్రయోగాలలో చంద్రయాన్‌-2 ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రపంచంలోనే ఓ అద్భుత ఘట్టంగా దీనిని తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై నిశితంగా స్పేస్‌ క్రాఫ్ట్‌లను ల్యాండ్‌ చేయటంలో విజయవంతం అయ్యాయి.

విజయవంతం అయితే ..

ఇది కనుక విజయవంతం అయితే ఇస్రో చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) కంటే ఇస్రో 20 రేట్లు తక్కువ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును ప్రయోగించబోతోంది. కాగా చంద్రుడి మీద దక్షిణ దృవంలో చంద్రయాన్‌-2 ల్యాండ్‌ అయ్యే దిశగా ఇస్రో ప్రణాళికలు చేస్తోంది.

2008లో చంద్రయాన్‌-1 ప్రయోగం..

2008లో చంద్రయాన్‌-1 ప్రయోగం విజయవంతం కాగా, 2009లో నీటి జాడలు ఉన్నట్లు స్పేస్‌ క్రాఫ్ట్‌ గుర్తించింది. ఈ విజయం నింపిన ఉత్సా హంతో ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది.

చంద్రయాన్-1 లా కాకుండా ..

చంద్రయాన్-2 వ్యోమనౌక,ల్యాండర్,రోవర్.. ప్రధాన,ఉప వ్యవస్థల అనుసంధానాలు అవుతాయి. చంద్రయాన్-1 లా కాకుండా వ్యోమనౌక నెమ్మదిగా దిగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. దీని ప్రకారం వ్యోమనౌకను 100 మీటర్ల ఎత్తునుంచి కిందకు జార విడుస్తారు.

రోవర్‌ చంద్రునిపై కుప్పకూలకుండా

వ్యోమనౌక కక్ష్య నుంచి రోవర్‌ చంద్రునిపై కుప్పకూలకుండా నెమ్మదిగా వాలేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందందని సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం 100 మీటర్ల ఎత్తులో చంద్రమండలంలోని గురుత్వాకర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు.

నౌక దిగాల్సిన దగ్గర

500 కిలో గ్రాముల బరువైన వ్యోమనౌకను మండించడం ద్వారా కిందకు శాటిలైట్‌ను జారవిడుస్తారు. నౌక దిగాల్సిన దగ్గర రాళ్లు,బండలు ఉంటే మరో సురక్షిత స్థానాన్ని గుర్తించి అక్కడ దిగేందుకు అడ్డం-నిలువు విన్యాసాలు సాయపడుతాయన్నారు.

చంద్రునిపై రోవర్‌

ప్రస్తుతం వ్యోమనౌక సమర్ధతను తమిళనాడు మహేంద్రగిరి ఇస్రో ఇందన కేంద్రంలో పరీక్షిస్తున్నారు. చంద్రునిపై రోవర్‌.. ఖనిజ వనరులు, మూలకాల్ని, మానవ జాతి మనుగడకు గల సాధ్యాసాధ్యాలను ఈ రోవర్ పరీక్షిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Giving India a new height in space technology, ISRO likely to launch Chandrayaan-2 in April More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot