Home
Scitech

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున భారీ పర్వతాలు

భూమి ఎలా ఏర్పడింది అన్నదానిపై ఇప్పటివరకు అందరికీ అనేక రకాలైన అంచనాలు ఉన్నాయి. అయితే సైంటిస్టులు ఇప్పుడు భూమి గురించి మరో సరికొత్త విషయానికి చర్చను లేవదీశారు. భూమి యొక్క ఉపరితలం కింద లోతైన పర్వతాలు దాగ

భూమి ఎలా ఏర్పడింది అన్నదానిపై ఇప్పటివరకు అందరికీ అనేక రకాలైన అంచనాలు ఉన్నాయి. అయితే సైంటిస్టులు ఇప్పుడు భూమి గురించి మరో సరికొత్త విషయానికి చర్చను లేవదీశారు. భూమి యొక్క ఉపరితలం కింద లోతైన పర్వతాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో భూమి లోపల మరో భౌగోళిక స్వరూపం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శాస్ర్తవేత్తలు అందించిన సమాచారం ప్రకారం భూగర్భంలో లోతైన పర్వతాలు దాగున్నాయట. అవి వేళ ఏళ్ల నాటివట. పూర్తి వివరాల్లోకెళితే..

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున భారీ పర్వతాలు

మరో భౌగోళిక స్వరూపం

మరో భౌగోళిక స్వరూపం

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోపల భారీ పర్వతాలు, మరో భౌగోళిక స్వరూపం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఈ లేయర్‌కు కచ్చితమైన పేరేదీ లేకపోవడంతో ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు దీనిని ద 660 కిలోమీటర్ బౌండరీగా పిలుస్తున్నారు.

అధ్యయనం కోసం

అధ్యయనం కోసం

అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, చైనాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోడెసీ అండ్ జియోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం కోసం భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన తరంగాలను ఉపయోగించారు.

 

 

7 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో

7 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో

భారీ భూకంపాలు వచ్చినపుడు ఈ తరంగాలు ఉత్పన్నమవుతాయి. 7 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు భూమి లోపల కోర్ వరకు షాక్‌వేవ్స్‌ను పంపిస్తాయి. ఆ వేవ్స్ కింది భాగాన్ని తాకి మళ్లీ పైకి వస్తాయి. దీంతో బొలీవియాలో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు.

శక్తివంతమైన కంప్యూటర్లను

శక్తివంతమైన కంప్యూటర్లను

భూగర్భంలో తరంగాలు ప్రయాణిస్తున్న తీరును అనుకరించడానికి శక్తివంతమైన కంప్యూటర్లను ఉపయోగించారు. కాంతి ఏదైనా ఒక దర్పణం గుండా వెళ్లినపుడు ఎలా అయితే వంగి ప్రయాణిస్తాయో.. భూకంప తరంగాలు కూడా భూగర్భంలో ఏవైనా అడ్డంకులు వచ్చినపుడు వంగి ప్రయాణించినట్లు గుర్తించారు.

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున

ఈ డేటా ఆధారంగా భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున భారీ పర్వతాలు ఈ తరంగాలను అడ్డుకున్నట్లు తేలింది. మనం ఇప్పుడు జీవిస్తున్న భూపొర కంటే ఎంతో గరుకుగా 660 కిలోమీటర్ బౌండరీ ఉందని ఈ అధ్యయనం పాల్గొన్న సైంటిస్టు వెంబో వు వెల్లడించారు. బండరాళ్లతో కూడిన పర్వతాల కంటే బలమైన భౌగోళిక స్వరూపం అక్కడ ఉందని ఆయన తెలిపారు.

 భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున

సాధారణంగా భూమిలో నాలుగు పొరలు ఉంటాయని అందరికీ తెలుసు. క్రస్ట్.. ఇది భూమి పైభాగం. ఇక్కడే మనం ఉంటున్నది. దాని కింది మాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ పొరలు ఉంటాయి. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది ఏంటంటే.. మాంటిల్ పొరలో భారీ పర్వతాలు ఉన్నాయి అని.

 ఆశ్చర్యకర ఫలితాలు

ఆశ్చర్యకర ఫలితాలు

దీనికోసం ఓ భారీ భూకంపం ఇచ్చిన డేటాను అధ్యయనం చేశారు. బొలీవియాలో 1994లో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపానికి సంబంధించి అధ్యయనం చేస్తే ఈ ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. అయితే దీనిపై మరింతగా పరిశోధన చేయాల్సి ఉంది. అప్పుడు కాని ఓ నిర్థారణకు రాలేం.

More from GizBot

Best Mobiles in India

English summary
How was the Earth formed Discovery of massive interior mountains
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X