చైనాకు చుక్కలు చూపిస్తున్న ఇండియా,అవి వదిలితే వినాశనమే..

చీటికిమాటికి సరిహద్దుల వద్ద వివాదాలు సృష్టిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న చైనా పని పట్టేందుకు ఇండియా రెడీ అవుతోంది.

|

చైనాకు ఇండియా చుక్కలు చూపిస్తోంది. చీటికిమాటికి సరిహద్దుల వద్ద వివాదాలు సృష్టిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న చైనా పని పట్టేందుకు ఇండియా రెడీ అవుతోంది. ఇందులోభాగంగా అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. వాస్తవానికి ఇప్పటిదాకా పాకిస్థాన్‌నే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌ ఇప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం అంతుచూడాలని భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన అణురంగ నిపుణులు పేర్కొన్నారు.

అగ్ని' ప్రపంచదేశాలను హడలెత్తిస్తోందిఅగ్ని' ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది

చైనా భస్మీపటలం

చైనా భస్మీపటలం

దక్షిణ భారతదేశంలోని తన స్థావరం నుంచి ప్రయోగిస్తే చైనా భస్మీపటలం అయ్యేస్థాయి కలిగిన క్షిపణిని భారత్‌ తయారుచేస్తోందని జూలై-ఆగస్టు మధ్యకాలంలో ప్రచురించిన ఓ వ్యాసంలో అమెరికాకు చెందిన డిజిటల్‌ జర్నల్‌ పేర్కొంది.

150 నుంచి దాదాపు 200 వార్‌హెడ్లకు

150 నుంచి దాదాపు 200 వార్‌హెడ్లకు

150 నుంచి దాదాపు 200 వార్‌హెడ్లకు సరిపడా ప్లుటోనియంను భారత్‌ సిద్ధం చేసిందని, అయితే 120 నుంచి 130 వార్‌హెడ్లను మాత్రమే తయారుచేస్తుందని సదరు వ్యాసం పేర్కొంది.

సిక్కిం సరిహద్దు వివాదంతో
 

సిక్కిం సరిహద్దు వివాదంతో

సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా హెచ్చరిస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది.

భారత అణు శక్తిపై

భారత అణు శక్తిపై

ఈ నేపథ్యంలో భారత అణు శక్తిపై ప్రముఖ అమెరికన్‌ అణ్వాయుధ నిపుణులు రాసిన కథనం ఆసక్తికరంగా మారింది.

‘ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌

‘ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌

అమెరికాకు చెందిన హన్స్‌ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్‌ ఎస్‌ నోరిస్‌ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు.. ‘ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌ 2017' పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణు శక్తిని గురించి ప్రస్తావించారు.

చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేసేంత క్షిపణులను

చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేసేంత క్షిపణులను

భారత్‌ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేసేంత క్షిపణులను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు.

భారత్‌ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు

భారత్‌ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు

ప్రస్తుతం భారత్‌ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయి. అందులో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో నాలుగు వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేయనుంది.

అగ్ని-1ను ఆధునీకరించి అగ్ని-2ని

అగ్ని-1ను ఆధునీకరించి అగ్ని-2ని

ఇక అగ్ని-1ను ఆధునీకరించి అగ్ని-2ని తయారుచేసింది.రెండు వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. దీంతో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.

అగ్ని-4ను

అగ్ని-4ను

ఇక అగ్ని-4ను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేయవచ్చు.

లాంగ్‌ రేంజ్‌ అగ్ని-5

లాంగ్‌ రేంజ్‌ అగ్ని-5

లాంగ్‌ రేంజ్‌ అగ్ని-5ని కూడా భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు' అని క్రిస్టెన్సన్, నోరీస్‌ తమ వ్యాసంలో పేర్కొన్నారు.

డోక్లాంవద్ద యథాపూర్వకస్థితిని

డోక్లాంవద్ద యథాపూర్వకస్థితిని

కాగా ఇండియా-భూటాన్‌-టిబెట్‌ ట్రైజంక్షన్‌ వద్ద సిక్కిం పరిధిలోగల డోక్లాంవద్ద యథాపూర్వకస్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.

Best Mobiles in India

English summary
India to develop missiles Technology that can hit all of China even from southern bases read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X