పెద్దన్నకు షాక్, ఇండియా రష్యాల మధ్య రూ.36,842 కోట్ల డీల్ !

  ఇండియా రష్యాల మైత్రి బంధం మళ్లీ పట్టాలకెక్కనుంది. ఇందులో భాగంగా రెండురోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు.ఇండియా-రష్యా 19వ వార్షిక ద్వై పాక్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు లైవులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రక్షణరంగ సహకారం పై కీలక చర్చలతోపాటు, ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుపై ఇరుదేశాల మధ్య భారీ ఒప్పందం ఖరారు కానున్నది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఒప్పందంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొన్నది. మరి ఈ ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థపై ఓ లుక్కేయండి.

  రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమ్మాయి, ధియరిస్టులు చెబుతున్న లాజిక్కులు ఇవే

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ఎస్-400

  రష్యా తయారు చేసిన ఎస్-400 ను ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థగా పరిగణిస్తా రు. ఇది శత్రువుల క్షిపణి దాడుల్ని పూర్తిగా అడ్డుకుంటుంది.

  ఎస్-300 క్షిపణి వ్యవస్థ

  రష్యా గతంలో రూపొందించిన ఎస్-300 క్షిపణి వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి తయారు చేసిన ఎస్-400 రష్యా సైన్యానికి 2007 నుంచి సేవలందిస్తున్నది.

  చైనా కొనుగోలు

  ఇప్పటికే రష్యా నుంచి ఎస్-400ను చైనా కొన్నా, ఎన్నింటిని కొన్నదన్న విషయం తెలియరాలేదు.

  4,000 కిమీపొడవైన భారత్-చైనా సరిహద్దుల్లో..

  ఈ నేపథ్యంలో ఉపఖండంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 4,000 కిమీపొడవైన భారత్-చైనా సరిహద్దుల్లో ఎస్-400 లాంటి అత్యాధునిక వ్యవస్థలు అవసరమని భారత్ భావిస్తున్నది.

  రూ.36,842కోట్లతో

  ఆ మేరకు రష్యాతో ఒప్పందానికి సిద్ధమైంది. మొత్తం 500 కోట్ల డాలర్లు (రూ.36,842కోట్ల)తో భారత్ వీటిని కొనుగోలు చేయనున్నది.

  అంతకుమించి..

  ఒప్పందం విలువ అంతకుమించి ఉంటుందని పుతిన్ సన్నిహితుడు, విదేశాంగవిధాన నిపుణుడు యూరీ ఉషకోవ్ చెప్పారు.

  రూ.18,421 కోట్లతో

  మరో 250 కోట్ల డాలర్ల (రూ.18,421 కోట్ల)తో నాలుగు క్రివాక్ యుద్ధనౌకలను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తున్నది.

  భారత నౌకాదళం

  ఈ ఒప్పందంతో భారత నౌకాదళం మరింత బలపడనుంది. ఇప్పటికే మన నేవీలో ఆరు రష్యా తయారీ యుద్ధనౌకలున్నాయి.

  భారత్ చాలా వరకు రష్యానుంచి ..

  యుద్ధ సామగ్రికి సంబంధించి భారత్ చాలా వరకు రష్యానుంచి కొనుగోలు చేయాల్సి ఉండగా, అమెరికా ఆంక్షలు ఏమేరకు వాటిపై ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

  2016 అధ్యక్ష ఎన్నికల్లో..

  2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపించిన అమెరికా.. ఆ దేశానికి వ్యతిరేకంగా 2017లో ఆంక్షలతో అమెరికా ప్రయోజనాలను కాపాడుకునే చట్టం (సీఏఏటీఎస్‌ఏ)ని అమలు చేసింది.

  రష్యాతో ఆయుధ కొనుగోలు ఒప్పందాలు..

  2018 జనవరి నుంచి అమలవుతున్న ఈ చట్టం రష్యాతో ఆయుధ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకుండా వివిధ దేశాలను అడ్డుకుంటున్నది.

  ఈ ఆంక్షల నుంచి ..

  కానీ రష్యాతో ఉన్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా ఈ ఆంక్షల నుంచి తమను మినహాయించాలని అమెరికాను భారత్ డిమాండ్ చేస్తున్నది.

  నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్

  అమెరికా ఇటీవల తెచ్చిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డీఏఏ) చట్టం రష్యాతో సుదీర్ఘకాలం నుంచీ సంబంధాలున్న దేశాలకు సీఏఏటీఎస్‌ఏ నుంచి మినహాయింపు లభిస్తుందని భారత్ ఆశాభావంతో ఉంది...

  ఒప్పందాలు

  కాగా ఈ సమావేశంలోనే కీలక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థలతోపాటు, 4 క్రివాక్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందాలు ఖరారు కానున్నాయి. మరింత సమాచారం తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే..

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Modi-Putin to sign S-400 missile deal: All you need to know about the Russian missile defence system more news at Gizbot telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more