విర్ర వీగుతున్న చైనాకు చావు దెబ్బ, కొట్టింది ఇండియానే !

Written By:

ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అంటూ కాచుకూర్చున్న చైనాకు ఇండియా దిమ్మతిరిగే షాకిచ్చింది. తనది కాని భూభాగాన్ని ఆక్రమించుకుని చిన్న దేశాలను బెదిరిస్తున్న డ్రాగన్ కంట్రీకి ఇండియా తన ఆర్మీ సత్తా ఏంటో చూపేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన ఇండియా..ఇక చుక్కలే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారతీయ క్షిపణులు

దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటూ విర్ర వీగుతున్న చైనాకు భారత్‌ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై భారతీయ క్షిపణులు చైనాకు సవాలుగా మారనున్నాయి.

దక్షిణ చైనా సముద్రంపై

వాస్తవానికి దక్షిణ చైనా సముద్రంపై బ్రూనై, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్‌, వియత్నాంలకు కూడా అధికారాలు ఉన్నాయి. అయితే చైనా మిగిలిన దేశాలను బెదిరిస్తూ సముద్రం మొత్తం తమ కిందకే వస్తుందని వాదిస్తోంది.

అత్యధిక శక్తిమంతమైన మిస్సైల్‌ బ్రహ్మోస్‌ను

దక్షిణ చైనా సముద్ర తీరం కలిగిన వియత్నాంతో భారత్‌కు ఎప్పటినుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా వియత్నాంకు ఓడలపై నుంచి ప్రయోగించే అత్యధిక శక్తిమంతమైన మిస్సైల్‌ బ్రహ్మోస్‌ను అందించింది.

చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు

కొన్నేళ్లుగా భారత్‌-వియత్నాంల మధ్య ఈ మిస్సైల్‌ అమ్మకానికి చర్చలు జరుగుతూ వచ్చాయి. చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో ప్రభుత్వం ఈ మిస్సైల్స్‌ను వియత్నాంకు ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధ్వని వేగం కంటే రెండున్నర రెట్లు అధిక వేగంతో

భారత నేవీ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన మిస్సైల్‌ బ్రహ్మోసే. ధ్వని వేగం కంటే రెండున్నర రెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం దీని సొంతం. దీన్ని ఓడల నుంచి సులువుగా ప్రయోగించొచ్చు.

ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఈ తరహా మిస్సైల్స్‌లో

ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఈ తరహా మిస్సైల్స్‌లో బ్రహ్మోసే అత్యాధునికం. భారత్‌ నుంచి తొలి విడతగా అందాల్సిన బ్రహ్మోస్‌ మిస్సైల్స్ తమ వద్దకు చేరుకున్నట్లు వియత్నాం అధికారి ఒకరు తెలిపారు.

బ్రహ్మోస్‌ క్షిపణుల అమ్మకంపై

అయితే, బ్రహ్మోస్‌ క్షిపణుల అమ్మకంపై భారత్‌ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India's New Move With BrahMos Cruise Missile Likely To Anger China Read more at Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting