శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తున్నఅగ్ని విశ్వరూపం ఇదే !

|

ప్రపంచదేశాలు తమ ఆయుధాలను మరింతగా పెంచుకుంటూ పోతున్న తరుణంలో ఇండియా కూడా ఆయుధాలను పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే భారత అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. శత్రు దేశాలు ఎప్పుడు దాడి చేసినా వాటిని భస్మీపటలం చేయగల ఆయుధాలు ఇప్పుడు ఇండియా ఆర్మీ చేతుల్లో ఉన్నాయి. ముఖ్యంగా అగ్ని అస్త్రాల గురించి చాలామందికి తెలియదు. వాటి వేగానికి శత్రు దేశాల ఆయుధాలు నామరూపాల్లేకుండా పోతాయి. అలాంటి ఆయుధాలు గురించి ప్రతి భారతీయుడు తెలుసుకుని తీరాల్సిందే. ఈ శీర్షికలో వాటి గురించి ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

 700 కి.మీ. పరిథిలోని లక్ష్యాన్ని..
 

700 కి.మీ. పరిథిలోని లక్ష్యాన్ని..

ఉపరితలం నుంచి ఉపరితలంపైన 700 కి.మీ. పరిథిలోని లక్ష్యాన్ని అగ్ని 1 మిసైల్ విజయవంతంగా ఛేదించగలదు.

 ఇది 18వ వెర్షన్

ఇది 18వ వెర్షన్

అగ్ని-1లో 18వ వెర్షన్ ల వరకు ఉన్నాయి. నిర్ణీత సమయంలో అన్ని పరామితులను కచ్చితంగా ఇవి సాధించగలవు. ఈ మిసైల్‌ను 2004లో సర్వీస్‌లో ప్రవేశపెట్టారు. నవంబర్ 22 2006లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఆ తరువాత మళ్లీ కొన్ని సార్లు విజయవంతంగా ప్రయోగించారు.

ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ..

ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ..

లక్ష్యాన్ని అత్యంత పకడ్బందీగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 మిస్సైల్‌ ఈ సొంతం. ఎంచుకున్న లక్ష్యాన్ని అత్యంత తక్కువ కాలంలో చేరుకుంటుంది. అత్యవసర సమయాల్లో అగ్ని-1 ను ప్రయోగించేందుకు అతి తక్కువ సమయం మాత్రమే పడుతుంది.

1,000 కేజీల బరువును..
 

1,000 కేజీల బరువును..

దీని పొడవు 15 మీటర్లు, బరువు 12 టన్నులు, కాగా 1,000 కేజీల బరువును ఇది మోయగలదు. కాగా దీన్నిDefence Research Development Laboratory (DRDL) , Research Centre Imarat (RCI) సహయంతో Advanced Systems Laboratory or ASL డెవలప్ చేసింది.

ఎప్పుడు ప్రయోగం జరిపినా..

ఎప్పుడు ప్రయోగం జరిపినా..

శత్రు క్షిపణులను ఒకే ఒక్క దెబ్బతో సర్వనాశనం చేయగల అగ్ని క్షిపణి ఎప్పుడు ప్రయోగం జరిపినా నిప్పులు చిమ్మకుంటూ ఆకాశంలోకి దూసుకెళుతోంది. పాకిస్తాన్ తో పాటు చైనా ను...అరబ్బు దేశాలను,అలాగే పశ్చిమాసియా దేశాలను ఈ అగ్ని క్షిపణులు ఇప్పుడు వణికిస్తున్నాయి.

అగ్ని అనగా నిప్పు అని అర్థం. అంతే కాక హిందూ మతం దేవుడు అనే అర్థం కూడా వస్తుంది.

మొట్ట మొదటి అగ్ని క్షిపణి

మొట్ట మొదటి అగ్ని క్షిపణి

మొట్ట మొదటి అగ్ని క్షిపణిని 1989లో చండీపూర్ ప్రాంతంలో పరీక్షించారు. ఆనాడు అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడాన్ని చూసిన అమెరికా ఇండియాకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంలో అప్పట్లో నిషేధాన్ని విధించింది కూడా. అయినా ఇండియా బెదరక పరీక్షలను విజయవంతంగా ప్రయోగిస్తూ అణు సామర్ధ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది.

అగ్ని-I

అగ్ని-I

అగ్ని-I పరీక్షను చివరిసారిగా 2014 సెప్టెంబర్ 11న ఆర్మీ విజయవంతంగా నిర్వహించింది. అయితే అగ్ని క్షిపణులు ఇండియా అమ్ములపొదిలో ఇప్పుడు అయిదు ఉన్నాయి. ఆరవది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇవి భారత సైన్యంలో చేరి సేవలను అందిస్తున్నాయి.

అగ్ని-I

అగ్ని-I

బరువు 12 టన్నులు, పొడవ 15 మీటర్లు. టన్నుకుపైగా పేలోడ్‌ను తీసుకెళ్లే విధంగా ఈ క్షిపణిని డిజైన్ చేశారు. డిఫెన్స్ లాబోరేటరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ సహకారంతో డీఆర్డీవో అడ్వాన్స్‌డ్ సిస్టం లాబోరేటరీ అభివృద్ధి చేసింది. ఇది 700 నుంచి 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల ఆయుధాలను భస్మీపటలం చేయగలదు.

అగ్ని 2

అగ్ని 2

అగ్ని 1 తరువాత వచ్చిన మరొక ఆయుధం అగ్ని 2..ఇది 2000 నుంచి 3000 కిలోమీటర్ల దూరాల లక్ష్యాలను చేధిస్తుంది. 18 టన్నుల బరువు ఉంటుంది. ఉపరితలం నుంచి ఉపరితలంలో రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలదు ఈ క్షిపణి.

అగ్ని 2

అగ్ని 2

ఈ క్షిపణిని ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాక్ జిల్లా ధమరా అనే తీర ప్రాంతం నుండి ఆకాశంలోకి ప్రయోగించారు.18 టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణి మరో వెయ్యి కేజీల బరువు కలిగిన అణ్వాయుధాలను మోసుకెళుతుంది.

అగ్ని-3:

అగ్ని-3:

3000-5500 కి.మీ పరిధిలో ఏం ఉన్నా వాటిని బూడిద చేయగల సత్తా దీని సొంతం. అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని-3లో రెండంచెల ఘన ఇంధన వ్యవస్థ ఉంటుంది.

అగ్ని-3:

అగ్ని-3:

17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వ్యాసం, 50 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి 1.5 టన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.

అగ్ని-4:

అగ్ని-4:

ఈ అస్త్రం 3,000-4,000 కి.మీ పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. గగన తలం నుంచి గగన తలంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి. అగ్ని-5 తర్వాత మరో శక్తివంతమైన క్షిపణి ఇదే.. 4 వేల కిలోల పేలుడు పదార్థాలను లేదా అణ్వాయుధాలను ఇది మోసుకెళ్ళగలదు. క్షిపణిలో పొందుపరిచిన ఇంటర్నేషనల్ నేవిగేషన్ సిస్టమ్, ఇంటర్నల్ నేవిగేషన్ సిస్టంల సహాయంతో 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని అధికారులు చెబుతున్నారు.

అగ్ని-4:

అగ్ని-4:

రక్షణ రంగంలో ఇది మరో మైలురాయిగా నిలవగలదనీ, చైనా రూపొందించిన భారత్ లోని సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులకు పోటీగా ఈ క్షిపణి నిలవగలదనీ రక్షణశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని ఏ ప్రాంతాన్నైనా ,అలాగే చైనాలోని 40 శాతం భూభాగాన్ని కొన్ని అరబ్ దేశాలను, పశ్చిమాసియా దేశాలను చేరే శక్తి సామర్ధ్యాలు అగ్ని-4కు ఉన్నాయి.

అగ్ని-4:

అగ్ని-4:

20 మీటర్ల పొడవు 17 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని సరిహద్దుల నుంచి ప్రయోగిస్తే పాక్ లోని ఏ భాగాన్నైనా చేరవచ్చు. ముంబై తీరం నుంచి ప్రయోగిస్తే అరబ్ దేశాలను తాకుతుంది. ఇక అండమాన్ నుంచి ప్రయోగిస్తే పలు పశ్చిమాసియా ప్రాంతాలను తాకుతుంది.భారత సైన్యం అమ్ముల పొదిలోకి చేరి దేశానికి సేవలందిస్తోంది.

అగ్ని-5:

అగ్ని-5:

ఈ క్షిపణి దాదాపు 5,000 -8,000 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు.ఉపరితలం నుంచి ఉపరితలానికి వెయ్యి కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.ఇప్పటి వరకు ఈ క్షిపణిని మూడు సార్లు ప్రయోగించగా.. ప్రతీసారి విజయవంతమైంది.

అగ్ని-5:

అగ్ని-5:

త్రీ స్టేజ్ మిస్సైల్ అయిన అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం.

అగ్ని-5:

అగ్ని-5:

ఇప్పుడు చైనాలోని బీజింగ్, షాంఘై నగరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి రానున్నాయి. ఈ క్షిపణితో ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని నగరాలపై దాడి చేయవచ్చు. అగ్ని-5 మిసైల్‌ను దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా తరలించే వెసులుబాటు ఉంది.

అగ్ని-5:

అగ్ని-5:

దీన్ని 486 మిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. అంతేకాకుండా, మల్టిపుల్ వార్‌హెడ్‌లతో పాటు.. శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. అయితే, భారత ఆర్మీ ఆయుధ సంపత్తిలో చేర్చే ముందు దీనికి కనీసం నాలుగైదు సార్లు ప్రయోగ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని భారత రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అగ్ని-6:

అగ్ని-6:

దీర్ఘశ్రేణి అణుసామర్థ్యం గల అగ్ని-6 బాలిస్టిక్‌ మిస్సైల్‌ కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించేందుకు బహుళ యుద్ధశీర్షాలను తీసుకువెళ్ళగల సామర్థ్యం ఈ మిస్సైల్‌కు ఉంది. కాగా అగ్ని-5 ప్రధాన వ్యూహాత్మక రక్షణ ఆయుధం అయితే అగ్ని-6 బహుళ సామర్థ్యం కలది.

అగ్ని-6:

అగ్ని-6:

అగ్ని-5 బాలిస్టిక్‌ మిస్సైల్‌ 5,500 కిలోమీటర్ల విస్తృతి కలిగి ఉంది. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న అగ్ని-6 అంతకన్నా ఎక్కువ విస్తృతి కలిగి ఉంటుందని విశ్వసిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అగ్ని-6:

అగ్ని-6:

అగ్ని-6 అభివృద్ధి చేయడం పూర్తయితే అదే సామర్థ్యం గల క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 10 వేల నుంచి 12 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలిగేలా దీనిని తయారుచేయనున్నారని సమాచారం.

అగ్ని-6:

అగ్ని-6:

ఈ క్షిపణిని ఎక్కడికైనా తరలించగలిగేలా.. సులువుగా ప్రయోగించగలిగేలా రూపకల్పన చేస్తున్నారు. జలాంతర్గాములు, లాంచర్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అంటే మన సరిహద్దుల వరకూ తరలించి మరీ దీన్ని శత్రు దేశాలపైకి ప్రయోగించవచ్చు.

ఆయుధ రంగంలో ప్రపంచదేశాలకు సవాల్

ఆయుధ రంగంలో ప్రపంచదేశాలకు సవాల్

ఇప్పటికే దీని డిజైన్ పూర్తి అయిందని విడిభాగాల రూపకల్పన దశలో ఉన్నామని భారత రక్షణపరిశోధనాభివృద్ధి వ్యవస్థ చెబుతోంది. ఇలాంటి క్షిపణులు అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి.అగ్ని-6 కూడా బయటకు వస్తే భారత్ ఆయుధ రంగంలో ప్రపంచదేశాలకు సవాల్ విసరడం ఖాయమేనని నిపుణులు చెబుతున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
India Successfully Test-Fires Nuclear Capable Ballistic Agni-1 Missile: 10 Facts more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X