ఆకాశంలో అగ్ని 5 మిస్సైల్ వెలుగుకు జడుసుకున్న ఇతర దేశాల ప్రజలు !

By Maheswara
|

ఇటీవల, అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన సరిహద్దులో చైనాతో ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య, భారత మిస్సైల్ పరిశోధన సంస్థ DRDO అగ్ని 5 మిస్సైల్ ను 5,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలను చేధించగల సామర్థ్యంతో బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా రాత్రిపూట ప్రయోగాలు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు గురువారం తెలిపాయి.

 

క్షిపణిలోని కొత్త టెక్నాలజీ లు

క్షిపణిలోని కొత్త టెక్నాలజీ లు

ఈ క్షిపణిలోని కొత్త టెక్నాలజీ లు మరియు పరికరాలను ధృవీకరించడానికి ఈ పరీక్ష నిర్వహించబడింది మరియు క్షిపణి ఇప్పుడు మునుపటి కంటే మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలదని నిరూపించబడింది అని వివరించారు. అణ్వాయుధ సామర్థ్యం గల ఈ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించారు. ఇది అగ్ని V యొక్క తొమ్మిదవ పరీక్ష. ఇది 2012 లో మొదటిసారి మరియు ఇది సాధారణ పరీక్ష చేసారు అని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

చైనా తో, బోర్డర్ లో జరిగిన ఘర్షణలు

చైనా తో, బోర్డర్ లో జరిగిన ఘర్షణలు

చైనా తో, బోర్డర్ లో జరిగిన ఘర్షణలు కారణంగా పరీక్ష వాయిదా పడుతుందేమో అని సందేహాలు ఉన్నా, ముందుగానే ప్లాన్ ప్రకటన ప్రకారమే టెస్ట్ నిర్వహించారు. అరుణాచల్‌లోని తవాంగ్‌లో ఘటన జరగడానికి ముందే భారత్ సుదూర క్షిపణిని పరీక్షించాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది మరియు ఎయిర్‌మెన్‌లకు నోటామ్ లేదా నోటీసును జారీ చేసింది.

పరీక్ష యొక్క వెలుగు
 

పరీక్ష యొక్క వెలుగు

ఈ అగ్ని 5 మిస్సైల్ యొక్క పరీక్ష యొక్క వెలుగు బంగ్లాదేశ్ ,మయన్మార్ దేశాలలో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా కనిపించింది. ఈ వింత వెలుగు తో మొదట్లో ప్రజలు భయాందోళను చెందగా నిజం తెలిసిన తర్వాత అభినందనలు,సంతోషం వ్యక్తం చేసారు.

అణు-సామర్థ్యం కలిగిని అగ్ని 5 ​బాలిస్టిక్ క్షిపణుల గురించి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి:

అణు-సామర్థ్యం కలిగిని అగ్ని 5 ​బాలిస్టిక్ క్షిపణుల గురించి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి:

* అగ్ని-V దాదాపు మొత్తం ఆసియాను, చైనాలోని ఉత్తర భాగంతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను దాని పరిధిలోకి తీసుకురాగలదు. ఈ క్షిపణి భారతదేశ ఆయుధ కార్యక్రమం చరిత్రలో అత్యంత సుదూర పరిధిని కలిగి ఉంది. 5,000 కి.మీ దాటిన గరిష్ట కార్యాచరణ పరిధిలో ప్రయోగించిన మొదటి క్షిపణి కూడా ఇదే.

* అగ్ని-V అనేది 1.5 టన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు, మూడు-దశల సాలిడ్ రాకెట్ ను పవర్డ్ క్షిపణి వ్యవస్థ కలిగి ఉంటుంది.

* అగ్ని-V ప్రాజెక్ట్ 12,000-15,000 కిమీల మధ్య క్షిపణులను కలిగి ఉన్న డాంగ్‌ఫెంగ్-41 వంటి క్షిపణులను కలిగి ఉన్న చైనాకు పోటీగా భారతదేశం యొక్క అణు నిరోధక శక్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

* అగ్ని-Vని పరీక్షించడం ఇదే మొదటిసారి కాదు. భారతదేశం అక్టోబర్, 2021లో ఇదే విధమైన క్షిపణి పరీక్షను నిర్వహించింది మరియు దీని మొదటి పరీక్షను 2012లో నిర్వహించింది.

* అగ్ని-V ప్రయోగం దేశం యొక్క వ్యూహాత్మక నిరోధకానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని సూచిస్తున్నందున, ప్రజలు ఇప్పుడు దాని జలాంతర్గామి వెర్షన్ 'K-5' కోసం ఎదురు చూస్తున్నారు, ఇది సమీప భవిష్యత్తులో పరీక్షించబడుతుందని భావిస్తున్నారు.

* ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-V క్షిపణిని ప్రయోగించారు.

భారతదేశం యొక్క అగ్ని-5 మొత్తం చైనాను తన పరిధిలో తీసుకోగలదా?

భారతదేశం యొక్క అగ్ని-5 మొత్తం చైనాను తన పరిధిలో తీసుకోగలదా?

ప్రోటోకాల్ ప్రకారం వారాల క్రితం ఎయిర్‌మెన్‌లకు ముందస్తు పరీక్ష హెచ్చరిక జారీ చేయబడినప్పటికీ, అసలు కాల్పుల సమయం చైనాకు సందేశంగా చూడవచ్చు.అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద చైనా సైనికులు భారత సైనికులతో ఘర్షణకు దిగారు. రెండు వైపుల నుండి అనేక మంది సైనికులు గాయపడ్డారు, కానీ సైన్యంలో ఎవరూ ఎటువంటి మరణాలను నివేదించలేదు.

5,500 కిలోమీటర్ల పరిధి

5,500 కిలోమీటర్ల పరిధి

ప్రకటించిన 5,500 కిలోమీటర్ల పరిధిలో అగ్ని-V దాదాపు మొత్తం ఆసియాను, చైనాలోని ఉత్తర భాగంతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను దాని పరిధిలోకి తీసుకురాగలదు. అలాగే, ప్రస్తుతం ఉన్న ఇతర అగ్ని వేరియంట్ అగ్ని IV 4,000 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు, అయితే అగ్ని-III 3,000-కి.మీ పరిధిని కలిగి ఉంది మరియు అగ్ని II 2,000-కి.మీ వరకు ఎగరగలదు.

చైనా ఆందోళన వ్యక్తం చేసింది

చైనా ఆందోళన వ్యక్తం చేసింది

గత సంవత్సరం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) 1172 యొక్క తీర్మానాన్ని ఉటంకిస్తూ భారతదేశం అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం గురించి చైనా ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం యొక్క 1998 అణు పరీక్షల తర్వాత ఈ తీర్మానం జారీ చేయబడింది.

Best Mobiles in India

Read more about:
English summary
India Successfully Tested Nuclear Capable Agni 5 For Its Maximum Range. Here Are Some Interesting Facts.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X