ఆకాశంలో కళ్లు చెదిరే అద్బుతం..

Written By:

ఆకాశంలో ఓ అద్బుతాన్ని భారత ఖగోళ శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. కళ్లు చెదిరే ఆ అద్భుతం ఏంటో తెలుసా.. 20 మిలియన్‌ బిలియన్‌ సూర్యుళ్లకు సమానమైన గెలాక్సీని కనుగొనడం. ఈ గెలాక్సీల మహా సమూహం ఓ దీపావళి వెలుగులా ఆకాశంలో కనువిందుచేస్తోంది.

సినిమా టికెట్లపై పేటీఎమ్ ఊహించని ఆఫర్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీల మహాసమూహాన్ని

నింగిలో భారత ఖగోళ శాస్త్రవేత్తలు ఓ గెలాక్సీల మహాసమూహాన్ని గుర్తించారు.

20 మిలియన్‌ బిలియన్‌ సూర్యుళ్లకు

అది సుమారు 20 మిలియన్‌ బిలియన్‌ సూర్యుళ్లకు సమానంగా ఉందట.ఈ అద్బుతానికి సరస్వతిగా నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోనమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ వెల్లడించింది.

10 బిలియన్‌ ఏళ్ల వయసున్న.

సమీప విశ్వాంతరాళంలో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదీ ఒకటని, 10 బిలియన్‌ ఏళ్ల వయసున్న ఈ సమూహం భూమికి 4 వేల మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు ఆ టీం పేర్కొంది.

600 మిలియన్‌ కాంతి సంవత్సరాల పరిధిలో

ఇది సుమారు 600 మిలియన్‌ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించినట్లు వెల్లడించింది.

గోడలాగా కనిపించే ఈ సమూహాన్ని

గోడలాగా కనిపించే ఈ సమూహాన్ని స్లోవాన్‌ డిజిటల్‌ స్కై సర్వే ద్వారా చూడొచ్చు. ఇదే సంస్థకు చెందిన పరిశోధకులు గతేడాది గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు.

1000- 10 వేల దాకా గెలాక్సీలు

ఒక సమూహంలో 1000- 10 వేల దాకా గెలాక్సీలుంటాయి. మహా సమూహంలో అయితే అలాంటి సమూహాలు దాదాపు 43 ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian Astronomers Discover Supercluster of Galaxies, Name It Saraswati Read More at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot