24 ఏళ్ల తరువాత..ఇస్రోకి సవాల్‌గా మారిన వైఫల్యం, విజయాల వెనుక..

Written By:

అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రోకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా సాగుతున్న అంతరిక్షయాత్రలో పీఎస్‌ఎల్‌వీ సీ-39 రాకెట్‌ వైఫల్యం ఇస్రోకి సవాలుగా మారింది. విజయాల ఇస్రోకి సవాల్ గా మారిన ఈ వైఫల్యానికి కారణాలు అనేకం ఉన్నాయి. కారణాలు ఓ సారి విశ్లేషిస్తే..

మరో రెడ్‌మి బాంబ్ : చిత్తూరులో పేలిన రెడ్‌మి నోట్ 4..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పీఎస్‌ఎల్‌వీ సీ-39 రాకెట్‌ వైఫల్యానికి

సొంత దిక్సూచి వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-39 రాకెట్‌ వైఫల్యానికి లోనుకావడం దేశం యావత్తును బాధలోకి నెట్టేసింది.

ఇస్రోకి 24 ఏళ్ల తరువాత

విజయాలకు దిక్సూచిగా మారిన ఇస్రోకి 24 ఏళ్ల తరువాత జరిగిన ఈ వైఫల్యం ఒక్కసారిగా నిరాశలోకి నెట్టివేసింది. అసలేం జరిగిందనే ప్రశ్నను లేవనెత్తింది.

ఉపగ్రహాన్ని కప్పి ఉన్న ఉష్ణకవచంలో

ఉపగ్రహాన్ని కప్పి ఉన్న ఉష్ణకవచంలో ప్రెజర్‌(ఒత్తిడి) లేకపోవడం వల్లే పీఎ్‌సఎల్‌వీ-సీ39 రాకెట్‌ విఫలమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రాథమిక విశ్లేషణలో కనుగొన్నారు.

రాకెట్‌ రెండోదశ ఇంజన్‌తో

రాకెట్‌ రెండోదశ ఇంజన్‌తో పయనిస్తుండగా విడిపోవాల్సిన ఉష్ణకవచం అలాగే ఉండిపోవడంతో అక్కడ నుంచే రాకెట్‌ గమనంలో అడ్డంకులు కలిగాయని గుర్తించారు.

ఉష్ణకవచం కింద ఉన్న గ్యాస్‌ కట్టర్‌ను మండించినా

ప్రయోగంలో రెండో దశ పనిచేస్తుండగా శాస్త్రవేత్తలు ఉష్ణకవచం కింద ఉన్న గ్యాస్‌ కట్టర్‌ను మండించినా ఉష్ణకవచంలో గ్యాస్‌ ప్రెజర్‌ కలగలేదని గుర్తించారు. ఫలితంగానే అల్యూమినియం రివిట్‌లు ఊడిపోక ఉష్ణకవచం ఉపగ్రహాన్ని వీడిపోలేదని తేలింది.

అధిక బరువు వల్ల

అధిక బరువు వల్ల రాకెట్ గమన వేగం సెకనుకు కిలోమీటరు మేర తగ్గిపోయింది. ఫలితంగా రాకెట్ ఉష్ణకవచం వేరుపడలేదు. పీఎస్ఎల్‌వీ రాకెట్ విజయాశ్వమైనా బరువు కారణంగా ప్రయోగం విఫలమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.

రాకెట్ సెకనుకు 9.5 కిలోమీటర్ల వేగంతో..

నిజానికి రాకెట్ సెకనుకు 9.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉండగా అధిక బరువు దాని వేగాన్ని గణనీయంగా తగ్గించిందని, సెకనుకు కిలోమీటర్ తగ్గడం ద్వారా 8.5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించిందని వివరించారు.

1969 ఆగస్టు 15న

1969 ఆగస్టు 15న ప్రారంభమైన ఇస్రో ప్రయా ణం ఎన్నో ఒడిదుడుకులను, అడ్డంకులను, వైఫల్యాలను చవిచూసింది. ప్రతి వైఫల్యంనుంచీ గుణపాఠం నేర్చుకుంటూ ఒక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించింది.

పీఎస్‌ఎల్‌వీ అందివచ్చిన అంతరిక్ష వాహక నౌక

ముఖ్యంగా మన శాస్త్రవేత్తలకు పీఎస్‌ఎల్‌వీ అందివచ్చిన అంతరిక్ష వాహక నౌక. ఎన్నడో 1993లో తొలిసారి ఆ రాకెట్‌ను ప్రయోగించి ఐఆర్‌ఎస్‌-1 ఉపగ్రహాన్ని పంపినప్పుడు ఎదురైన వైఫల్యం తప్ప ఈ 24 ఏళ్లలోనూ ఏనాడూ అది ఆశాభంగం కలిగించలేదు.

వరసగా 39 ప్రయోగాలూ ఘన విజయం

పంపించిన ప్రతిసారీ తిరుగులేని విజయాన్నందించింది. వరసగా 39 ప్రయోగాలూ ఘన విజయం సాధించాయంటే అది పీఎస్‌ఎల్‌వీ విశిష్టతే. ఈ విఫలమైన ప్రయోగం అనేక రకాల విశిష్టమైనది.

రక్షణ, పౌర అవసరాలకు వినియోగపడేలా

గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) మాదిరే మన రక్షణ, పౌర అవసరాలకు వినియోగపడేలా స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఉండాలని ఇస్రో సంకల్పించింది. అమెరికా, రష్యా, యూరప్, చైనాలు వేటికవి సొంత దిక్సూచి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాయి.

కీలక సమయంలో అది మొహం చాటేసే ప్రమాదం

అమెరికాకు చెందిన జీపీఎస్‌ మనకు అందుబాటులోనే ఉంది. అయితే కీలక సమయంలో అది మొహం చాటేసే ప్రమాదం కూడా లేకపోలేదని కార్గిల్‌ యుద్ధం రుజువు చేసింది.

కార్గిల్‌ ప్రాంతం నుంచి

మన దళాలు కార్గిల్‌ ప్రాంతం నుంచి పాక్‌ సేనలను తరిమికొట్టే తరుణంలో ఉద్దేశ పూర్వకంగా అమెరికా ఆ సేవలను ఆపేసింది.

ఇస్రో 1ఏ తో మొదలుబెట్టి 1జీ వరకూ

ఇక భవిష్యత్తులో ఇక ఎవరిపైనా ఆధార పడకూడదన్న దృఢ సంకల్పంతో ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)కింద ఇస్రో 1ఏ తో మొదలుబెట్టి 1జీ వరకూ ఏడు ఉపగ్రహా లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. 

ఆఖరి ఉపగ్రహం 1జీని

ఈ నెట్‌వర్క్‌లోని ఆఖరి ఉపగ్రహం 1జీని నిరుడు ఏప్రిల్‌లో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

ఇండియాని ప్రపంచ దేశాల మధ్యన నిలబెట్టేందుకు

ఇప్పుడు పీఎస్‌ఎల్‌వీ సీ-39 ప్రయోగం విఫలం అయింది. ఇండియాని ప్రపంచ దేశాల మధ్యన నిలబెట్టేందుకు ఇస్రోకి ఈ వైఫల్యం అడ్డంకి కాబోదు. ముందు ముందు విజయాలతో సవాల్ విసరాలని కోరుకుందాం. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian PSLV Rocket Failure Not Be Due To Design Fault Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot