నిప్పులు చిమ్ముతూ నింగిలోకి జీశాట్‌ -11,ఇస్రో ఖాతాలో మరో విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

|

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందజేయడం సహా కొత్తతరం అప్లికేషన్ల రూపకల్పనకు వేదికగా నిలవగలదని భావిస్తున్న సమాచార ఉపగ్రహం జీశాట్‌-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత దేశ అతిపెద్ద బరువున్న ఉపగ్రహం జీశాట్‌ -11ను ఇస్రో అధికారులు విజయవంతంగా కక్ష్యలోకి పంపారు. ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రంలో భారత కాలమానం ప్రకారం… తెల్లవారుజామున 2.08 నుంచి 3.23 గంటల మధ్య ఈ ప్రయోగం చేపట్టారు. భారత్‌ కొనుగోలు చేసిన ఫ్రెంచ్‌ ఏరియేన్‌ -5 రాకెట్‌ ద్వారా జీశాట్‌ -11ను ఇస్రో అధికారులు కక్ష్యలోకి పంపారు.

300లకు పైగా డ్రోన్లు భూమిని ఢీకొట్టాయి, నష్టం ఎంతో తెలుసా ?300లకు పైగా డ్రోన్లు భూమిని ఢీకొట్టాయి, నష్టం ఎంతో తెలుసా ?

రూ. 600కోట్లు ఖర్చు

రూ. 600కోట్లు ఖర్చు

బిగ్‌ బర్డ్‌గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకీ రూ. 600కోట్లు ఖర్చు చేసినట్లు ఇస్రో అధ్యక్షుడు డాక్టర్‌. కె.శివన్‌ తెలిపారు. గత మే 25నే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినా విఫలమైంది. ఇప్పుడు ఇది అదనపు సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

 

 

5,848 కిలోల బరువు

5,848 కిలోల బరువు

5,848 కిలోల బరువున్న జీ శాట్‌ -11 ఇప్పటివరకు భారత్‌ తయారు చేసిన ఉపగ్రహాలన్నింటికన్నాచాలా బరువైంది. దీన్ని అరియాన్‌ -5 రాకెట్‌ సాయంతో ఫ్రెంచ్‌ గయానానుంచి ప్రయోగించారు.

15 ఏళ్ల పాటు సేవలు

15 ఏళ్ల పాటు సేవలు

ఈ ఉపగ్రహంలో దేశ సమాచర వ్యవస్త కోసం 32 కేయీ బాండ్‌తో పాటు 8 కేఏ బాండ్‌ ట్రాన్స్‌ ఫాండర్లను ఏర్పాటు చేశారు. జీశాట్‌ -11 ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందింస్తుంది. దేశంలోని గ్రామ పంచాయితీలకు ఈ - గవర్నెన్స్‌కు జీశాట్‌ -11 పంపే సమాచారం ఉపయోగపడుతుంది.

న్యూ జనరేషన్ అప్లికేషన్ల రూపకల్పనకు మార్గం సుగమం

న్యూ జనరేషన్ అప్లికేషన్ల రూపకల్పనకు మార్గం సుగమం

జీశాట్ - 11 ద్వారా దేశవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింతగా విస్తరించనున్నాయి. అంతేకాదు న్యూ జనరేషన్ అప్లికేషన్ల రూపకల్పనకు మార్గం సుగమం కానుంది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్ - 5 రాకెట్ ద్వారా జీశాట్ - 11 ను ఇస్రో గగనతలంలోకి పంపించింది.

 

 

నాలుగు జీశాట్ -11 ప్రయోగాల్లో ఇది మూడోది

నాలుగు జీశాట్ -11 ప్రయోగాల్లో ఇది మూడోది

డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా సెకనుకు 100 జీబీ డాటా అందించేలా ఇస్రో ప్రయోగిస్తున్న నాలుగు జీశాట్ -11 ప్రయోగాల్లో ఇది మూడోది.

5,854 కిలోల పరిమాణం

5,854 కిలోల పరిమాణం

33 నిమిషాల పాటు ప్రయాణించిన ఏరియన్ - 5 రాకెట్.. జీశాట్ - 11 ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 5,854 కిలోల పరిమాణంలో ఉన్న ఈ ఉపగ్రహం పదిహేనేళ్ల పాటు సేవలు అందించనుంది.

 

 

అంతరిక్ష ఆస్తి

అంతరిక్ష ఆస్తి

సమాచార వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లనున్న జీశాట్ - 11 ఉపగ్రహం మనదేశానికి విలువైన అంతరిక్ష ఆస్తిగా అభివర్ణించారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్.

 

 

Best Mobiles in India

English summary
India's heaviest communication satellite GSAT-11 launched successfully from French Guiana More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X