తొలిదెబ్బకే ప్రపంచం విలవిల, వెక్కిరించిన చైనాకు ధీటైన జవాబు !

|

నిప్పులు చిమ్మకుంటూ నింగిలోకి వెళ్లిన ఇండియా మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అంగారక గ్రహం మీదకు చేరి అద్భుతమైన చిత్రాలను నేలమీదకు పంపిస్తోంది. ఇతర దేశాల వెక్కిరింపుల మధ్య ఇండియా సాగించిన అంగారక గ్రహ పయనం ప్రపంచాన్నే నివ్వెరపరుస్తూ విజయవంతంగా అంగారక గ్రహం మీద పరుగులు పెడుతోంది. విర్రవీగుతున్న చైనా అహంకారాన్ని పటాపంచల్ చేస్తూ దిగ్విజయంగా అక్కడి విశేషాలను భూమి మీదకు పంపిస్తోంది. ఇప్పటికే ఎన్నో వందల చిత్రాలను భూమి మీదకు పంపింది. శాస్త్రవేత్తల మెదళ్లకు పనిపెడుతోంది.

 

మాకు మీరే దిక్కంటున్న అగ్రరాజ్యంమాకు మీరే దిక్కంటున్న అగ్రరాజ్యం

 మొదటి ప్రయత్నంలో అంగారకుడిని చేరుకున్న దేశం భారత్ ఒకటే.

మొదటి ప్రయత్నంలో అంగారకుడిని చేరుకున్న దేశం భారత్ ఒకటే.

అనేక దేశాలు అంగారక గ్రహంపై ప్రవేశించడానికి ట్రై చేశాయి. అయితే కేవలం నాలుగు దేశాలు మాత్రమే విజయాన్ని సాధించాయి. అందులో భారత్ ఒకటి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే... మొదటి ప్రయత్నంలో అంగారకుడిని చేరుకున్న దేశం భారత్ ఒకటే.

మంగళవారం రోజు మొదలై..

మంగళవారం రోజు మొదలై..

మంగళయాన్ యాత్ర అత్యంత క్లిష్టమైన పని... అది ఎక్కువ మంది అరిష్టంగా భావించే మంగళవారం రోజు మొదలై, అమావాస్య రోజున లక్ష్యం చేరుకుంది.

గ్రావిటీ సినిమాకంటే తక్కువ ఖర్చుతో
 

గ్రావిటీ సినిమాకంటే తక్కువ ఖర్చుతో

హాలీవుడ్లో తీసిన గ్రావిటీ సినిమాకంటే తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషను విజయవంతం చేయడం భారత్ కే చెల్లింది. దీనికి అయిన ఖర్చు కేవలం 450 కోట్లు. అగ్రదేశాలు దీనికోసం ఎన్నో కోట్లను ఖర్చుపెడుతున్నాయి.

ప్రముఖ భారతీయ ప్రైవేటు కంపెనీల సహకారం

ప్రముఖ భారతీయ ప్రైవేటు కంపెనీల సహకారం

ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం వెనుక కొన్ని ప్రముఖ భారతీయ ప్రైవేటు కంపెనీల సహకారం ఉంది. అవి ఎల్ అండ్ టీ, గోద్రెజ్ అండ్ బైస్, వాల్ చంద్ నగర్ ఇండస్ట్రీస్, హెచ్ఏఎల్.

మరో ఐదు వేల కోట్ల స్పేస్ బిజినెస్

మరో ఐదు వేల కోట్ల స్పేస్ బిజినెస్

ఈ సక్సెస్ వల్ల భారత్ వద్ద ఎంత నాణ్యమైన మానవ వనరులు, సాంకేతిక వనరులు ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పాం. దీని వల్ల మరో ఐదు వేల కోట్ల స్పేస్ బిజినెస్ కు మార్గం సుగమం అయ్యింది.గ్రహాంతర అంతరిక్ష ప్రయోగ శాలలకు ఈ మంగళయాన్ బీజం వేసింది.

కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం

కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం

మంగళయాన్ చిన్న పేలోడ్ కావచ్చు, కానీ అది కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుందంటూ బీబీసీ సైన్స్ ఎడిటర్ తన మనసులోని భావాల్ని వ్యక్తీకరించారు.

మీథేన్ జాడను..

మీథేన్ జాడను..

మామ్ అంగారకుడిపై మీథేన్ జాడను మనకు తెలపనుంది. ఇది జీవ ఆవాసానికి అత్యంత అవసరమైన వాయువు. అరుణగ్రహంపై ఉన్న నీరు మాయం కావడానికి గల కారణాలు ఇది మనకు తెలిజెబుతుంది.

తిరుగులేని రీతిలో చాయాచిత్రాలను

తిరుగులేని రీతిలో చాయాచిత్రాలను

మార్స్ మిషన్‌తో అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన మంగళయాన్ ఉపగ్రహం తిరుగులేని రీతిలో చాయాచిత్రాలను పంపించింది. మంగళయాన్‌లోని అనేక శక్తివంతమైన కెమెరాలు అంగారక గ్రహ త్రిడి ఇమేజ్‌లతోపాటు ఎన్నో వౌలిక వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించాయి.

అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం

అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం

ఈ వ్యోమనౌకలో అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉందని 2015 జూన్‌లో ఆనాటి ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌ 24తో మంగళయాన్‌ మూడేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో 2014 సెప్టెంబర్‌ 24 నుంచి గత ఏడాది సెప్టెంబర్‌ 23 వరకూ అది సేకరించిన డేటాను ఇస్రో విడుదల చేసింది.

2014 సెప్టెంబర్‌ 24న విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి

2014 సెప్టెంబర్‌ 24న విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. 2013 నవంబర్‌ 5న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అనంతరం ఆ వ్యోమనౌక.. 2014 సెప్టెంబర్‌ 24న విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా మొదటి ప్రయత్నంలోనే ఆ గ్రహం వద్దకు చేరుకున్న తొలి దేశంగా భారత్‌ ఘనత సాధించింది.

మంగళయాన్' ప్రయోగంపై చైనా గ్లోబల్ మీడియా

మంగళయాన్' ప్రయోగంపై చైనా గ్లోబల్ మీడియా

2013లో ‘మంగళయాన్' ప్రయోగంపై చైనా గ్లోబల్ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ ప్రయోగంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అరుణగ్రహంపై మంగళయాన్‌ ఉపగ్రహాన్ని పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కోట్లాదిమంది పేదలు, నిరక్షరాస్యతతో బాధపడుతున్న భారత్‌కు ‘మంగళయాన్' అవసరమా? అంటూ విమర్శించింది.

Best Mobiles in India

English summary
India’s Mars Orbiter Mission Successfully Completed 3 Years in Martian Orbit Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X