సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో..

Written By:

ఇస్రో ఇప్పుడు నింగిలోకి మరో నాలుగు శాటిలైట్లను పంపే పనిలో ఉంది. అంతే కాదు చంద్రుని గుట్టు తెలుసుకునేందుకు మరో రోవర్ చంద్రయాన్ 2ను ఆకాశంలోకి పంపనుంది. వీటితో పాటు సూర్యుడి గురించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అలాగే సూర్యుడిపై విస్తృత పరిశోధనల కోసం ఏకంగా ఆదిత్య 20 మిషన్ పేరుతో ఓ పెద్ద మిషన్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2020కి ఇస్రో సూర్యుని గుట్టు తెలుసుకునే అవకాశం ఉంది.

బాబోయ్..ఈ చిత్రాలు జపానోళ్లకే సాధ్యం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

ఇస్రో మూడు నెలల్లో నాలుగు కీలక ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు కసరత్తులు చేస్తోంది.అలాగే రానున్న 3 సంవత్సరాల్లో 70 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని బెంగళూరులోని ఇస్రో ఉపగ్రహ కేంద్రం సంచాలకులు మైలాస్వామి అన్నాదురై తెలిపారు

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

ఇప్పటికే ఆగస్టు 2015-2016 మధ్యలో 10 శాటిలైట్లు నింగిలోకి పంపామని ఇవి కాకుండా మరో నాలుగు శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్ర్తవేత్తలు ప్లాన్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

INSAT-3DR and SCATSAT-1 లను ఈ సంవత్సరం సెప్టెంబర్ లో నింగిలోకి ప్రవేశపెడతామని అలాగే , GSAT-18 అక్టోబర్ లో, ResourceSat-2A in నవంబర్ లో నింగిలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర కసరత్తు చేస్తున్నారని తెలిపారు.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

వీటితో పాటు చంద్రునిపై పరిశోధనల కోసం ఇప్పటికే చంద్రయాన్ 1 ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రష్యాతో కలిసి చంద్రయాన్ 2 ను రూపొందించే పనిలో ఇస్రో తలమునకలైనట్లుగా తెలుస్తోంది.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

దీనికింద జాబిల్లి ఉపరితలంపై ఒక రోవర్‌ను దించి, రసాయన విశ్లేషణలు సాగించనున్నట్లు వివరించారు.చంద్రుడిపై పరిశోధనల కోసం ఉద్దేశించిన చంద్రయాన్‌-2ను వచ్చే ఏడాది చివర్లో కానీ 2018 తొలి త్రైమాసికంలో కానీ ప్రయోగిస్తామన్నారు. ఇది ఇండియా సోలో ప్రాజెక్ట్

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

వీటితో పాటు సూర్యుడిపై విస్తృత పరిశోధనల కోసం ‘ఆదిత్య-ఎల్‌1' ఉపగ్రహాన్ని 2020లో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

ఆదిత్య-ఎల్‌1లో ఆరు పరిశోధన పరికరాలు ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు-1 (ఎల్‌1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశీలించడానికి వీలవుతుంది.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌరగోళానికి వేల కిలోమీటర్ల దూరంవరకూ ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 10 లక్షల డిగ్రీల కెల్విన్‌ వరకూ చేరుకుంటుంది.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత 6వేల డిగ్రీల కెల్విన్‌ ఉంటుంది. కరోనాలో వేడిమి అంత ఎక్కువగా పెరిగిపోవడానికి కారణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ఈ అంశంపై ఆదిత్య ఎల్‌1 దృష్టి సారిస్తుంది.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరు తెన్నుల గురించి ఇది పరిశోధిస్తుంది. సౌర తుపాను సమయంలో వెలువడే ఈ రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్పియర్‌), వర్ణ మండలాలను (క్రోమోస్పియర్‌) అధ్యయనం చేస్తారు.

సూర్య చంద్రుల గుట్టు ఇప్పుడు ఇస్రో చేతిలో

ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఇక త్వరలోనే సూర్యుని గుట్టు అంతా ఇస్రో చేతికి చిక్కే అవకాశం ఉందన్నమాట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ISRO To Launch Four Key Satellites In The Next Three Months Reveals Plans To Go To The Sun
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot