ఆకాశానికి నిచ్చెన ఎంత వరకు సాధ్యం ?

ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లు దూసుకొనివెళ్లడం చూసాం ఇప్పుడు ఏకంగా అంతరిక్షానికి మార్గం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జపాన్ కి చెందిన శాస్త్రవేత్తలు

By Anil
|

ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లు దూసుకొనివెళ్లడం చూసాం ఇప్పుడు ఏకంగా అంతరిక్షానికి మార్గం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జపాన్ కి చెందిన శాస్త్రవేత్తలు .స్పేస్ ఎలివేటర్‌ను ఉపయోగించి అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అవసరమైన వ్యక్తులను, వస్తువులను, యంత్ర సామాగ్రిని సులభంగా అక్కడికి చేర్చవచ్చుని అలాగే అక్కడి నుంచి తిరిగి భూమికి తీసుకొచ్చే పని కూడా సులభం అయిపోతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ప్రస్తుతం ఈ బృందం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సమీపంలో ఒక స్పేస్ ఎలివేటర్ నమూనాను పరీక్షిస్తుంది .

Shizuoka విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్....

Shizuoka విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్....

స్థానిక వార్తాపత్రిక ప్రకారం, Shizuoka విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అభివృద్ధి రెండు అల్ట్రా చిన్న క్యూబిక్ ఉపగ్రహాలు ISS నుండి అమలు చేయబడతాయి. రెండూ ఒక ఉక్కు కేబుల్ ద్వారా సుమారు 10 మీటర్ల పొడవుతో అనుసంధానించబడి ఉంటాయి, ఇవి మోటారును ఉపయోగించి రెండు మధ్య ఎలివేటర్ కారును అమలు చేస్తాయి. ప్రతి ఉపగ్రహంలో జత చేయబడిన ఒక కెమెరా కారు యొక్క పురోగతిని రికార్డ్ చేసి ప్రదేశంలో ప్రయోగాన్ని పర్యవేక్షిస్తుంది.

రాకెట్ సాంకేతికతకు మూలకర్త సియాల్కో విస్కీ.....

రాకెట్ సాంకేతికతకు మూలకర్త సియాల్కో విస్కీ.....

రాకెట్ సాంకేతికతకు మూలకర్త సియాల్కో విస్కీ స్పేస్ ఎలివేటర్ల గురించి ఎప్పుడో ఊహించాడు. ఆయన ఊహించింది తీగలాంటి నిర్మాణం కాదు.. ఒక బురుజు నిర్మాణం. సియాల్కో ఊహించిన టవర్ నేల మీద నుంచి 35,790 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందట. భూమి వ్యాసార్థం 6378 కిలోమీటర్లు కాబట్టి అలాంటి టవర్ అగ్రభాగం జియోస్టేషనరీ కక్ష్యను తాకుతుందని లెక్కలు చెప్పాడు.

స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది రోప్.....

స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది రోప్.....

స్పేస్ ఎలివేటర్ నిర్మించాలంటే.. నేలపై నుంచి ఆకాశంలో భూస్థిర కక్ష్య దాకా అంటే సుమారు 22 వేల మైళ్ల ఎత్తు దాకా ఒక రోప్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే.. ఇది అంత సులభమైన పని కాదన్నమాట. ఇందుకోసం పక్కా ప్రణాళిక, పకడ్బందీ సామాగ్రి అవసరం. భూమి నుంచి ఎత్తు పెరుగుతూ ఉంటే గురుత్వ శక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే అపకేంద్ర బలం ఎక్కువ అవుతూ ఉంటుందిదీని ద్వారా ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి సునాయసంగా ప్రవేశపెట్టొచ్చు.

ప్రస్తుతం ఇలాంటి పనుల కోసం....

ప్రస్తుతం ఇలాంటి పనుల కోసం....

ప్రస్తుతం మనుషులని కానీ ,కార్గోను కానీ రాకెట్ ద్వారా పంపించాలి అంటే చాలా ఖర్చు అవుతుంది .ఈ స్పేస్ ఎలివేటర్ సాధ్యమైతే ఈ ఖర్చు దాదాపు సగానికి సగం తగ్గుతుంది.

 

 

 

Best Mobiles in India

English summary
Japan Is Testing An Elevator That Could One Day Take Humans Into Space Without A Rocket.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X