నేలంటూ లేని గ్రహంలోకి ‘జునో స్పేస్‌క్రాఫ్ట్’!

జూపిటర్ (బృహస్పతి) గ్రహం పై పరిశోధనలు జరిపేందుకు 2011లో నాసా ప్రయోగించిన జునో స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ 5 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణం తరువాత ఆ గ్రహ ఉపరితలంలోకి ప్రవేశించింది.

నేలంటూ లేని గ్రహంలోకి ‘జునో స్పేస్‌క్రాఫ్ట్’!

Read More : సామ్‌సంగ్, మోటరోలా ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సోలార్ శక్తి ఆధారంగా పనిచేసే ఈ మిషన్ ఈ ఐదేళ్ల కాలంలో 170 కోట్ల కీలోమీటర్ల మేర ప్రయాణం చేసింది. గురు గ్రహం పై అయిస్కాంత క్షేత్రాలు, రసాయనాలతో పాటు అక్కడి స్థితిగతులను జునో మిషన్ అధ్యయనం చేస్తుంది. బృహస్పతి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన జునో మిషన్ నుంచి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2011 ఆగష్టు 5న

2011 ఆగష్టు 5వ తేదీన ‘జునో స్పేస్‌క్రాఫ్ట్ మిషన్'ను ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి నాసా ప్రయోగించింది. దాదాపు 5 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణం తరువాత జూలై 31, 2016న గురు గ్రహ కక్ష్యలోకి జునో స్పేస్‌క్రాఫ్ట్ అడుగుపెట్టింది.

అతి దగ్గరగా వెళ్లిన గ్రహం

జూపిటర్ గ్రహానికి  అతి దగ్గరగా ప్రయాణిస్తోన్న మొదటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్‌గా జునో చరిత్ర సృష్టించింది.

అంతుచిక్కని గ్యాస్ నిక్షేపాలు

గురు గ్రహంలోని అంతుచిక్కని గ్యాస్ నిక్షేపాలకు సంబంధించిన సమాచారాన్ని జునో మిషర్ పరిశోధించనుంది.

అత్యంత కఠినతరమైన వాతావరణంలో

గురు గ్రహం పై పరిశోధనలు సాగించే క్రమంలో అత్యంత కఠినతరమైన పరిస్థితులను జునో మిషన్ ఎదుర్కోవల్సి ఉంటుంది.

భారీగా వెచ్చించిన అమెరికా

జునో స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ పై అమెరికా ప్రభుత్వం 1.1 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది.

జునో కంటే ముందు గెలీలియో

జునో కంటే ముందు గెలీలియో పేరుతో వాహకనౌకను జూపిటర్ పైకి నాసా ప్రయోగించింది. అయితే ఈ మిషన్ 2003 సెప్టెంబరు 21న గురు గ్రహం పైనే కూలిపోవటం విశేషం.

భయంకరమైన రేడియోషన్

గురు గ్రహం పై రేడియోషన్ భయంకరంగా ఉంటుందట. భూమి పై రేడియోషన్ శాతం 0.3 RADగా ఉంటే, గురు గ్రహం పై 20,000,000 RADగా ఉంటుందట.

అసలు నేలే ఉండదు

జూపిటర్ గ్రహం పై అసలు నేలే ఉండదు. ఈ గ్రహాన్ని బృహత్తరమైన వాయురాశిగా పిలుస్తారు. ఈ గ్రహంలో ఉండే వాయువులో అధిక భాగం హైడ్రోజెన్ ఉంటుంది.

17వ శతాబ్దం నుంచే ప్రయోగాలు

17వ శతాబ్దం నుంచి గురు గ్రహానికి సంబంధించిన ప్రయోగాలు, ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాలు ఇంకా మిస్టరీగానే ఉంటున్నాయి.

9 అత్యాధునిక సాంకేతిక పరికరాలు

జునో స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌లో 9 అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. గ్రహం పై పరిశోధనలు సాగించటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

2018 ఫిబ్రవరి 20తో

2018 ఫిబ్రవరి 20న జునో స్పేస్ క్రాఫ్ట్ మిషన్ పని ముగుస్తుంది. ఈ లోపు జునో బృహస్పతి చుట్టూ 37 సార్లు పరిభ్రమిస్తుంది.

రోమన్ శాస్త్రం ప్రకారం

రోమన్ శాస్త్రం ప్రకారం దేవతల రాజైన బృహస్పతి (జూపిటర్) మేఘాలతో ఆవరించి ఉంటాడు. మేఘాల్లో ఉన్న బృహస్పతి జాడను మొదటగా అతని భార్య జునో తెలుసుకుంటుంది. అందుకే ఈ జు స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌కు ‘జునో' అని పెరు పెట్టారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Juno mission to Jupiter reaches turning point: 10 quick points on Juno mission.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot