భూమికి గుడ్‌బై చెప్పిన కెప్లర్ టెలిస్కోప్, చరిత్రను తలుచుకుంటే ?

కెప్లర్‌ అంతరిక్ష టెలిస్కోపు శకం ముగిసిపోయింది.

|

కెప్లర్‌ అంతరిక్ష టెలిస్కోపు శకం ముగిసిపోయింది. దశాబ్దం పాటు సౌర కుటుంబం వెలుపల, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టిన కెప్లర్లో మరిన్ని పరిశీలనలు సాగించేందుకు అవసరమైన ఇంధనం లేకపోవడంతో స్వస్తి పలకాలని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నిర్ణయించింది. కెప్లర్‌ తన ప్రస్థానంలో 2600కుపైగా ఎక్సోప్లానెట్లను గుర్తించింది. అందులో జీవులకు ఆవాసయోగ్యమైనవి కూడా ఉన్నాయి. ఈ టెలిస్కోపు తమ అంచనాలకు మించి పనిచేసిందని నాసా తెలిపింది.సౌర కుటుంబంలో, వెలుపల జీవుల అన్వేషణకు బాటలు పరిచిందని వివరించింది.

స్టీవ్ జాబ్స్‌ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కూతురు..స్టీవ్ జాబ్స్‌ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కూతురు..

కెప్ల‌ర్ టెలిస్కోప్‌ను...

కెప్ల‌ర్ టెలిస్కోప్‌ను...

గ్ర‌హాల అన్వేష‌ణ కోసం నాసా మొద‌టిసారి కెప్ల‌ర్ టెలిస్కోప్‌ను అంత‌రిక్షంలోకి పంపించింది. మ‌న పాల‌పుంత‌లో ఉన్న 2662 గ్ర‌హాల‌ను అది గుర్తించింది. ఆ డేటాను ఇంకా మ‌న శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేస్తున్నారు.

ల‌క్ష‌ల సంఖ్యలో గ్ర‌హాలు...

ల‌క్ష‌ల సంఖ్యలో గ్ర‌హాలు...

సౌర కుటుంబం అవ‌త‌ల ల‌క్ష‌ల సంఖ్యలో గ్ర‌హాలు ఉండి ఉంటాయ‌ని కూడా కెప్ల‌ర్ ఓ అంచ‌నా వేసింది. 2009లో కేవ‌లం ఆరేళ్ల కాల ప‌రిమితితో కెప్ల‌ర్‌ను ప్ర‌యోగించారు. కానీ అది 9 ఏళ్లు ప‌నిచేసింది.

 

 

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించారు నాసా శాస్త్రవేత్తలు...
 

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించారు నాసా శాస్త్రవేత్తలు...

నవంబర్ 15న గుడ్ నైట్ కమాండ్ ఇవ్వడం ద్వారా, ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించారు నాసా శాస్త్రవేత్తలు. ఇందులోని ఇంధనం అయిపోవడంతో, ఇక ఈ టెలిస్కోప్‌ సేవల్ని అందుకోవడం సాధ్యంకాదని సైంటిస్టులు తెలిపారు .

జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త జొహన్నెస్ కెప్లర్....

జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త జొహన్నెస్ కెప్లర్....

388 ఏళ్ల కిందట జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త జొహన్నెస్ కెప్లర్ నవంబర్ 15న చనిపోయారు. సరిగ్గా అదే రోజున కెప్లర్ టెలిస్కోప్‌కి కూడా గుడ్ బై చెప్పారు నాసా సైంటిస్టులు. జొహన్నెస్ కెప్లర్, గ్రహాల కదలికలపై పరిశోధన చేయడంతో పాటు గ్రహగమన సిద్ధాంతాల్నిప్రతిపాదించారు. ఆయన సేవలకు గుర్తుగా ఈ టెలిస్కోప్‌కి ఆయన పేరునే పెట్టారు.

గ్రహాలపై అవగాహన కల్పించడంలో కెప్లర్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది....

గ్రహాలపై అవగాహన కల్పించడంలో కెప్లర్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది....

మన సౌర కుటుంబం అవతల ఉన్న వేల గ్రహాలపై అవగాహన కల్పించడంలో కెప్లర్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. 2009 మార్చి 6న నింగిలోకి వెళ్లిన ఈ టెలిస్కోప్, భూమి నుంచీ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో, సూర్యుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన సాగించింది.

దీనిలోని అతి పెద్ద డిజిటల్ కెమెరా...

దీనిలోని అతి పెద్ద డిజిటల్ కెమెరా...

దీనికి ఉన్న పరికరాలు అప్పట్లో అత్యంత అధునాతనమైనవి. దీనిలోని అతి పెద్ద డిజిటల్ కెమెరా, నక్షత్ర మండలాల కాంతిని తట్టుకొని మరీ అక్కడి గ్రహాల్ని పరిశీలించింది.అంత‌రిక్షంలో గ్ర‌హాన్వేష‌ణ కోసం కెప్ల‌ర్‌లో అత్యాధునిక డిజిట‌ల్ కెమెరాల‌ను అమ‌ర్చారు.

 

 

సిగ్నస్ నక్షత్ర మండలంలోని...

సిగ్నస్ నక్షత్ర మండలంలోని...

ప్రధానంగా సిగ్నస్ నక్షత్ర మండలంలోని లక్షా 50 వేల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని ఈ టెలిస్కోప్ నిశితంగా చూసింది. మన పాలపుంతలో భూమి లాంటి గ్రహాల్ని కనిపెట్టడంలో కూడా కెప్లర్ టెలిస్కోప్ ఎంతో ఉపయోగపడింది.

 

 

నాసా ఇలాంటిదే మరో టెలిస్కోప్ తయారుచేసింది....

నాసా ఇలాంటిదే మరో టెలిస్కోప్ తయారుచేసింది....

ఇది కాలగర్భంలో కలిసిపోతున్న క్రమంలో నాసా ఇలాంటిదే మరో టెలిస్కోప్ తయారుచేసింది. అదే ట్రాన్సిటింగ్ ఎక్జోప్లానెట్ సర్వే శాటిలైట్ (టెస్). ఏప్రిల్‌లో దాన్ని రోదసిలోకి పంపింది. కెప్లర్ టెలిస్కోప్ కంటే టెస్ అత్యంత శక్తిమంతమైనది. ఇది అప్పుడే మికి దగ్గర్లోని 2 లక్షల నక్షత్రాల్ని పరిశీలించి, విలువైన సమాచారం అందించింది.

Best Mobiles in India

English summary
Kepler Space Telescope Bid ‘Goodnight’ With Final Set of Commands more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X