మరో 40 రోజుల్లో భారీ పేలుడు, మిస్టరీగా మారిన శకలాలు !

Written By:

గత నెల 31న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇస్రో ప్రయోగం విఫలం కావడంతో రోదసిలో కొట్టుమిట్టాడుతున్న ఆ ఉపగ్రహం మరో 40 రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని సమాచారం. 

మరో 40 రోజుల్లో భారీ పేలుడు, మిస్టరీగా మారిన శకలాలు !

ఆ సమయంలో అది పేలిపోతే దాని శకలాలు తీవ్రనష్టాన్ని కలగజేసే అవకాశముందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.మరో 40 లేదా 50 రోజుల్లో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుందని తెలుస్తోంది.

అమెరికాకు దిమ్మతిరిగింది, ఇచ్చిందెవరో తెలిస్తే ఇంకా షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేలిపోతే దాని శకలాలు

ప్రస్తుతం ఆ ఉపగ్రహం శర వేగంగా భూ వాతావరణం వైపు వస్తోంది. ఒకవేళ అది పేలిపోతే దాని శకలాలు ఎక్కడ పడతాయనే విషయంలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌

దేశీయ నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకునే క్రమంలో భాగంగా.. ఆగస్టు 31న ఇస్రో ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.

అందులో 750 కేజీల ఇంధనం

దాదాపు 2.4 టన్నుల బరువున్న ఈ ఉపగ్రహం నుంచి ప్రస్తుతం ట్రాకింగ్ స్టేషన్లకి సంకేతాలు అందుతున్నాయి. అందులో 750 కేజీల ఇంధనం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంధనం మండించేందుకు

ఈ ఉపగ్రహానికి సంకేతాలు పంపి ఇంధనం మండించేందుకు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని డైరక్టర్‌ కె. శివన్‌ తెలిపారు.

ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో

అయితే అది రోదసిలోకి కిలోమీటర్ వేగంతో వెళితే రోదసీ నుంచి నుంచి భూవాతావరణంలోకి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని ఇస్రోలో పనిచేసిన మరో సీనియర్ శాస్త్రవేత్త చెబుతున్నారు.

ఇస్రో వద్ద మల్టీ అబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ

అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే శకలాల వేగాన్ని కనిపెట్టడానికి నాసా దగ్గర టూ ఎలిమెంట్‌ సిస్టమ్‌ అనే వ్యవస్థ, ఇస్రో వద్ద మల్టీ అబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఉపగ్రమాలు, శకలాల జాడను కనుగొనే అవకాశం కూడా ఉంది.

మరో స్కైలాబ్‌ అయ్యే అవకాశం

ఏది ఏమైనా రోదసీ నుంచి భూమివైపు దూసుకొస్తున్న ఈ ఉపగ్రహం సముద్రంలో కూలే అవకాశం ఉందని దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండబోదని, ఇది మరో స్కైలాబ్‌ అయ్యే అవకాశం లేదని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరక్టర్‌ కె. శివన్‌ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Lost ISRO Satellite Expected to Re-enter Atmosphere in 40-60 Days Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting