ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది అస్సలు మిస్సవ్వకండి
ఆకాశంలో ఈ నెలలో రెండు అద్భుతాలు జరగనున్నాయి. చంద్రుడు వంద నిమిషాలకు పైగా మాయం కానున్నాడు.ఇది ఈ శతాబ్దంలోనే అత్యధిక సమయం కొనసాగిన చంద్ర గ్రహణం కావడం విశేషం
ఆకాశంలో ఈ నెలలో రెండు అద్భుతాలు జరగనున్నాయి. చంద్రుడు వంద నిమిషాలకు పైగా మాయం కానున్నాడు.ఇది ఈ శతాబ్దంలోనే అత్యధిక సమయం కొనసాగిన చంద్ర గ్రహణం కావడం విశేషం. అదే విధంగా ఈ నెలాఖరులో గ్రాహం అయిన అంగారకుడు మనల్ని పలకరించనున్నాడు. దాదాపు 17 ఏళ్ళ తరువాత భూమి సమీపం లోకి వస్తున్న అంగారకుడుని మనం నేరుగా చూసే అవకాశం ఉండడం మరొక విశేషం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకలు ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోలకతాలోని MP Birla Institue Of Fundamental రీసెర్చ్ శాస్త్రవేత్తల ప్రకారం ఈ రోజు సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించనుంది.

గ్రహణం సమయం....
భారత్ తో సహా ప్రపంచంలోని అధిక శాతం దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి 11:50 pm కు ప్రారంభమై రేపు తెల్లవారు జామున 1:39 am కు ముగియనుంది. అంటే గ్రహణం 1 గంట 45 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ శతాబ్దంలోనే ఎక్కువ కాలం కొనసాగిన గ్రహణంలా రికార్డు సృష్టించబోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రహణం పూర్తయిన నాలుగు రోజులకు....
గ్రహణం పూర్తయిన నాలుగు రోజులకు అంటే ఈ నెల 31వ తేదీన అంగారక గ్రాహం భూమికి సమీపం లోకి రానుంది. ఆ సమయం లో భూమికి అంగారకుడికి మధ్య దూరం 5.76 కోట్ల kmలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు .

సుర్యాస్తమయం తరువాత....
సుర్యాస్తమయం తరువాత అంగారకుడు ప్రకాశవంతంగా ఆకాశంలో కనిపిస్తుందని సూర్యోదయం వరకు ఉంటుందని చే శాత్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశం లో ఆగ్నేయ ప్రాతం లో కన్పిస్తోందని మనం నేరుగా కంటి తో చూడవొచ్చన్నారు. ఇలా అంగారకుడు మనం కంటితో చూసేంత సమీపం లోకి దాదాపు 17 ఏళ్లకు ఒకసారి అరుదుగా రెండు సార్లు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంలో 2003లో...
గతంలో 2003 లో 5.5కోట్ల kmల దూరంలోకి రాగ 60,000 ఏళ్ళ తరువాత అత్యంత సమీపానికి వచ్చిన రికార్డు నమోదు అయిందని అన్నారు. ఆ సమయం లో ఆకాశంలో రెండు చంద్రులు ఉన్నట్టు అనిపించిందన్నారు.

15 ఏళ్ళ తరువాత...
మళ్ళి 15 ఏళ్ళ తరువాత ఈ నెల భూమి సమీపం లోకి అంగారక గ్రాహం రానుంది. ఇలాంటి ఘటన 2020 సంవత్సరం అక్టోబర్ 6న పునరావృతం అవుతుంది. అయితే ఆ సమయంలో భూమికి 6.17 కోట్ల kmలు దూరంలో ఉండడం వలన ఇప్పటితో పోల్చితే తక్కువ పరిమాణంలో తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ తరువాత మళ్ళి 2030 సంవత్సరంలో కనిపించనుంది


Click it and Unblock the Notifications








