ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ నాశనం అయ్యే ప్రమాదం! నివారించే మార్గం ఏమిటి ?
భూమిపైన మనిషి వర్చువల్ జీవితం పై ఎంత ఎక్కువగా ఆధారపడుతున్నాడో మనము చూస్తూనే ఉన్నాము. ప్రతి విషయము ఇంటర్నెట్ ద్వారా సులువుగా చేసుకునే ఈ కాలంలో ఒక్కసారిగా ప్రపంచం మొట్ట ఇంటర్నెట్ ఆగిపోతే ఎలా ఉంటుంది అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా ? ఈ వార్త అనేకమందిని కలవరపెడుతుంది. ఒక కొత్త పరిశోధన ప్రకారం, ఒక భారీ సౌర తుఫాను 'ఇంటర్నెట్ అపోకలిప్స్' లాంటి భారీ అంతరాయానికి కారణమయ్యే అన్ని సాంకేతిక మౌలిక సదుపాయాలను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.అని వివరించారు.

పరిశోధన
ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఇర్విన్ మరియు VMware రీసెర్చ్ సంగీత అబ్దు జ్యోతి కలిసి ప్రచురించారు. రాబోయే ఈ భారీ సౌర తుఫాను సంభవించినట్లయితే అది ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌కు కారణమవుతుంది మరియు మన డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మారుస్తుంది అని తెలిపారు.ఈ సౌర తుఫాను ఈ దశాబ్దం లో జరగవచ్చని కూడా అంచనావేశారు. ఇంకా , తన పరిశోధన వివరాల ప్రకారం స్థానిక మరియు ప్రాంతీయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు తీవ్రమైన సౌర తుఫానుల సమయంలో ఎక్కువగా దెబ్బతినక పోవచ్చని తెలిపింది.

ఈ సౌర తుఫాను సమయంలో
ఫైబర్ ఆప్టిక్‌ని ఉపయోగిస్తుండటంతో నష్టం జరిగే ప్రమాదం తక్కువగా ఉంటుందని గుర్తించారు. ప్రపంచాన్ని తిరోగమనం కోసం సిద్ధం చేయలేదని సూచించింది. "మా మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున సోలార్ ఈవెంట్ కోసం సిద్ధం చేయబడలేదు. నష్టం ఎంత మేరకు ఉంటుందో మాకు చాలా పరిమిత అవగాహన ఉంది" అని ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.ఈ సౌర తుఫాను సమయంలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లను సముద్ర తీరానికి అనుసంధానించడానికి ఉపయోగించే రిపీటర్లు ఆగిపోయి ఆఫ్‌లైన్‌కు వెళ్లిపోతాయని పరిశోధకులు భయపడుతున్నారు. సముద్రగర్భ కేబుల్స్ నుండి వచ్చే ఇంటర్నెట్‌పై మాత్రమే ఆధారపడే వారి కోసం ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌ను సృష్టించడం అవుతుంది.

ఇదివరకు కూడా ఇలాంటి తీవ్రమైన సౌర తుఫానులు
జరగబోయే సౌర తుఫాను కాక, ఇదివరకు కూడా ఇలాంటి తీవ్రమైన సౌర తుఫానులు 1859, 1921 లో సంభవించాయి, మరియు ఇటీవల 1989 లో సంభవించింది. 1989 లో హైడ్రో-క్యూబెక్ పవర్ గ్రిడ్‌ను పూర్తిగా నాశనం చేసింది. దీని కారణంగా పవర్ గ్రిడ్ ను మార్చవలసి వచ్చింది. ఈశాన్య కెనడాలో తొమ్మిది గంటల విద్యుత్ నిలిపివేతకు కారణమైంది. ఇలాంటి సందర్భం మరొక్క సారి ఎదురైతే ఎంతవరకు నష్టం సంభవిస్తుందని ప్రముఖ వార్త పత్రిక నిర్వహించిన ఒక అంచనా ప్రకారం, ఇంటర్నెట్ పోతే US ఆర్థిక వ్యవస్థకు రోజుకు $ 7.2 బిలియన్లు (రూ.52 వేలకోట్లు) నష్టం సంభవిస్తుంది. మరియు ఇది ఒక సంఖ్య మాత్రమే పెరుగుతుంది, ప్రత్యేకించి కొనసాగుతున్న మహమ్మారి మధ్య ప్రపంచం ఇప్పుడు ఇంతకు ముందుకంటే ఇంటర్నెట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది.

సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్ ల గురించి మీకు తెలుసా ?
మనము ప్రతి రోజు వాడుతున్న ఇంటర్నెట్ కు ఇంత ముఖ్యమైన సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్ ల గురించి మీకు తెలుసా ? ఇవి ఎంత ముఖ్యమైన వో అంత ఖర్చుతో కూడుకున్నవి కూడా.ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా దాదాపు 99 శాతం సముద్రంలో ఉన్న కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. దీన్నే submarine communications cables అంటారు. వేలమైళ్ల దూరం ఈ కేబుల్స్ వేసి ఉంచారు. ఇంకా చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువగానే ఈ లైన్స్ పొడవు ఉంటుంది.సముద్రంలో దాదాపు 8 వేల అడుగుల లోతులో కూడా ఈ కేబుల్స్ ఉంటాయి.

7,50,000 మైళ్ల పొడవైన కేబుల్
న్యూయార్క్ నుంచి సిడ్నీ, హాంకాంగ్ నుంచి లండన్... ఇలా ప్రపంచంలోని ప్రధానమైన నగరాలన్నింటిని అనుసంధానం చేస్తూ కేబుల్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ నగరాలను సముద్రంలో నుంచి కేబుల్‌లు ఏర్పాటు చేసి అనుసంధానించారు. ఇప్పటికే 7,50,000 మైళ్ల పొడవైన కేబుల్ ప్రపంచంలోని అన్ని ఖండాలను కలుపుతోంది. 99 శాతం డేటా సముద్రంలో ఉన్న కేబుల్ ద్వారానే ప్రసారమవుతోంది.లాటిన్ అమెరికాలో ఉన్న అతిపెద్ద డేటా సెంటర్ కోసం అమెరికా నుంచి చిలీ వరకు గూగుల్ సొంతంగా సముద్రంలో నుంచి కేబుల్ వేసే ఆలోచనలో ఉంది. ఈ ప్రాజెక్టు తరువాత వర్జీనియా నుంచి ఫ్రాన్స్‌కు కొత్త కేబుల్ వేయాలని గూగుల్ యోచిస్తోంది. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 13 డేటా సెంటర్లను ప్రారంభించింది. మరో ఎనిమిది నిర్మాణదశలో ఉన్నాయి.

సబ్ మెరైన్ కేబుల్స్
విశ్వంలో ఇప్పుడు వేయికు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మార్స్ మీదకు మిషన్ కూడా పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ శాటిలైట్లు పంపించే డేటా కన్నా సబ్ మెరైన్ కేబుల్స్ ద్వారా పంపే డేటా చాలా వేగంగా జరుగుతుంది.సముద్రగర్భంలో నుంచి కేబుల్ వేసే ముందు ఏ మార్గంలో వేయాలో చెక్ చేస్తారు. ఒకసారి కేబుల్ వేస్తే కనీసం 25 ఏళ్లపాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ముందుగా కేబుల్‌ను షిప్‌లోకి ఎక్కిస్తారు. దాదాపు 4 వేల మైళ్లు పరిచేందుకు సరిపోయే కేబుల్‌ను షిప్‌లోకి ఎక్కిస్తారు. అంటే 3500 మెట్రిక్ టన్నుల బరువుతో సమానం. ఇప్పటివరకు అమర్చిన కేబుల్ లలో Marea cable అత్యంత వేగవంతమైనది, ఇది మొత్తం పొడవు దాదాపుగా 4,104 miles దూరం ఉంటుంది. Facebook, Microsoft వంటి సంస్థలు సొంతంగా ఈ కేబుల్స్ ను నడుపుతున్నాయి.దీని స్పీడు ఊహించుకుంటే షాకవడం ఖాయం. డేటా ట్రాన్స్ఫ్రర్ రేట్ సెకండ్ కి 20 terabits ఉంటుంది. సెకండ్ కి 2500 గిగాబైట్స్ వేగంతో డేటా వెళ్లే విధంగా ఈ కేబుల్ ని తీర్చిదిద్దారు. 793,000 ultra-high-def movies ని ఒకేసారి స్ట్రీమ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications