అంతరిక్షంలో ఇళ్లు నిర్మిస్తానంటున్న వ్యక్తి ఇతనే

తన విప్లవాత్మక ఆలోచనలతో ఆకాశమే హద్దుగా ఎలాన్ మస్క్ (Elon Musk) దూసుకుపోతున్నారు. ఈ రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఈ కెనడియన్-అమెరికన్ వ్యాపార దిగ్గజం టెస్లా మోటార్స్, సోలార్ సిటీ, స్పేస్ ఎక్స్, పేపాల్ వంటి సంస్థలను స్థాపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్టమొదటి కమర్షియల్ రాకెట్

ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌కు మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌ను అందించిన ఘనత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని SpaceX కంపెనీకే దక్కుతుంది. మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది.

రీయూజబుల్ రాకెట్‌

తిరిగి ఉపయోగించుకోదగిన (రీయూజబుల్) రాకెట్‌ను దిగ్విజయంగా పరీక్షించి ఓ సరికొత్త ఆవిష్కరణను SpaceX కార్పొరేషన్ విజయవంతం చేయగలిగింది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్

ఎలాన్ మస్క్ తన 12వ ఏట తయారుచేసుకున్న మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ (బ్లాస్టర్ వీడియో గేమ్)ను 500 డాలర్లకు (మన కరెన్సీ ప్రకారం రూ.33,900)కు విక్రయించారు.

Zip2 కంపెనీ..

తన సోదరుడితో కలిసి ఎలాన్ మస్క్ 27వ ఏట ప్రారంభించిన Zip2 కంపెనీని విక్రయించటం ద్వారా మస్క్‌కు 22 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.

డాలర్ వేతనం మాత్రమే..

టెస్లా మోటార్స్ సీఈఓగా ఎలాన్ మస్క్ కేవలం 1 డాలర్ వేతనం మాత్రమే తీసుకుంటున్నారు. ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకునిగా వ్యవహరించిన PayPal కంపెనీని ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా ఎలాన్ మస్క్‌కు 11.7శాతం షేర్లు లభించాయి.

ఎలాన్ మస్క్ నుంచి పుట్టుకొచ్చిన పాత్రే

2008లో విడుదలైన ఐరన్ మ్యాన్ సినిమాతో, బాగా పాపులరైన టోనీ స్టార్క్ పాత్ర ఎలాన్ మస్క్ నుంచి పుట్టుకొచ్చిన పాత్రేనని ఆ చిత్ర దర్శకుడు జోన్ ఫేవ్‌రియో వెల్లడించారు.

100 గంటల పని..

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా మోటార్స్ నుంచి విడుదలైన టెస్లా మోడల్ ఎస్ కారుకు 5.4/5 సేఫ్టీ రేటింగ్ లభించింది. ఎలాన్ మస్క్ వారంలో 100 గంటల పాటు పనిచేస్తారట. ఎలాన్ మస్క్ తన 7వ ఏట నుంచే రోజుకు 10 గంటల పాటు చదవటం ప్రారంభించారట.

అంచలంచెలుగా పై కొచ్చారు..

ఎలాన్ మస్క్ తన 17వ ఏట దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు వచ్చారు. ఇక్కడ ఆయన బాయిలర్ రూమ్ క్లీనర్‌గా పనిచేసారట. ఇందుకు గాను గంటకు 18 డాలర్లను వేతనంగా తీసుకునే వారట.

ఆ రోజుల్లోనే ఖరీదైన కారు..

Stanford Ph.Dలో జాయిన్ అయిన రెండు రోజులకే ఎలాన్ మస్క్‌ ఆ చదువకు స్వస్తి పలికారు. 1 మిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ కొనుగుల చేసిన మెక్లారెన్ F1 కారుకు కొన్నరోజునే ప్రమాదం జరిగింది.

బ్యాంక్ అప్పుల్లో కూరుకుపోయి..

2008లో బ్యాంక్ అప్పుల్లో కూరుకుపోయిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని 1.6 బిలియన్ డాలర్లు విలువ చేసే నాసా కాంట్రాక్ట్ కాపాడింది.

19 రాకెట్ లాంచర్లు విజయవంతం..

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన 20 రాకెట్ లాంచర్లలో వరసుగా 19 విజయవంతమయ్యాయి. జూన్ 2015లో నిర్వమించిన 20వ రాకెట్ లాంచర్ ఫెయిల్ అయ్యింది. ఎలాన్ మస్క్ సిట్కామ్ షో బిగ్ బ్యాంగ్ థియరీలో అతిథి పాత్రలో కనిపిస్తారు.

జేమ్స్ బాండ్ కారు ఆయన సొంతం...

1977లో విడుదలైన జేబ్స్ బాండ్ చిత్రం "The Spy Who Loved Me"లో ఉపయోగించిన కారును మస్క్ సొంతం చేసుకున్నారు. స్పేస్ ఎక్స్ ఫ్యాక్టరీని ఐరన్ మ్యాన్ 2 సినిమాలో లొకేషన్‌గా ఉపయోగించారు.

హైపర్‌లూప్ ప్రాజెక్ట్..

2013లో ఎలాన్ మస్క్ ఓ విప్లవాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. అదే ప్రాజెక్టు హైపర్‌లూప్. హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్‌లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు.

రోబోట్లకు సినిమా పేర్లు...

తన టెస్లా తయారీ యూనిట్‌లోని రోబోట్లకు, X-men సినిమా ప్రేరణతో Xavier, Iceman, Wolverine, Storm, Colossus, Vulcan, Havoc వంటి పేర్లను ఎలాన్ మస్క్ పెట్టారు.

ఏకాగ్రతను కాపాడుకునేందుకు...

21వ శతాబ్థపు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఎలాన్ మస్క్‌కు చోటు లభించింది. రోజువారి పనిలో భాగంగా ఎలాన్ మస్క్ తన ఏకాగ్రతను కాపాడుకునేందుకు 8 క్యాన్ల డైట్ కోక్‌తో పాటు కొన్ని పెద్ద కప్పుల కాఫీని తీసుకుంటారు.

అంతరిక్ష యాత్రలు...

2016లో ఎలాన్ మస్క్ ఓ విప్లవాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. రానున్న 100 సంవత్సరాల్లో అంగారక గ్రహం పై మనుషులు నివశించేందుకు గాను మానవ కాలనీలు నిర్మించనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రత్యేకమైన అంతరిక్ష వాహకనౌకల ద్వారా మానవులను అక్కడికి చేర్చటం జరుగుతుంది. మనుషులు తమ జీవితకాలంలో మరో గ్రహాన్ని సందర్శించడానికి ఇదో అరదుమైన అవకాశముని మస్క్ తెలిపారు. ఈ ప్రయాణపు ఖర్చు దాదాపుగా రూ.1.3 కోట్ల మేర ఉంటుందట.

సింగిల్ ఛార్జ్ పై 346 కిలోమీటర్లు ప్రయాణం

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా మోటార్స్ (Tesla Motors) ఇటీవల విడుదల చేసిన 'మోడల్ 3' కారుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు సింగిల్ ఛార్జ్ పై ఏకంగా 346 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ కార్లను పెద్దమొత్తంలో ఉత్ఫత్తి చేసే క్రమంలో టెస్లా కంపెనీకి టన్నుల కొద్ది బ్యాటరీలు అవసరమవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mind-blowing facts about Elon Musk. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot