ఆశలు ఆవిరి, మానవ నివాసంపై షాకిచ్చిన చందమామ !

Written By:

చందమామ షాకిచ్చాడు. తన దగ్గర నివాసానికి చోటు లేదంటున్నాడు. శాస్త్రవేత్తలకు ఉన్న కొద్దిపాటి ఆశలను ఆవిరిచేశాడు. అదెలా సాధ్యం అని షాకవుతున్నారా..అవును చందమామపై నీరు లేదని శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. అక్కడ మానవ ఆవాసాలకు చోటు లేదంటోంది.

తెల్లని చందమామ ఇలా..తెలియని రహస్యాలనేకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చంద్రుడిపై నీరు ఉన్నదని

చంద్రుడిపై నీరు ఉన్నదని ఇప్పటివరకూ అంతా భావిస్తూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నీటితో జాబిల్లిపై మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవచ్చని అందరూ అంచనా వేశారు.

చంద్రుడిపై నీరు లేదని

అయితే అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనలు ఈ అంచనాలను తిరగరాశాయి. చంద్రుడిపై నీరు లేదని, పూర్తిగా పొడిగా ఉన్నదని వారు తేల్చి చెప్తున్నారు.

అపోలో-16 నౌక తిరిగి వచ్చే సమయంలో

1972లో చంద్రుడిపైకి పంపిన అపోలో-16 నౌక తిరిగి వచ్చే సమయంలో తీసుకొచ్చిన మట్టి, శిలల నమూనాలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.

రస్టీ రాక్ అని పిలిచే ఈ మట్టి నమూనాలపై

శాండియాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం రస్టీ రాక్ అని పిలిచే ఈ మట్టి నమూనాలపై పరిశోధనలు జరిపింది. ఈ నమూనాల్లో తడి అసలేలేదని శాస్త్రవేత్తల బృందం తేల్చింది.

జింక్ మూలకాలు నీటి అణువులతో

సాధారణంగా జింక్ మూలకాలు నీటి అణువులతో సులభంగా చర్యలో పాల్గొని హెవీ ఐసోటోప్స్‌గా మారుతాయి. హెవీ ఐసోటోప్స్ ఉన్నచోట నీటిజాడ ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారిస్తారు.

జింక్ మూలకాలు లైట్ ఐసోటోప్స్ రూపంలో ఉన్నట్టు

చంద్రుడి ఉపరితల నమూనాల్లో జింక్ మూలకాలు లైట్ ఐసోటోప్స్ రూపంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.కాబట్టి చంద్రుడిపై నీటి జాడ లేదని నిర్ధారించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
The moon has no water, say scientists who analysed lunar rock brought back by Apollo 16 astronauts
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting