ఇండియా సత్తా అంటే ఇదే, శత్రువులకు చుక్కలే !

Written By:

ఇండియన్ శాస్త్రవేత్తలు ఎలాంటి అద్భుతాలైనా సృష్టించగలరని మరోసారి రుజువైంది. రిమోట్ సాయంతో శత్రువుల పనిపట్టే యుద్ధ ట్యాంకులను డీఆర్‌డీవో రూపొందించింది. ఈ యుధ్ధ ట్యాంకులు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలవు.

మీ మొబైల్ నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిమోట్ సాయంతో

స్వదేశీ ప‌రిఙ్ఞాన‌ం ఉపయోగించి, రిమోట్ సాయంతో నడిచే మానవరహిత యుద్ధ ట్యాంకులను డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది.

మంత్ర పేరుతో

కేవలం రిమోట్‌ సాయంతో పనిచేసే ఈ యుద్ధ ట్యాంకులను మంత్ర పేరుతో పిలుస్తున్నారు. ఇవిరిమోట్ సాయంతో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయగలవు.

నిఘా, బాంబుల గుర్తింపు, పర్యవేక్షణ

అణు, బయో ఆయుధాల ప్రాంతాల్లో నిఘా, బాంబుల గుర్తింపు, పర్యవేక్షణ కోసం మూడు రకాల ట్యాంకులను డీఆర్డీఓ రూపొందించింది. చిన్న చిన్న మార్పుల అనంతరం దీన్ని సైన్యానికి అప్పగించనున్నారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో

అవడిలోని ఆర్మీ కంబాట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వీటిని అభివృద్ధిచేసి, పరీక్షించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పారామిలటరీ దళాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

అబ్దుల్ కలామ్ గౌరవార్దం

రెండు రిమోట్ల సాయంతో ప్రయాణించే యుద్ధ ట్యాంకులను మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలామ్ గౌరవార్దం ఆయన వర్ధంతి సందర్భంగా అవడిలోని సీబీఆర్డీలో ప్రదర్శించారు.

మంత్ర ఎస్ అనేది

వీటిలో మంత్ర ఎస్ అనేది నిఘా కోసం, మంత్ర ఎస్-ఎం బాంబుల గుర్తింపు కోసం, మంత్ర -ఎన్ అనేది అత్యంత ప్రమాదకరమైన అణు, బయో ఆయుధాలను గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ఈ ట్యాంకులను

ఈ ట్యాంకులను సుమారు 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఎడారి ప్రాంతం రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించి, ధ్రువీకరించారు.

టెలీ-ఆపరేటింగ్ విధానంలో

టెలీ-ఆపరేటింగ్ విధానంలో పనిచేసే ఈ వాహనాలు 15 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In a first, DRDO develops unmanned tank Muntra; from detecting nuclear, bio weapons to mines, here is all you need to know Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot