చంద్రుడి మీద మానవ మనుగడకు రేడియేషన్ వివరాలను అంచనా వేస్తున్న NASA

|

ఈ దశాబ్దంలో మానవులను చంద్రుని మీదకు పంపి తిరిగి రప్పించడానికి అమెరికా సిద్ధమవుతున్నది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అంతరిక్షం యొక్క రేడియేషన్. ఈ రేడియేషన్ ప్రభావం కారణంగా వ్యోమగాములు క్యాన్సర్ మరియు న్యూరోడెజెనరేటివ్ వంటి వ్యాధుల ప్రభావంతో శాశ్వత ఆరోగ్య సమస్యలను ఎదురుకోవలసి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. వీటి నుండి తప్పించుకోవడానికి చంద్రుడి మీద రేడియేషన్ ప్రభావాలను అంచనా వేసే పనిలో నాసా నిమగ్నమైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

చంద్రుడి మీద ప్రయోగంలో అపోలో మిషన్

చంద్రుడి మీద ప్రయోగంలో అపోలో మిషన్

1960 మరియు 1970 ప్రాంతంలో చంద్రుడి మీద లాండింగ్ కోసం జరిగిన అపోలో మిషన్లు ప్రజలు చంద్రుని ఉపరితలంపై కొన్ని రోజులు గడపడం సురక్షితమని రుజువు చేసినప్పటికీ నాసా రోజువారీ రేడియేషన్ కొలతలను తీసుకోవడం మరచిపోయింది. ఇది శాస్త్రవేత్తల బృందం ఎంతకాలం సురక్షితంగా ఉండగలదో లెక్కించడానికి సహాయపడుతుంది.

 

Also Read: Apple India Online store లో అత్యంత ఖరీదైనది ఇదే! ధర 53 లక్షలు ..Also Read: Apple India Online store లో అత్యంత ఖరీదైనది ఇదే! ధర 53 లక్షలు ..

చంద్రుని మీద రేడియేషన్ ప్రభావం

చంద్రుని మీద రేడియేషన్ ప్రభావం

సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో చైనా-జర్మన్ బృందం 2019 లో చైనా యొక్క చాంగ్'ఇ 4 ల్యాండర్ నిర్వహించిన ప్రయోగం ఫలితాలను ప్రచురించిన తరువాత చంద్రుని మీద గల రేడియేషన్ వివరాల ప్రశ్నకు పరిష్కరం లభించింది. చంద్రుని మీద రేడియేషన్ అనేది మీరు ఊహించిన దానికంటే అధికంగా ఉంటుంది. ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) లో ఉన్నదానికంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అని కీల్ విశ్వవిద్యాలయంలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ విమ్మర్-ష్వీన్‌గ్రుబెర్ AFP కి తెలియజేసారు.

చంద్రుని మీద బస చేయడానికి అనుకూలత సమయం

చంద్రుని మీద బస చేయడానికి అనుకూలత సమయం

చంద్రుని మీద రేడియేషన్ ప్రభావం ISSతో పోలిస్తే అధికంగా ఉన్నందున చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములు బస చేయడానికి సుమారు రెండు నెలల సమయం పరిమితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకసారి అక్కడ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది సుమారు వారం రోజుల ప్రయాణం నుండి మరియు వారం క్రితం ముందు వరకు పరిగణనలోకి తీసుకుంటారు.

రేడియేషన్ ఎక్స్పోజర్ యొక్క అనేక వనరులు

రేడియేషన్ ఎక్స్పోజర్ యొక్క అనేక వనరులు

గెలాక్సీ కాస్మిక్ కిరణాలు, చెదురుమదురు సౌర కణ సంఘటనలు మరియు అంతరిక్ష రేడియేషన్ మరియు చంద్రుడి ఉపరితలం మధ్య గల పరస్పర చర్యల నుండి న్యూట్రాన్లు మరియు గామా కిరణాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక్కడ రేడియేషన్ యూనిట్ ను సివెర్ట్ ఉపయోగించి కొలుస్తారు. ఇది మానవ కణజాలాల ద్వారా గ్రహించిన మొత్తాన్ని అంచనా వేస్తుంది. చంద్రునిపై రేడియేషన్ ఎక్స్పోజర్ రోజుకు 1,369 మైక్రోసీవర్ట్లు అని బృందం కనుగొంది. అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బంది రోజువారీ మోతాదు కంటే 2.6 రెట్లు ఎక్కువ.

చంద్రునిపై రేడియేషన్ స్థాయి vs భూమిపై రేడియేషన్ స్థాయి

చంద్రునిపై రేడియేషన్ స్థాయి vs భూమిపై రేడియేషన్ స్థాయి

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ఇప్పటికీ పాక్షికంగా భూమి యొక్క రక్షిత అయస్కాంత బబుల్ చేత రక్షించబడుతున్న మాగ్నెటోస్పియర్ ఏరియాలో ఉంది. ఇది అంతరిక్షం నుండి వచ్చే చాలా రేడియేషన్ను విక్షేపం చేస్తుంది. భూమి యొక్క వాతావరణం ఉపరితలంపై రేడియేషన్ నుంచి మానవులకు అదనపు రక్షణ కలిగి ఉంటుంది.

చంద్రుడి మీదకి ప్రయాణం (ఆర్టెమిస్ మిషన్)

చంద్రుడి మీదకి ప్రయాణం (ఆర్టెమిస్ మిషన్)

చంద్రునిపై గల రేడియేషన్ స్థాయిలు భూమి ఉపరితలంలో ఉండే దాని కంటే 200 రెట్లు ఎక్కువ మరియు న్యూయార్క్ నుండి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే విమానంలో కంటే ఐదు నుండి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని విమ్మర్-ష్వీన్‌గ్రుబర్ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలతో ఆర్టెమిస్ మిషన్ కింద 2024 నాటికి మానవులను చంద్రునిపైకి తీసుకురావాలని నాసా యోచిస్తోంది. అంతేకాకుండా వ్యోమగాములు పనిచేయడానికి వీలుగా చంద్రుడి ఉపరితలంపై నివసించే దీర్ఘకాలిక ఉనికిని నిర్మించాలని కూడా అంచనాలను వేస్తున్నారు.

Best Mobiles in India

English summary
NASA Estimates Radiation Levels on The Moon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X