భూమి అంతం తప్పదు, కొత్తది వెతుక్కోండి !

Written By:

ఈ శతాబ్దం అంతానికల్లా మానవుడు ఇంకో గ్రహాన్ని వెతుక్కోవాలంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ , స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల వ్యవస్థాపకుడు మస్క్ ఆ మధ్య ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం గుర్తు ఉండే ఉంటుంది. అయితే మానవ మనుగడకు అనుకూలంగా ఏవైనా గ్రహాలున్నాయా అంటే ఎందుకు లేవు ఉన్నాయంటూ వారు చెబుతున్నారు. మేమే కాలనీలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

అమెజాన్‌కి షాక్, ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎలన్‌ మస్క్‌

ఎలన్‌ మస్క్‌ గుర్తున్నాడా? అదేనండి.. పేపాల్, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల వ్యవస్థాపకుడు. ఇంకో వందేళ్లలో మనుషులకు అంగారకుడిపై కాలనీ కట్టేస్తానని ప్రకటించిన వ్యక్తి ఈయన.

ఇంకో రెండేళ్లలో

మస్క్‌ తానిచ్చిన మాటకు తగ్గట్టుగానే ముందుకెళుతున్నాడు. మొత్తం పది లక్షల మందితో ఏర్పాటు చేయాలనుకుంటున్న మార్స్‌ కాలనీకి ఇంకో రెండేళ్లలో తన ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు.

అరుణ గ్రహం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు

అరుణ గ్రహం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు డ్రాగన్‌ -2 అంతరిక్ష నౌక ద్వారా ముందుగా కొంత సామగ్రిని అక్కడికి పంపిస్తామని.. ఆ తరువాత దశలవారీగా తన ప్రణాళికను అమలు చేస్తానని అంటున్నాడు మస్క్‌.

ఇటీవలే ఒక డాక్యుమెంట్‌

ఈ వివరాలతో ఆయన ఇటీవలే ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేశాడు.

మార్స్‌ కాలనీలో

మార్స్‌ కాలనీలో నివాసానికి ఒక్కొక్కరికీ ఎంత ఖర్చవుతుంది? అక్కడికి చేరుకోవడం ఎలా? ఎదురయ్యే ఇంజినీరింగ్‌ సవాళ్లు ఎలాంటివి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి అనేక అంశాలను ఇందులో చర్చించారు.

తొలి అంతరిక్ష నౌకను

రెండేళ్లలో సామగ్రితో తొలి అంతరిక్ష నౌకను ప్రయోగించిన తరువాత దాదాపు వందమంది ప్రయాణించగల అంతరిక్ష నౌకను అభివృద్ధి చేయాలన్నది మస్క్‌ ప్లాన్‌.

భూమిపై మనిషి మనుగడ

అణుయుద్ధాలు మొదలుకొని.. వాతావరణ మార్పుల వరకూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భూమిపై మనిషి మనుగడ అసాధ్యమని.. ఈ శతాబ్దం అంతానికల్లా ఇంకో గ్రహాన్ని వెతుక్కోకపోతే కష్టమేనని మస్క్, ప్రఖాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌లు ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే.

మనుషులు చంద్ర గ్రహానికి

ఇదిలా ఉంటే ఈ భూమ్మీది నుంచి మనుషులు చంద్ర గ్రహానికి వెళ్ళాల్సిందేనంటున్నాడు ప్రముఖ ఖగోళ భౌగోళిక శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్స్.

ఇతర ప్రపంచాల్లోకి

ఈ భూగ్రహం మీద మానవులకు నూకలు చెల్లిపోతున్నాయని, ఇతర ప్రపంచాల్లోకి మనం వెళ్ళాల్సిందేనని, సౌర వ్యవస్థలను అన్వేషించాల్సిన సమయం సమీపించిందని ఆయన పేర్కొన్నాడు.

200 ఏళ్ళ నుంచి 500 ఏళ్ళలోగా

గత నెల 21 న నార్వేలోని ట్రాండెంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలు, ప్రముఖులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడిన ఆయన.. రానున్న 200 ఏళ్ళ నుంచి 500 ఏళ్ళలోగా మన భూ నిష్క్రమణ తథ్యమని ప్రకటించాడు.

30 సంవత్సరాల్లోగా అన్ని దేశాలు

30 సంవత్సరాల్లోగా అన్ని దేశాలు ఓ మూన్ కాలనీని ఏర్పాటు చేయడానికి పూనుకోవాలని స్టీఫెన్ హాకింగ్స్ పిలుపునిచ్చాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nasa planning Earth Independent Mars colony by 2030s
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot