ఫిబ్రవరి 4న భూగ్రహం మొత్తం అంధకారం, వదంతులపై స్పందించిన నాసా..

Written By:

భూమి వైపు ఓ పెద్ద గ్రహశకలం దూసుకొస్తందని ఇది ఫిబ్రవరి 4న భూమిని ఢీకొట్టబోతోందని గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నాసా స్పందించింది. దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పులేదని ఇది భూమికి అత్యంత సమీపం నుంచి ఈ గ్రహశకలం వెళ్లిపోతుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈ గ్రహశకాలనికి 2002 AJ129 నామకరణం చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ బుర్జ్‌ ఖలీఫా కంటే పెద్దగా ఉంటుందట.

ఐఫోన్ యూజర్లకు వాట్సప్‌ సరికొత్త అప్‌డేట్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడంటే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమికి 26 లక్షల మైళ్ల దూరం నుంచి..

ఫిబ్రవరి 4న భూమికి 26 లక్షల మైళ్ల దూరం నుంచి ఈ గ్రహ శకలం వెళ్లనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత దూరం కూడా చాలా దగ్గరే అని నాసా చెబుతోంది. విశ్వంలో ఓ నిర్ణీత కక్ష్య లేకుండా తిరిగే వాటినే గ్రహ శకలాలుగా పిలుస్తారన్న విషయం తెలిసిందే.

ఒకవేళ ఢీకొంటే..

1.1 కిలోమీటర్ల పొడువున్న ఆస్టరాయిడ్‌ భూమిని ఢీకొనే అవకాశాలు లేవని, ఒకవేళ ఢీకొంటే.. అది భూమి మొత్తాన్ని కప్పేసేంత దుమ్ము ధూళిని వెదజల్లుతుందని, దీనివల్ల భూగ్రహం మొత్తం అంధకారమవుతుందని నాసా తెలిపింది.

ముందుగా కొనుగొని అప్రమత్తమయ్యేందుకు..

భూమి వైపునకు దూసుకొస్తే పరిస్థితి ఏమిటీ? వాటిని ముందుగా కొనుగొని అప్రమత్తమయ్యేందుకు ఆస్కారం ఉందా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్నాయి. అయితే, ఆ భయం వద్దని అంతరిక్ష పరిశోధకులు తెలుపుతున్నారు.

ఆస్ట్రాయిడ్ స్పాటర్..

నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా-NASA) గ్రహ శకలాలను కనుగొనే ‘ఆస్ట్రాయిడ్ స్పాటర్' కనుగొంది. దీనికి ‘స్కౌట్' అని పేరు పెట్టింది. దీని సాయంతో భూమి వైపునకు దూసుకొచ్చే గ్రహ శకలాలను ముందుగానే తెలుసుకోవచ్చు.

భూమి మీదకు దూసుకు రాక ముందే ..

తద్వారా అది ఎంత దూరంలో ఉంది? ఏ దిశలో ప్రయాణిస్తుంది? ఎక్కడ ఢీకొట్టే ఆస్కారం ఉంది? ఎంత వేగంతో వస్తుంది? దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేవి కనుగొనవచ్చు. అంతేకాదు, అది భూమి మీదకు దూసుకు రాక ముందే ధ్వంసం చేసేందుకు ఉన్న అవకాశాలను సైతం అన్వేషించవచ్చు.

2016 అక్టోబరు 25న..

2016 అక్టోబరు 25న ‘యూఆర్ 36' అనే గ్రహ శకలం భూమి వైపునకు దూసుకొచ్చింది. 31న అది దిశ మార్చుకోవడంతో కొద్దిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ‘స్కౌట్' ప్రయోగాత్మకంగా సేకరించింది.

భూమికి 310,000 మైళ్ల దూరంలో..

ఆ గ్రహ శకలం భూమికి 310,000 మైళ్ల దూరంలో ఉండటం వల్ల ప్రమాదం ఉండదని తెలుసుకున్నారు. అంటే, భూమికి, చంద్రుడికి మధ్య ఉండే దూరంతో పోల్చితే మూడు రెట్లు అధిక దూరంలో ఆ గ్రహశకలం ఉంది.

ఏ గ్రహ శకలమూ భూమికి సమీపించకుండా..

ఇదిలా ఉంటే ఏ గ్రహ శకలమూ భూమికి సమీపించకుండా దాన్ని మార్గం మధ్యలోనే ధ్వంసం చేయాలని భావిస్తున్నప్పటికీ దానివల్ల భూమికి అనేక రకాల ఇతర విపరిణామాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు.

అత్యంత తీవ్రమైన అణు థార్మిక శక్తిని ..

ఈ విస్పోటక పదార్థాలు అత్యంత తీవ్రమైన అణు థార్మిక శక్తిని కలిగివుంటాయి కాబట్టి అవి చిన్నముక్కలుగా భూమిమీద పడ్డా ప్రమాదమేనని అన్నారు. మరి దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
No, an Asteroid Is Not Going to Collide with Earth in February More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot