చందమామపై వొడాఫోన్ 4జీ నెట్‌వర్క్, ఇది నమ్మలేని నిజం !

|

టైటిల్ వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా..అదే నిజమయితే ఎలా ఉంటుంది. అవును ఇది నిజం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. జర్మనీకి చెందిన పిటిసైంటిస్ట్స్‌ అనే సంస్థ 2019లో చందమామపై పరిశోధనల కోసం ప్రయోగించే 'మిషన్‌ టు మూన్‌' ప్రాజెక్టు కోసం వొడాఫోన్‌ ఈ 4జి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయబోతోంది. ఈ కంపెనీ వచ్చే ఏడాదే జాబిలమ్మపైనే 4జి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయబోతోంది. మొబైల్ దిగ్గజం నోకియాతో కలిసి కంపెనీ ఈ సాంకేతిక అద్భుతానికి సిద్ధమవుతోంది. ఇదే జరిగితే జాబిలమ్మపై తొలి 4జి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసిన కంపెనీగా వొడాఫోన్‌ నిలిచిపోతుంది.

 

MWC 2018లో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవేMWC 2018లో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

మీరు ఎక్కడికెళ్లినా, మా నెట్‌వర్క్‌..

మీరు ఎక్కడికెళ్లినా, మా నెట్‌వర్క్‌..

వొడాపోన్ యాడ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. మీరు ఎక్కడికెళ్లినా, మా నెట్‌వర్క్‌ మీ వెన్నంటే ఉంటుంది అంటూ అప్పుడు కంపెనీ నుంచి వచ్చిన యాడ్ ఓ ఊపు ఊపింది కూడా. సరిగ్గా ఆ యాడ్ లో ఉన్నట్లుగానే జాబిల్లిమీద కూడా మేము ఉన్నామని చెప్పబోతోంది వొడాఫోన్.

 చంద్రుడి ఉపరితలంపై..

చంద్రుడి ఉపరితలంపై..

కాగా చంద్రుడి ఉపరితలంపై నాసా వ్యోమగాములు నడిచిన సరిగ్గా 50 సంవత్సరాలకు, పిటిసైంటిస్ట్స్‌ అనే సంస్థ ప్రైవేట్‌గా ఈ బృహత్‌ ప్రయత్నానికి సిద్ధమవుతోంది. 11 రోజుల పాటు జరిగే ఈ మూన్‌ మిషన్‌ను వొడాఫోన్‌ 4జి ద్వారా లైవ్‌ హెచ్‌డి వీడియోలో వీక్షించవచ్చు.

బెర్లిన్ కేంద్రంగా PTScientists కంపెనీ
 

బెర్లిన్ కేంద్రంగా PTScientists కంపెనీ

బెర్లిన్ కేంద్రంగా PTScientists కంపెనీ 2019లో జాబిల్లి మీదకు ఓ మిషన్ ను పంపబోతోంది. చందమామపై ఉండే వాతావరణాన్ని అలాగే అక్కడి పరిసరాలను ఫోటోలు, వీడియోలు తీసి పంపే విధంగా ఈ మిషన్ జాబిల్లి మీదకు దూసుకెళ్లనుంది.

వొడాఫోన్ 4జీ నెట్ వర్క్..

వొడాఫోన్ 4జీ నెట్ వర్క్..

దీనికోసం వొడాఫోన్ 4జీ నెట్ వర్క్ అందించేందుకు రెడీ అయింది. లాండ్ అయిన తరువాత 1800 MHz frequency bandతో కూడిన 4జీ నెట్ వర్క్ ద్వారా ఈ మిషన్ HD videoలను భూమి మీదకు పంపుతుందని దీన్ని ఇక్కడి సర్వర్లకు కనెక్ట్ చేసి ఆ వీడియోలను బంధిస్తామని కంపెనీ చెబుతోంది.

నోకియా కూడా..

నోకియా కూడా..

ఇందులో నోకియా కూడా పాలుపంచుకుంటోంది. కిలోగ్రామ్ కన్నా తక్కువ బరువు ఉండేలా స్పేస్ గ్రేడ్ నెట్‌వర్క్ ని అభివృద్ధి చేస్తోంది. అక్కడి నుంచి భూమి మీదకు ల్యాండ్ రోవర్ ALINA stationకు డేటాను పంపాలంటే చాలా పెద్ద మొత్తంలో డేటా అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.

వొడాఫోన్తో కలిసి పనిచేయడం

వొడాఫోన్తో కలిసి పనిచేయడం

ఈ ప్రాజెక్ట్ లో వొడాఫోన్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని నోకియా కంపెనీ చెబుతోంది. కాగా ఈ నెట్ వర్క్ ఇతర విషయాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్ డేటా నెట్ వర్కింగ్ లో కొత్త స్పేస్ గ్రేడ్ టెక్నాలజీకి ఇది మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Moon boon: Nokia, Vodafone want to build lunar 4G LTE network Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X