చెప్పకుండానే మీ ఫీలింగ్స్‌ని పసిగట్టే రోబోట్ వచ్చేస్తోంది

రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుతోంది.

|

రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుతోంది. రోబోటిక్స్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమిది. రోబోట్.. అంటే ఒకప్పుడు యంత్రమేమో కానీ ఇప్పడు కాదు. ఇప్పుడు అది కూడా మనలాగే మనిషి రూపం సంతరించుకుంది. పారిశ్రామిక రంగంలో మొదలైన వీటి ప్రస్థానం.. ఇప్పుడు వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి మన పడగ్గది వరకు చేరింది. తాజాగా మనకు తెలయకుండానే మన ఫీలింగ్స్ ని పట్టేసే రోబో రాబోతోంది. దీని పూర్తి వివరాల్లోకెళితే..

వాట్సప్ గ్రూపులకు ఇది నిజంగా చేదులాంటి వార్తేవాట్సప్ గ్రూపులకు ఇది నిజంగా చేదులాంటి వార్తే

సానుభూతి చూపే రోబోట్

సానుభూతి చూపే రోబోట్

త్వరలో రానున్న రోబోట్ Siri and Alexa లాగా వాయిస్ కమాండ్లతో మనిషితో సంభాషించనుంది. మనిషిలోని ముఖ కదలికను పసిగట్టి వారితో ఇంటరాక్ట్ కానుంది. పరిస్థితులను బట్టి మనుషులతో ఈ రోబోట్ మూవ్ అయ్యేలా రూపొందించనున్నారు. ముఖ్యంగా అవయువాలను అంటే చేతులను పట్టుకుని ఓదార్చడం లాంటివి కూడా చేయనుంది.

నిష్పాక్షికంగా వ్యవహరించనుంది

నిష్పాక్షికంగా వ్యవహరించనుంది

ఈ రోబోట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిష్పాక్షికంగా వ్యవహరించనుంది. ఆరోగ్యం విషయంలో ఇది ఖరాకండిగా ఏదీ దాయకుండా చెప్పేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. మనిషి ఈ రోబోటో తో మాట్లాడే తీరులోనే అది వాస్తవాలను పసిగట్టి దానికనుగుణంగా వారిని మోటివేట్ చేయనుందని తెలుస్తోంది.

 

 

గైడింగ్ దేవత

గైడింగ్ దేవత

ఈ రోబోట్లు ట్రావెలింగ్ చేసేవారికి అలాగే కస్టమర్ సర్వీసు ట్రైనింగ్ సెంటర్లలో వారికి మంచి సహయకారిగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా షాపింగ్ చేసేవారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ రోబోట్లు చెప్పనున్నాయి.

 

 

మెడికల్ అడ్వైజ్

మెడికల్ అడ్వైజ్

టెక్నాలజీ దిగ్గజం Merck and Furhat Robotics ఈ మధ్య కొత్త ప్రయోగానికి తెరలేపింది. మనుషుల ఆరోగ్యం ఎలా ఉంది. వారి లైఫ్ స్టయిల్ ఎలా ఉందనే విషయాలను అడుగుతోందట. అలాగే diabetes, alcoholism and hypothyroidism లాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలని స్క్రీన్ మీద చూపిస్తోందట. ఇవి ఎవరికైనా ఉన్నట్లు తెలియగానే వెంటనే వారిని డాక్టర్ దగ్గరకు వెళ్లి బ్లడ్ చెకప్ చేసుకోమని చెబుతోందట.

మూడ్

మూడ్

ఈ రోజుల్లో జాబ్ చేసే వారి టెన్సన్ చెప్పనవసరం లేదు. ముఖ్యంగా పెద్దలు, పిల్లలు, యువకులు అందరూ చాలా టెన్సన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు. వీరందరినీ ఒత్తిడికి దూరంగా ఉండేలా ఈ రోబోట్లో సలహాలు ఇవ్వనున్నాయి. వారి ముఖ కదలికలు, కనుల కదలికలను బట్టి వారి ఏం ఒత్తిడికి లోనవుతున్నారో చెప్పి వారిని మూడ్ నుంచి బయటకు తీసుకురానుందట.

Best Mobiles in India

English summary
Now a humane robot wants to hear your woes, see how More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X