ఇస్రో దెబ్బకి కుళ్లి కుళ్లి ఏడుస్తున్న పాకిస్తాన్, బయటపడిన వంకర బుద్ధి, కారణం ఇదే !

Written By:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉపగ్రహ ప్రయోగాలలో తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసి సెంచరీతో భారతీయుల ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే కుక్క తోక వంకర అన్నట్లుగా ఈ విజయంపై పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది.

జియోతో సహా అన్ని టెల్కోలకు భారీ దెబ్బ, ఆ ఛార్జీలు సగం తగ్గింపు, ట్రాయ్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇలాంటి ప్రయోగాలతో..

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగంపై పాకిస్థాన్‌ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. ఇలాంటి ప్రయోగాలతో దేశాల మధ్య ప్రాంతీయ వ్యూహాత్మక స్థిరత్వం దెబ్బతింటుందంటూ వ్యాఖ్యానించింది. ఈ ప్రయోగం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

పీఎస్‌ఎల్‌వీ సీ-40 ద్వారా..

పీఎస్‌ఎల్‌వీ సీ-40 ద్వారా కార్టోశాట్ శాటిలైట్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు మరో 30 శాటిలైట్స్‌ను కూడా రెండు కక్ష్యల్లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. అయితే దీనిని మిలిటరీ కోసం వాడనున్నట్లు ఇండియా ప్రకటించడం పాక్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇది తమపై ఎక్కడ ప్రభావం చూపుతుందో అన్నది దాని ఆందోళన.

మిలిటరీ అవసరాల కోసం..

స్పేస్ టెక్నాలజీని వాడుకునే హక్కు అన్ని దేశాలకు ఉంది. కానీ ఇలాంటి వాటిని మిలిటరీ అవసరాల కోసం కూడా వాడుకోవడం సరికాదు. ఇతర దేశాల మిలిటరీ సామర్థ్యాన్ని అస్థిరపరచడం ఈ ప్రాంతం సుస్థిరతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని ఆ ప్రతినిధి అన్నారు.

నాసాతోనే పోటీ పడే స్థాయికి..

కాగా 1961లో అంటే ఇండియా ఇస్రోను నెలకొల్పడం కంటే 8 ఏళ్ల ముందే పాకిస్థాన్ తన స్పేస్ సెంటర్‌ను ప్రారంభించింది. అయినా ఇప్పటివరకూ సాధించింది ఏమీ లేదు. మరోవైపు ఇస్రో మాత్రం నాసాతోనే పోటీ పడే స్థాయికి చేరుకుని ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

కార్టోశాట్ శాటిలైట్‌ ..

ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్ శాటిలైట్‌ మిలిటరీ ఆపరేషన్స్ కోసం సమర్ధవంతంగా పనిచేస్తుంది. భూఉపరితలానికి సంబంధించిన అత్యత్తుమమైన ఫోటోలను బంధించి భూమి మీదకు పంపించే అత్యున్నత శాటిలైట్ ఇది.

శత్రువుల కదలికలు ఏమైనా ఉంటే ..

ఈ ఉపగ్రహం ద్వారా పాకిస్తాన్ ,చైనా ,అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మిలటరీకి తెలిసిపోతుంది. అక్కడ శత్రువుల కదలికలు ఏమైనా ఉంటే వెంటనే పసిగట్టి, దానిమీద నిఘా వేసి అక్కడి రహస్యాలను కెమెరాలో బంధించి ఫోటోలతో సహ సమకూరుస్తుంది.

సర్జికల్ స్ట్రయిక్ లో..

మొన్న జరిగిన సర్జికల్ స్ట్రయిక్ లో కూడా కార్టోశాట్ ఉపగ్రహం తన సమాచారంతో మిలటరీ ఆపరేషన్ కి సాయపడిన విషయం అందరికీ తెలిసిందే.

ఇండియాపై పడి ఏడుస్తున్నారంటూ..

ఇదిలా ఉంటే తమ రీసెర్చ్ సెంటర్‌ను అభివృద్ధి చేసుకోలేక ఇండియాపై పడి ఏడుస్తున్నారంటూ పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
As ISRO creates history, Pakistan raises objections over the launch of 100th satellite
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot