అణు,స్పేస్ టెక్నాలజీని పరుగులు పెట్టించిన పోఖ్రాన్ యోధుడు, ఎంతలా అంటే..

ఓ వైపు అమెరికా, మరోవైపు చైనా వరుసగా అణుపరీక్షలు నిర్వహించుకుంటూ పోతున్న కాలమది.

|

ఓ వైపు అమెరికా, మరోవైపు చైనా వరుసగా అణుపరీక్షలు నిర్వహించుకుంటూ పోతున్న కాలమది. పక్కనే దాయాది దేశం పాకిస్తాన్ దానికి సపోర్ట్ గా అమెరికా, చైనాలాంటి దేశాలు, ఒంటరిగా మిగిలిన ఇండియా తన భద్రత గురించి అణుక్షణం ఆలోచించాల్సిన సమయం, మనదేశం అణ్వస్త్ర రంగంలో ప్రపంచదేశాలకు సవాల్ విసిరితేనే మనకు ధీమా భద్రతపై భరోసా ఉంటుంది. అలాంటి సమయంలో రాకెట్ పరిజ్ఙానాన్ని మనకు అందకుండా నానా ఆంక్షలుతో కట్టడి చేసిన అమెరికా, మనం రాకెట్ టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉన్నామంటూ ఛీ కొట్టిన దాని మిత్ర దేశాలు...అప్పుడు మన శాస్త్రవేత్తలు ఎం చేసారు ? కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఇదే రోజు MAY 11 న పోక్రాన్ అణుపరీక్షల వెనుక దాగున్న నిజాలు మీ కోసం

ఆ ఒక్క కాల్‌కి అబ్దుల్ కలాం సై అనుంటే,ఇండియా చీకటిలోకి వెళ్లేది..ఆ ఒక్క కాల్‌కి అబ్దుల్ కలాం సై అనుంటే,ఇండియా చీకటిలోకి వెళ్లేది..

ఛీ కొట్టిన దేశాలే సలాం కొట్టేలా..

ఛీ కొట్టిన దేశాలే సలాం కొట్టేలా..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఛీ కొట్టిన దేశాలే సలాం కొట్టేలా మన దేశం ప్రపంచపటాన నిలిచేలా చేసిన శాస్ర్తవేత్తలు, ఆనాటి ప్రభుత్వానికి దేశం యావత్తూ రుణపడి ఉండాల్సిందే. ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది కృషి ఫలితంగా ఇండియా ఇప్పుడు అణుపరీక్షల రంగంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడింది.

అణుపరీక్షల రంగంలో ఎన్ని విజయాలు సాధించినా..

అణుపరీక్షల రంగంలో ఎన్ని విజయాలు సాధించినా..

ఈ స్థాయి వెనక కృషి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిపై ఉంది. దేశం అణుపరీక్షల రంగంలో ఎన్ని విజయాలు సాధించినా దానికి మూలాధారం ఫోఖ్రాన్ అణు పరీక్షనే చెబుతారు.ఈ ఆపరేషన్ చాలా ప్రత్యేకమైంది. ప్రపంచదేశాలను పరుగులు పెట్టించింది కూడా. దానిపై ప్రత్యేక కథనం మీకోసం.

మొదట్లో సైకిల్ మీద మన రాకెట్ మోడళ్లను..

మొదట్లో సైకిల్ మీద మన రాకెట్ మోడళ్లను..

మనదేశ శాస్త్రవేత్తలు రహస్యంగా రకరకాల పద్దతుల్లో టెక్నాలజీని సంపాదించి దానికి ప్రాణం పోశారు. మొదట్లో సైకిల్ మీద మన రాకెట్ మోడళ్లను తీసుకెళ్లారంటే దాని వెనక ఏ స్థాయి కృషి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

1974వ సంవత్సరంలో పోఖ్రాన్ అణుపరీక్షకు..

1974వ సంవత్సరంలో పోఖ్రాన్ అణుపరీక్షకు..

ఓ వైపు అంతరిక్ష పరిశోధనకు, మరోవైపు క్షిపణి పరిజ్ఙానానికి పదునుపెట్టుకుంటూ, మరో వైపు అంతే రహస్యంగా అణు పరిజ్ఙానాన్ని సంపాదించుకుంటూ పోతున్న రోజుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1974వ సంవత్సరంలో పోఖ్రాన్ అణుపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్మైలింగ్ బుద్ద పేరుతో..

స్మైలింగ్ బుద్ద పేరుతో..

శాస్త్రవేత్తలు ఈ ఆఫరేషన్ ను అత్యంత రహస్యంగా నిర్వహించారు. స్మైలింగ్ బుద్ద పేరుతో రకరకాల కోడ్స్ పేర్లతో మారు వేషాలతో ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

అమెరికా శాటిలైట్స్ అణుక్షణం

అమెరికా శాటిలైట్స్ అణుక్షణం

విదేశీ గూఢాచారులు, అమెరికా శాటిలైట్స్ అణుక్షణం ఈ ఆపరేషన్ మీద నిఘాను పెంచాయి. అయినప్పటికీ శాస్త్రవేత్తలు అదరక బెదరక తొలిసారిగా రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ లో అణుపరీక్ష ప్రయోగాన్ని విజయవంతం చేశారు.

అమెరికా , దాని మిత్ర దేశాలు..

అమెరికా , దాని మిత్ర దేశాలు..

భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. అయితే ఆ తరువాత అమెరికా , దాని మిత్ర దేశాలు ఇండియాపై అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ఇండియా అదరక బెదరక వాజ్‌పేయి, కలాం సారధ్యంలో రెండో పోఖ్రాన్ పరీక్షకు సిద్ధం అయ్యాయి.

దశ దిశ లేని దేశంగా..

దశ దిశ లేని దేశంగా..

కాగా ఇందిరాగాంధీ నుంచి , వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న మధ్య కాలంలో దశ దిశ లేని దేశంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంది. అస్థిర ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలు ధేశ భద్రతను ప్రశ్నార్థంకగా మార్చాయి.

పీవీ నరసింహరావు ఉన్న సమయంలో..

పీవీ నరసింహరావు ఉన్న సమయంలో..

వీరి మధ్యలో ప్రధానిగా పీవీ నరసింహరావు ఉన్న సమయంలో దేశ భద్రత మీద వంటి అంశాల మీద శ్రద్ధ పెరిగినా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా అది అటకెక్కింది.

CTBTపై సంతకం చేయాలంటూ

CTBTపై సంతకం చేయాలంటూ

అమెరికా ఫోన్లు చేసి బెదిరించడం, సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం (CTBT)పై సంతకం చేయాలంటూ అమెరికా దాని మిత్ర దేశాలు ఒత్తిడి చేయడంతో అంతా సైలెన్స్ గా మారిపోయింది.

తరువాత ప్రధానిగా వచ్చిన వాజ్‌పేయి..

తరువాత ప్రధానిగా వచ్చిన వాజ్‌పేయి..

ఆ తరువాత ప్రధానిగా వచ్చిన వాజ్‌పేయి ఫోఖ్రాన్ 11 పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇండియా అణుపరీక్షల రంగంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. రాజస్తాన్‌లోని థార్‌ ఎడారిలో 1998 మే 11, 13 తేదీల్లో భారత్‌ భూగర్భంలో ఐదు అణు పరీక్షలను జరిపింది.

ఆపరేషన్‌ శక్తి (పోఖ్రాన్‌-2)

ఆపరేషన్‌ శక్తి (పోఖ్రాన్‌-2)

ఈ పరీక్షలు అంతర్జాతీయంగా భారత్‌ పట్ల ఉన్న వైఖరిని, భారత వైజ్ఞానిక సామర్థ్యాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. అయితే అదేమి అంత ఆషామాషీగా జరగలేదు. ఆపరేషన్‌ శక్తి (పోఖ్రాన్‌-2) ని అడ్డుకునేందుకు ప్రపంచ దేశంలోని అగ్రదేశాలు అణుక్షణం అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలకు తెరలేపాయి.

CIAకు చెందిన శక్తివంతమైన ఉపగ్రహాలు..

CIAకు చెందిన శక్తివంతమైన ఉపగ్రహాలు..

1974తో పోల్చుకుంటే 1998లో అణుపరీక్షలకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ CIAకు చెందిన శక్తివంతమైన ఉపగ్రహాలు రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని నిఘాను మరింతగా పెంచాయి.

గోపాల్ కౌశిక్, చేతన్ కుమార్ లు..

గోపాల్ కౌశిక్, చేతన్ కుమార్ లు..

అయితే మన శాస్త్రవేత్తలు వాటిని బురిడీ కొట్టిస్తూ ప్రయోగాన్నివిజయవంతం చేశారు. ఆ ప్రయోగం ఎలా జరిగింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాలను ఆ ఆపరేషన్ లో కీలకంగా వ్యవహరించిన రెజిమెంట్ కమాండర్ రిటైర్డ్ కల్నల్ గోపాల్ కౌశిక్, చేతన్ కుమార్ లు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూతో తమ అనుభవాలను పంచుకున్న సంగతి విదితమే.

వారి అనుభవాల ప్రకారం..

వారి అనుభవాల ప్రకారం..

ఈ పరీక్షల కాలంలో శాస్త్రవేత్తలకు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా మారింది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోయేది.

తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..

తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..

దీంతో పాటు ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లతో నిండి ఉండేది. దీంతో శాస్త్రవేత్తలు, అధికారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయోగాన్ని ముందుకు తీసుకువెళ్లారు.

అణుబాంబులను భూమిలోప అమర్చేందుకు ..

అణుబాంబులను భూమిలోప అమర్చేందుకు ..

అలాంటి నేపథ్యంలో అణుబాంబులను భూమిలోప అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడంతో మరో తలనొప్పి స్టార్టయింది. విపరీతమైన వేడి ఉన్న ప్రాంతంలో వర్షపు కోట్లు ధరించి అణుబాంబును అమర్చిన గుంతల్లో దిగి పనిచేయాలంటే సైనికులకు చాలా ఇబ్బందికరంగా ఉండేది.

నీటి దెబ్బకు తుప్పు పట్టిపోవడం..

నీటి దెబ్బకు తుప్పు పట్టిపోవడం..

అయితే అణుబాంబుల కోసం అమర్చిన లోహపు పరికరాలు నీటి దెబ్బకు తుప్పు పట్టిపోవడం మొదలయ్యాయి. వాటిని కాపాడుకునేందుకు నీటిని బయటకు తోడేద్దామని అనుకున్నాము. కాని పైన అమెరికా శాటలైట్లు అడుగడుగునా నిఘాను పెంచడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి వేరే ఆలోచన చేశాము.

విదేశీ ఉపగ్రహాలు..

విదేశీ ఉపగ్రహాలు..

నీటిని బయటకు తోడేస్తే ఇసుకరంగు అక్కడ మొలిచే పచ్చిక సైతం రంగు మారుతుంది. దీని ద్వారా విదేశీ ఉపగ్రహాలు ఈ ఆపరేషన్ ను గుర్తించే అవకాశం ఉందని దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటి ద్వారా నీటిని పంపింగ్ చేశాము. దీని ద్వారా నీరు పూర్తిగా లోపలకి ఇంకిపోయేవి.

అణుబాంబుల్ని అమర్చిన అనంతరం

అణుబాంబుల్ని అమర్చిన అనంతరం

తవ్విన గుంతల్లో అణుబాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో పెద్ద సవాలుగా మారింది. ఇసుక బస్తాలను పై నుంచి విసిరేస్తే అణుబాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో శాస్త్రవేత్తలు, అధికారులు సరికొత్తగా ఆలోచించారు.

బిలియార్డ్స్ లో వాడే క్యూ స్టిక్ సాయంతో..

బిలియార్డ్స్ లో వాడే క్యూ స్టిక్ సాయంతో..

ఓ జాలి లాంటి పరికరంతో బ్యాగుల్ని వదలాలని అనుకున్నా అది కుదరకపోవడంతో బిలియార్డ్స్ లో వాడే క్యూ స్టిక్ సాయంతో ఇసుక బస్తాలను జారవిడిచి గుంతల్లోని పైపులని ఒకటి మరొకటి అమర్చి అణుబాంబులను గుంతల్లో పూడ్చారు.

1998 మే 11 నుంచి 13 మధ్య కాలంలో ..

1998 మే 11 నుంచి 13 మధ్య కాలంలో ..

ఇలాంటి రిస్క్ ల మధ్య 1998 మే 11 నుంచి 13 మధ్య కాలంలో 5 అణు పరీక్షల్ని ఇండియా విజయవంతంగా నిర్వహించిందని కౌశిక్ ఇంటర్యూలో తెలిపారు.

అమెరికా నిఘా ఉపగ్రహాలను పక్కదారి పట్టించేందుకు ..

అమెరికా నిఘా ఉపగ్రహాలను పక్కదారి పట్టించేందుకు ..

ఇక్కడ అమెరికా నిఘా ఉపగ్రహాలను పక్కదారి పట్టించేందుకు ఫోఖ్రాన్ అణు పరీక్షలు జరుగుతున్న ప్రాంతంలో పగటిపూట ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు క్రికెట్ ఆడేవారట. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమికూడేవారని ఆయన తెలిపారు.

సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని ..

సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని ..

జనసంచారం ఎక్కువ కావడం వల్ల విదేశీ నిఘా వర్గాలు ఫోఖ్రాన్ అణు పరీక్ష రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏ మాత్రం అనుమానించలేదని సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయని కల్నల్ తెలిపారు.

100 మంది శాస్త్రవేత్తలు..

100 మంది శాస్త్రవేత్తలు..

కేవలం రాత్రి పూట మాత్రమే ప్రయోగాలు పనులు చేపట్టారని అణుశక్తి మాజీ ఛైర్మెన్ ఆర్. చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనిల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

కలాంను మేజర్ జనరల్ పృధ్వీరాజ్ ..

కలాంను మేజర్ జనరల్ పృధ్వీరాజ్ ..

ఈ శాస్త్రవేత్తల కదలికలను నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వీరంతా సైనిక దుస్తులు ధరించేవారు. శాస్త్రవేత్తలను మారుపేర్లతో పిలిచుకుంటూ ఉండేవారు. కలాంను మేజర్ జనరల్ పృధ్వీరాజ్ గానూ. ఆర్ చిదంబరాన్ని మేజర్ నటరాజ్ గానూ వ్యవహరించేవారు.

కోడ్ లు

కోడ్ లు

అలాగే అణుబాంబు పరీక్షలు జరిపే పరికరాలకు White House, whisky, Taj Mahal లాంటి పదాలను కోడ్ లుగా వాడేవారని, దీని వల్ల సీఐఎకి ఎలాంటి అనుమానాలు వచ్చేవి కావని ఆయన తెలిపారు.

కొద్దిమందికి మాత్రమే..

కొద్దిమందికి మాత్రమే..

ఈ పరీక్షల గురించిన సమాచారం నాటి మంత్రుల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసని తెలుస్తోంది. Lal Krishna Advani, George Fernandes, Pramod Mahajan, Jaswant Singh, and Yashwant Sinhaలకు మాత్రమే దీనిపై సమాచారాన్ని ఇచ్చారు.

బ్లేమ్ చేస్తూ కథనాలను..

బ్లేమ్ చేస్తూ కథనాలను..

ప్రయోగాన్ని ఆనాటి ప్రధాని వాజ్ పేయి టెలివిజన్లలో ప్రకటించగానే యుఎస్ అధికారగణం దీన్ని బ్లేమ్ చేస్తూ కథనాలను ప్రచురించాయి. న్యూయార్క్ టైమ్స్ దీనికి నాయకత్వం వహించిందని కూడా తెలుస్తోంది.ఇండియాను ప్రపంచపటంలో నిలిపేందుకు ఈ పరీక్షలు ఆ తరువాత ఎంతలా ఉపయోగపడ్డాయో అందరికీ తెలిసిందే. కాగా ఆ తరువాత ఈ అణుపరీక్షలను ఇండియా అపివేసింది.

బాలీవుడ్ నుంచి సినిమా

బాలీవుడ్ నుంచి సినిమా

ఆనాటి సంఘటలను పోఖ్రాన్ అణుపరీక్ష విజయవంతం ఎలా అయిందనే దాని మీద బాలీవుడ్ నుంచి సినిమా కూడా వచ్చింది. పరమాణు పేరుతో డైరక్టర్ అభిషేక్ శర్మ దీన్ని తెరకెక్కించారు. జాన్ అబ్రహం హీరోగా నటించారు.

Best Mobiles in India

English summary
Parmanu, the true story of Pokhran: How India 'fooled' CIA with historic nuclear test more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X