వెల్ కమ్ టు వైజాగ్ 'సోఫియా'

ప్రపంచంలోని తొలి రోబో సిటిజెన్ సోఫియా విశాఖకు వచ్చింది.

|

ప్రపంచంలోని తొలి రోబో సిటిజెన్ సోఫియా విశాఖకు వచ్చింది. డెస్టినేషన్ సిటీలో జరుగుతున్న ఫిన్ టెక్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు బుధువారం నగరానికి వచ్చిన సోఫియా...హాయ్ వైజాగ్... మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మల్లి రేపు కలుద్దాం అని చెప్పింది. మంగళవారమే సోఫియా విశాఖకు రావాల్సి ఉండగా.. పలు సాంకేతిక కారణాలతో రాలేదని ప్రతినిధులు చెప్పగా,దాంతో ఫోటోలు దిగేందుకు పలువురు టెకీలు ఆసక్తి చూపారు

 

మీ ఫోన్ లో బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త !మీ ఫోన్ లో బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త !

సోఫియా రోబోట్‌ను హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది....

సోఫియా రోబోట్‌ను హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది....

సోఫియా రోబోట్‌ను హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది. 2015లో తొలిసారిగా లాంచ్ అయిన ఈ రోబోట్ అచ్చం మనిషిలానే స్పందించగలుగుతుంది. కొద్ది నెలల క్రితమే ఈ రోబోట్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ దేశ సభ్యత్వాన్ని మంజూరు చేసి వార్తల్లోకి ఎక్కింది.

సౌదీ అరేబియా పౌరసత్వం..

సౌదీ అరేబియా పౌరసత్వం..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సుకు పెద్దపీట వేస్తున్న దేశాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవటం కోసమే సౌదీ ప్రభుత్వం సోఫియా రోటోట్‌కు పౌరసత్వం ఇచ్చినట్లు అప్పట్లో పలు అభిప్రాయాలు వెలువడ్డాయి. ఏదేమైనప్పటికి తాను మనుషులతో కలసి పనిచేయాలనుకుంటున్నానని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని వారి నమ్మకాన్ని పొందాలనుకుంటున్నానని పౌరసత్వం మంజూరైన సందర్భంగా సోఫియా రోబోట్ స్పందించటం విశేషం.

హ్యూమనాయిడ్ రోబోట్స్‌కు మరింత ప్రాచుర్యం..
 

హ్యూమనాయిడ్ రోబోట్స్‌కు మరింత ప్రాచుర్యం..

రోబోటిక్స్ రంగం మరింతగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రకరకాల హ్యూమనాయిడ్ రోబోట్స్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్థి చెందుతున్నాయి. ఇప్పటి వరకు రూపుదిద్దుకున్న హ్యూమనాయిడ్ రోబోట్‌లలో చాలా వరకు రోబోట్స్ భయానక టెర్మినేటర్ డ్రాయిడ్ డిజైన్‌లను పోలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన రిక్కీ మా స్కార్లెట్ జాన్సన్‌ను పోలిన అందమైన ఆడ రోబోట్‌ను అభివృద్థి చేసారు.

అందమైన ఆడ రోబోట్..

అందమైన ఆడ రోబోట్..

ఈ రోబోట్‌ను తయారు చేసేందుకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. ఈ రోబోట్ నిర్మాణంలో భాగంగా దాదాపు 50,000డాలర్ల వరకు రిక్కీ వెచ్చించాల్సి వచ్చిందట. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.33 లక్షలు. 3డీ ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి ఈ రోబోట్‌ను అభివృద్థి చేసినట్లు రిక్కీ వెల్లడించారు. మార్క్ 1 పేరుతో రూపుదిద్దుకున్న ఈ రోబోట్ వాయిస్ కమండ్‌లకు స్పందించటమే కాదు ప్రత్యేకమైన హావభావాలను కూడా ఒలికించగలదు.

రోబోట్లు మనిషి చేతిలో కీలుబొమ్మేలే..

రోబోట్లు మనిషి చేతిలో కీలుబొమ్మేలే..

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించు కోగలుగుతున్నాం.

 

Best Mobiles in India

English summary
Robot Sophia at Vizag Fintech Fest.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X