కూలి పనుల నుంచి ఇస్రో చైర్మెన్ దాకా, శివన్ జీవితమే ఓ తెరిచిన పుస్తకం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మెన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త కె.శివన్ నియమితులయ్యారు.

By Hazarath
|

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మెన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త కె.శివన్ నియమితులయ్యారు. శివన్ ప్రస్తుతం విక్రమ్ సారాబాయి అంతరిక్ష సంస్థ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇస్రోకు ప్రస్తుతం చైర్మెన్‌గా ఉన్న కిరణ్ కుమార్ ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత శివన్ బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్ల పాటు ఆయన ఇస్రో చైర్మెన్‌గా కొనసాగనున్నారు. అంతరిక్ష శాఖ కార్యదర్శి పదవితోపాటు అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా శివన్‌ పేరు ఖరారు చేస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. శివన్ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..

 

ప్రమాదంలో ఎలాన్ మస్క్ రాకెట్ కారు, ప్రయోగం విజయవంతమైన రెండో రోజే..ప్రమాదంలో ఎలాన్ మస్క్ రాకెట్ కారు, ప్రయోగం విజయవంతమైన రెండో రోజే..

మట్టిపిసికిన ఆ చేతులు..

మట్టిపిసికిన ఆ చేతులు..

ఆరుగాలం పొలంలో మట్టిపిసికిన ఆ చేతులు అంగారకడిపైకి రాకెట్‌ని ప్రయోగించాయి. విమానాన్నిదగ్గర చూడాలన్ని తాపత్రయం 104 ఉపగ్రహాలని రోదసిలోకి పంపి రికార్డు సృష్టించాయి. ఈ స్టోరీలో ఆ కూలివాడు ఎవరో కాదు ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చైర్మెన్ గా రాబోతున్న శివన్ కె.

నాగర్ కోయిల్ జిల్లాలో..

నాగర్ కోయిల్ జిల్లాలో..

తమిళనాడులోని  కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ దగ్గర సరక్కల్‌విళై అనే ఊరిలో ఓ సాధారణ రైతు కుటుంబంలో శివన్ జన్మించారు. ఇప్పుడు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.

డిగ్రీ దాకా పొలం పనులతో ..
 

డిగ్రీ దాకా పొలం పనులతో ..

పదోతరగతి తర్వాత చదువుకు ఏర్పడిన విపరీతమైన ఆటంకంతో కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. డిగ్రీ దాకా పొలం పనులతో గడిపారు. ఆ పొలమే చదువు నేర్పిందేమో..డిగ్రీలోని నాలుగు సబ్జెక్టుల్లో వందకు వందశాతం మార్కులు తెచ్చుకుని పై చదువులకు బాటలు ఏర్పరచుకున్నాడు.

చదువు

చదువు

ఆ మార్కులతో మద్రాసు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కిలో సీటు రావడం ఆ సంస్థ ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో బీఈ చేసే అవకాశం రావడం అంతా ఆ మట్టి చలవేనని గర్వంగా చెబుతారు శివన్. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్సీ)లో ఎంఈ పూర్తి చేశారు.

ఫీజు కట్టలేని పరిస్థితుల్లో..

ఫీజు కట్టలేని పరిస్థితుల్లో..

ఫీజు కట్టలేని పరిస్థితుల్లో తన తండ్రి తనకున్న పొలంలో ఎకరా పొలం అమ్మేసి తన ఫీజులకు డబ్బులు పంపిన విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానంటూ ఓ ఇంటర్యూలో తెలిపారు. ఆ ప్రేమ, ఆయన శ్రమ వల్లే మట్టిలో బతికిన నేను.. ఆకాశంపై చూపులు సారించగలిగానని తండ్రి గురించి గొప్పగా చెప్పిన విషయాలు ఎప్పటికీ మరచిపోనని చెబుతాడు.

జూనియర్‌ సైంటిస్టుగా..

జూనియర్‌ సైంటిస్టుగా..

ఐఐస్సీలో ఉన్పప్పుడు అనేక ఆఫర్లు ఆయన తలుపుతట్టాయి. అమెరికా, రష్యా నుంచి ఎన్నో ఉద్యోగ ఆహ్వానాలు వచ్చినా ఈ మట్టి నుంచి దూరం కావడం ఇష్టంలేక వాటిని తిరస్కరించారు. అంతరిక్ష పరిశోధనల్లో అప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఇస్రోలో జూనియర్‌ సైంటిస్టుగా అడుగుపెట్టారు.

జీఎస్‌ఎల్‌వీ రూపకల్పనలో..

జీఎస్‌ఎల్‌వీ రూపకల్పనలో..

స్వదేశీ క్రయోజనిక్‌ సాంకేతికతతో పనిచేసే జీఎస్‌ఎల్‌వీ రూపకల్పనలో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘విక్రమ్‌ సారాభాయ్‌' కేంద్రానికి డైరెక్టర్‌గా, అంగారకుడిపైకి పంపిన ‘మామ్‌' ప్రాజెక్టుకి నేతృత్వం వహించి, గత ఫిబ్రవరిలో ఒకేసారి 104 ఉపగ్రహాలని నింగిలోకి తీసుకెళ్లిన రికార్డు ఫీటుని ముందుండి నడిపించారు.

 ఇస్రో చైర్మన్ పదవి కట్టబెట్టడంపై..

ఇస్రో చైర్మన్ పదవి కట్టబెట్టడంపై..

తనకు ఇస్రో చైర్మన్ పదవి కట్టబెట్టడంపై శివన్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి గౌరవించారని, ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని శివన్ పేర్కొన్నారు.

కార్టోశాట్ 2 ఉపగ్రహ ప్రయోగానికి ..

కార్టోశాట్ 2 ఉపగ్రహ ప్రయోగానికి ..

మరోవైపు పీఎస్‌ఎల్వీ సి 40 రాకెట్ ద్వారా కార్టోశాట్ 2 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో ముమ్మర ఏర్పాటు చేస్తోంది. జనవరి 12 న నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. 

గతంలో విఫలం

గతంలో విఫలం

గతంలో నిర్వహించిన ప్రయోగం విఫలం కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

శివన్ రాకతో..

శివన్ రాకతో..

శివన్ రాకతో ఇండియా కలలసౌధం ఇస్రో మరిన్ని విజయాలతో దూసుకుపోయి ప్రపంచ పటంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని అందరం కోరుకుందాం. చంద్రయాన్‌-2, అతిశక్తిమంతమైన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ల ప్రయోగాలు విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

Best Mobiles in India

English summary
Rocket scientist Sivan K appointed as Chairman of ISRO more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X