మార్స్‌ని సవాల్ చేస్తున్న నాసా గే సైన్స్ డాడీ,స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు

|

స్పేస్ రంగంలో దూసుకుపోతున్న నాసా ఆకాశం మొత్తం జల్లెడపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో మార్స్ మీదకు లేటెస్ట్ మిషన్ ఇన్‌సైట్‌ను పంపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మిషన్ గత వారం విజయవంతంగా ప్లానెట్ ని టచ్ చేసింది. దీంతో నాసాకు చెందిన శాస్ర్తవేత్తలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే దీని వెనుక ఓ గే ఇంజనీర్ కృషి ఉందని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. నాసా మార్స్ మీదకు ప్రయోగించిన ఇన్‌సైట్‌ మిషన్ ను దగ్గరుండి పర్యవేక్షించి దాన్ని విజయవంతంగా ప్లానెట్ మీదకు పంపడంలో ఈ గే ఇంజనీర్ ఎంతో కష్టపడ్డాడు. నాసా సైతం అభినందనల వెల్లువలతో ముంచెత్తింది. అతడే Troy Hudson. ట్విట్టర్ ముద్దుగా సైన్స్ డాడీ అని పిలుచుకునే అతని జీవిత ప్రస్థానంలోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.

 

ఇక కంటి గ్లాసెస్‌తో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు

ట్రోయ్ హడ్సన్

ట్రోయ్ హడ్సన్

మార్స్ మీదకు ఇన్‌సైట్‌ మిషన్ ను విజయవంతంగా పంపిన శాస్త్రవేత్త. ఈ విజయాన్ని చూసి ట్విట్టర్ ఇతనికి సైన్స్ డాడీ అని నిక్ నేమ్ పెట్టింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పేరుతోనే ఆయన్ని అందరూ పిలుస్తున్నారు. పూర్తి పూరు కూడా చాలా మందికి తెలియదు.

ఇన్‌సైట్‌ మిషన్ ఏం చేస్తుంది

ఇన్‌సైట్‌ మిషన్ ఏం చేస్తుంది

మార్స్ మీదకు ఈ ఇంజనీర్ సహాయంతో నాసా పంపిన ఇన్‌సైట్‌ మిషన్ అంగారకుడి అంతర్భాగంపై అధ్యయనం చేస్తుంది. అంగారకుడిపై ప్రకంపనలు, నేల స్వరూపం, భూమితో ఉన్న సారూప్యాలను ఇది విశ్లేషించి డేటాను భూమి మీదకు పంపిస్తుంది.

అంగారకుడి అంతర్భాగంలో..
 

అంగారకుడి అంతర్భాగంలో..

ప్రకంపనలను అధ్యయనం చేయడం ద్వారా అంగారకుడి అంతర్భాగంలో రాతి పొరల అమరిక ఎలా ఉందో దీని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ వివరాలను భూఅంతర్భాగానికి సంబంధించిన సమాచారంతో పోల్చి చూస్తారు.

గ్రహాల ఆవిర్భావం

గ్రహాల ఆవిర్భావం

దీంతో పాటుగా అంగారకుడు, భూమి ఎలా ఆవిర్భవించాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.4.6 బిలియన్ సంవత్సరాల క్రితం గ్రహాల ఆవిర్భావం ఎలా జరిగిందో కనిపెట్టేందుకు కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటారు.

హడ్సన్ జీవితం

హడ్సన్ జీవితం

హడ్సన్ 1977లో టెక్సాస్ లో జన్మించారు.అక్కడే Kingwood High Schoolలో స్కూలు విద్యను, Massachusetts Institute of Technology లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. California Institute of Technology నుంచి Geological and Planetary Sciences అనే దాని మీద డాక్టరేట్ సాధించారు.

చిన్నప్పటి నుంచే ఆకాశం గురించి ఆసక్తి

చిన్నప్పటి నుంచే ఆకాశం గురించి ఆసక్తి

హడ్సన్ మూడేళ్ల వయసు నుంచే ఆకాశాన్ని చదవడం మొదలుపెట్టారు. ఆకాశం ఎందుకు అలా ఉంది. అక్కడ ఏమేమి ఉంటాయి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా ప్రతీ దాని గురించి తెలుసుకోవాలనుకునేవాడు. ఆ ఆసక్తితోనే స్పేస్ ని ఓ సబ్జెక్టుగా తీసుకుని నాసాలో ప్రముఖ ఇంజనీర్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు.

నాసాలో జాబ్ ఎక్కడ ?

నాసాలో జాబ్ ఎక్కడ ?

నాసాలోని Jet Propulsion Laboratory (JPL)లో Technologist 3 ఉద్యోగిగా 2008లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అక్కడ Planetary scientist and instrument systems engineerగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని గర్వంగా చెబుతారు.

ఇన్‌సైట్‌ మిషన్ లో హడ్సన్ రోల్

ఇన్‌సైట్‌ మిషన్ లో హడ్సన్ రోల్

ఈ ప్రాజెక్ట్ మీద హడ్సన్ వివిధ రకాల స్జేజ్ ల్లో పనిచేస్తున్నారు. మార్స్ మీదకు వెళ్లిన మిషన్ భూమి మీదకు పంపే డేటాను సేకరించడం అలాగే దానిపై అధ్యయనం చేయడం, మిషన్ పనితీరును పరిశీలించడం వంటి ముఖ్యమైన పనుల్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు. గత 9 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట మీద పనిచేస్తున్నారు.

గే అయితే ఏంటీ..

గే అయితే ఏంటీ..

జీవితం అనేది దేవుడిచ్చిన వరం అని దాన్ని అందంా మార్చుకోవాలంటారు హడ్సన్. నేను గేని అయినా నా స్నేహితులు కాని తోటి ఉద్యోగులు కాని నాతో చాలా స్నేహంగా ఉంటారు. పని విషయంలో నేను గే అనే ఫీలింగ్ ఎక్కడ కనపడకుండా కలిసిమెలిసి ఉంటారని సగర్వంగా చెబుతారు. సంోషంగా ఉండేందుకు ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఎప్పటికీ అడ్డంకి కావు అని చెబుతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Gay NASA Engineer Troy Hudson Tells Us What It's Like to Land a Probe on Mars More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X