విధిని జయించిన వీరుడు ఏలియన్స్ మీద చెప్పిన ఆసక్తికర విషయాలు

|

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అటువంటి స్థితిలో మరో వ్యక్తి అయితే ఎప్పుడో కుప్పకూలిపోయేవాడు. కానీ ఆయన తన మొక్కవోని ధైర్యంతో మనుగడ సాగించడమే కాకుండా ప్రపంచం మర్చిపోలేని పరిశోధనలు చేశాడు. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా కూడా ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేసి విశ్వవిఖ్యాతి గడించారు. విధి వెక్కిరస్తుంటే దానికి ఎదురొడ్డి అమేయమైన ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు సాగారు. ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర అంశాలు మీకోసం..

 

ప్రపంచంలోనే అత్యంత చిన్న పీసీ,రూ. 13 వేలకే సొంతం చేసుకోండిప్రపంచంలోనే అత్యంత చిన్న పీసీ,రూ. 13 వేలకే సొంతం చేసుకోండి

ఇతర గ్రహాలపై జీవం ఉందా

ఇతర గ్రహాలపై జీవం ఉందా

ఇతర గ్రహాలపై జీవం ఉందా అనే ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఏలియన్స్ మనకు ఎప్పటికైనా కాంటాక్ట్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ వారి సిగ్నళ్లకు స్పందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఆధునిక నాగరికతకు..

ఆధునిక నాగరికతకు..

మన కంటే ఆధునిక నాగరికతకు చెందిన వారి పిలుపునకు స్పందిస్తే.. మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉదాహరణగా.. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనిపెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించారు. స్థానిక అమెరికన్లతో కూడిన అద్భుత అమెరికా నాగరికతను కొలంబస్ ఆ దేశాన్ని కనిపెట్టాక, అక్కడి వెళ్లిన విదేశీయులు నాశనం చేసిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు.

మనల్ని బ్యాక్టీరియాలాగానే..
 

మనల్ని బ్యాక్టీరియాలాగానే..

ఏలియన్స్ మనల్ని బ్యాక్టీరియాలాగానే చూస్తారని, మనకు గుర్తింపు ఇవ్వరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను ‘స్టీఫెన్ హాకింగ్స్ ఫేవరేట్ ప్లేసెస్' అనే డాక్యుమెంటరీలో పొందుపరిచారు. ఏలియన్స్ విషయంలో మానవాళిని హాకింగ్స్ గతంలోనూ హెచ్చరించారు.

వంద కోట్ల సంవత్సరాలు ముందున్న నాగరికత ..

వంద కోట్ల సంవత్సరాలు ముందున్న నాగరికత ..

మన కంటే వంద కోట్ల సంవత్సరాలు ముందున్న నాగరికత ఏదైనా మన సందేశాలను చదివే అవకాశం ఉందని ఆయన గతేడాది చెప్పుకొచ్చారు. విశ్వంలో మ‌నం ఒంట‌రివాళ్లం కాద‌ని, ఎక్క‌డో ఓ చోట జీవం ఉంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు మ‌రింత ఎక్కువైందని ఆయ‌న చెప్పారు. ఏలియ‌న్స్ గురించి హాకింగ్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం ఇదే తొలిసారి కాదు.

కొందరు పరిశోధకులు..

కొందరు పరిశోధకులు..

అయితే కొందరు పరిశోధకులు ఆయన భయాలను కొట్టిపారేస్తున్నారు. మనం 1900ల నుంచే రేడియో సిగ్నల్స్‌ను అంతరిక్షంలోకి పంపుతున్నామని, మన కంటే ఆధునిక నాగరికతకు చెందిన ఏలియన్స ఉంటే.. ఇప్పటికే మనకు సిగ్నల్స్ పంపేవారని వారు వాదిస్తున్నారు.

ప‌ది ల‌క్ష‌ల న‌క్ష‌త్రాల‌పై ..

ప‌ది ల‌క్ష‌ల న‌క్ష‌త్రాల‌పై ..

గ‌త సంవత్సరం మ‌న‌కు స‌మీపంలోని ప‌ది ల‌క్ష‌ల న‌క్ష‌త్రాల‌పై జీవం అన్వేష‌ణ కోసం ఉద్దేశించిన‌ బ్రేక్‌థ్రూ లిసెన్ ప్రాజెక్ట్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కూడా హాకింగ్ ఇలాగే హెచ్చ‌రించారు. మ‌న సందేశాల‌ను స్వీక‌రించే గ్ర‌హాంత‌ర‌వాసులు మ‌న‌కంటే కొన్ని వంద‌ల కోట్ల ఏళ్ల ముందే ఉండొచ్చ‌ని ఆయ‌న అన్నారు.

 అన్వేష‌ణ

అన్వేష‌ణ

ఏలియ‌న్స్ (గ్ర‌హాంత‌ర‌వాసులు) కోసం అన్వేష‌ణ మొద‌లైంది. నైరుతి చైనాలోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఈ పనులు ప్రారంభించింది. 

రూ.1200 కోట్ల ఖ‌ర్చుతో..

రూ.1200 కోట్ల ఖ‌ర్చుతో..

30 ఫుట్‌బాల్ మైదానాలంత‌ వైశాల్యంలో ఉన్న అపెర్చ‌ర్ స్పెరిక‌ల్ రేడియో టెలిస్కోప్ (ఎఫ్ఎఎస్‌టీ)ను గిజౌలోని కొండ ప్రాంతంలో ఏర్పాటుచేశారు. రూ.1200 కోట్ల ఖ‌ర్చుతో ఏర్పాటైన ఈ టెలిస్కోప్ ఏలియన్స్ జాడను కనిపెట్టనుంది.

Best Mobiles in India

English summary
Stephen Hawking, Physicist Who Came to Symbolise the Power of the Human Mind, Dies at 76 More news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X