ఆ భయానక శబ్దాలు గ్రహాంతరవాసులవే..

Written By:

గ్రహాంతర వాసులపై భిన్న కథనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వారు ఉన్నారని కొందరు అవన్నీ ఒట్టి పుకార్లని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు వారిపై కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. గ్రహాంతరవాసుల నుంచి రేడియో పేళుళ్ల సంకేతాలు వస్తున్నాయని చెబుతున్నారు. దాదాపు 5 గంటల పరిశోధనలో ఇండియాకు చెందిన శాస్త్రవేత్త ఈ విషయాన్ని చెబుతున్నారు.

ఇండియా అంటే ఇదే, ముంబై వరదలపై ఆనంద్ మహీంద్రా షాకింగ్ ట్వీట్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో..

ఎక్కడో 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రోదసీలో ఉన్న ఒక కుబ్జ పాలపుంతనుంచి 15 రేడీయో పేళుళ్ల సంకేతాలు వెలువడ్డాయి.

ఈ రేడియో సంకేతాలు

ఈ రేడియో సంకేతాలు గ్రహాంతర వాసులు తమ వ్యోమనౌకలను స్టార్ట్ చేయడానికి ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన కాంతిపుంజాలు కావచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రాజెక్టు

గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం మార్క్‌ జుకెర్‌బెర్గ్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, యూరీ మిల్నర్‌ రూ.640 కోట్లతో చేపట్టిన బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రాజెక్టులో ఈ ఆసక్తికర విషయాలు తెలిసాయి.

గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనే ప్రయత్నం

వెస్ట్‌ వర్జీనియాలోని గ్రీన్‌ బ్యాంక్‌ రేడియో టెలిస్కోప్‌, హామిల్టన్‌ పర్వతంపై ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్‌ ప్లానెట్‌ ఫైండర్‌, ఆస్ట్రేలియాలోని పార్క్స్‌ రేడియో టెలిస్కోపు సాయంతో గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

భారత్‌కు చెందిన విశాల్‌ గజ్జర్‌ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు

బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రాజెక్టులో భాగంగా భారత్‌కు చెందిన విశాల్‌ గజ్జర్‌ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు వెస్ట్‌ వర్జీనియాలోని గ్రీన్‌బ్యాంక్‌ టెలిస్కోపు ద్వారా జరిపిన ఐదు గంటల పరిశీలనలో ఈ రేడియో సంకేతాలను గుర్తించారు.

సంకేతాలు వెలువడినప్పుడు

ఈ సంకేతాలు వెలువడినప్పుడు మన సౌరవ్యవస్థ వయసు 200 కోట్ల సంవత్సరాలని, ఆ సమయానికి మన భూమ్మీద ఏక కణ జీవులు మాత్రమే ఉన్నాయని.. ఆ ఏక కణ జీవులు బహు కణ జీవులుగా పరిణామం చెందడానికి మరో 100 కోట్ల ఏళ్లు పట్టిందని బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు.

ఇదే తొలిసారి కాదు.

అయితే ఈ ఫాస్ట్‌ రేడియో బరస్ట్స్‌ (ఎఫ్‌ఆర్‌బీ- రేడియో సంకేతాల)ను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 2012 నవంబరు 2న ఆస్ట్రేలియాలో పార్క్స్‌ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించారు.

ఎఫ్‌ఆర్‌బీ 121102

ఆ రేడియో సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకపోయినా.. ఆ చోటుకు ‘ఎఫ్‌ఆర్‌బీ 121102' అని పేరు పెట్టారు.ఆ తర్వాత ఇది పదేపదే సంకేతాలు వెలువరిస్తున్నందున దీన్ని ‘రిపీటర్‌'గా కూడా వ్యవహరిస్తున్నారు.

డ్వార్ఫ్‌ గెలాక్సీ నుంచి

ఈ సంకేతాలు 300కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్వార్ఫ్‌ గెలాక్సీ నుంచి వస్తున్నట్టు గత ఏడాదే గుర్తించారు కూడా.

వీటి తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువ

తాజాగా ఆగస్టు 26న విశాల్‌ గజ్జర్‌.. అక్కడి నుంచి వచ్చిన 15 బర్‌స్ట్స్ను గుర్తించారు. గతంతో పోలిస్తే వీటి తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువగా ఉందని బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఆండ్రూ సైమన్‌ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Alien hunters from the Breakthrough Listen project have picked up mystery signals which may have been produced by ‘extraterrestrial civilisations’ more news at GIzbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot