విజ్ఞాన శాస్త్రంలో మరో సంచలనం, చనిపోయిన మనుషులను తిరిగి పుట్టించే ప్రయత్నం..

|

విజ్ఞాన శాస్త్రంలో మరో సంచలనానికి శాస్త్రవేత్తలు తెరతీసారు. చనిపోయినా మనుషులను రోబోటిక్ క్లోన్స్ రూపంలో తిరిగి పుట్టించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని స్విడెన్ శాస్త్రవేత్తలు వినియోగించుకోబోతున్నారు. ఈ టెక్నాలజీ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాయిస్‌ను తిరిగి సృష్టించగలుగుతుంది. స్వీడిష్ అంత్యక్రియల ఏజెన్సీ ఫోనిక్స్ (Phoenix) సంస్థ ఈ పరిశోధనలు సాగిస్తోంది. ఈ ప్రయోగాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సరికొత్త టెక్నాలజీతో ప్రపంచానికి సవాల్ విసిరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి అదెలా సాధ్యమనే దానిపై ఓ చిన్న లుక్కేయండి.

 

జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా, ప్రత్యేకతమైన ఫీచర్లు ఏంటీ..?జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా, ప్రత్యేకతమైన ఫీచర్లు ఏంటీ..?

టొరాజన్ తెగవారితో సంప్రదింపులు..

టొరాజన్ తెగవారితో సంప్రదింపులు..

ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వీడిష్ అంత్యక్రియల ఏజెన్సీ ఫోనిక్స్ (Phoenix) ఇండోనేషియాలోని టొరాజన్ తెగవారితో సంప్రదింపులు జరుపుతోంది. ఈ తెగవారు తమ కుటుంబంలో మరణించిన వ్యక్తులకు సంబంధించిన మృతదేహాలను ఖననం చేయకుండా ఇంటిలోనే ఉంచుకుంటారు. ఈ మృతదేహాలకు ప్రత్యేకమైన గదిని కేటాయించి వాటిని రోజు శుభ్రం చేయటంతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తుంటారు. శరీరం కుళ్లిపోకుండా ఫార్మాలిన్ అనే వాటర్ సొల్యూషన్‌ను వారి బాడీలో ఇంజెక్ట్ చేస్తారు.

 

 

జ్ఞాపకాలు మరింత వాస్తవికతను అద్దుకునే అవకాశం

జ్ఞాపకాలు మరింత వాస్తవికతను అద్దుకునే అవకాశం

ఇటువంటి మృతదేహాలను ఎవరైనా తమకు స్వచ్ఛందగా అప్పగించినట్లయితే వాటి పై పరిశోధనలు జరిపి రోబోటిక్ క్లోన్ లను సృష్టించే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్పుట్నిక్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చనిపోయిన వ్యక్తుల రూపంలో కనిపించే ఈ రోబోటిక్ క్లోన్స్ రోజువారి జీవనశైలికి అవసరమైన చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతాయి. ఈ రోబోటిక్ క్లోన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే మరణించిన వారి జ్ఞాపకాలు మరింత వాస్తవికతను అద్దుకునే అవకాశం ఉంది.

మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే
 

మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించు కోగలుగుతున్నాం. రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి.

భారత్‌లో సందడి చేసిన సోఫియా రోబోట్..

భారత్‌లో సందడి చేసిన సోఫియా రోబోట్..

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన రోబోట్ 'సోఫియా' (Sophia) ముంబైలో సందడి చేసింది. అచ్చం ఆడ మనిషిలా కనిపించే ఈ రోబోట్ డిసెంబర్ 31వ తేదీన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టక్నాలజీ- ముంబై క్యాంపస్‌లో నిర్వహించిన కల్చరల్ టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పొల్గొంది. చీర దుస్తులో సాంప్రదాయబద్ధంగా స్టేజీ పైకి వచ్చిన సోఫియా 15 నిమిషాల పాటు విద్యార్థులతో ముచ్చటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ప్రపంచం ఎదుర్కొంటోన్న వివిధ రకాల సమస్యల పై అడిగిన ప్రశ్నలకు ఈ రోబోట్ చక్కగా జవాబులిచ్చింది.

సౌదీ అరేబియా పౌరసత్వం..

సౌదీ అరేబియా పౌరసత్వం..

సోఫియా రోబోట్‌ను హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది. 2015లో తొలిసారిగా లాంచ్ అయిన ఈ రోబోట్ అచ్చం మనిషిలానే స్పందించగలుగుతుంది. కొద్ది నెలల క్రితమే ఈ రోబోట్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ దేశ సభ్యత్వాన్ని మంజూరు చేసి వార్తల్లోకి ఎక్కింది.

 

 

Best Mobiles in India

English summary
Scientists to make tech revolution: Dead people will return in form of robotic clones More news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X