అంతరిక్షంలో సెక్స్ సాధ్యమేనా..?

Written By:

మనిషి జీవితంలో శృంగారం అనేది ప్రముఖ పాత్రను పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది ప్రకృతి సిద్ధమైన చర్య భూమి ఏర్పడిన తరువాత జీవం ఏర్పడి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఇప్పుడిలా ఉందంటే దానికి కారణం శృంగారమే. సీక్రెట్ ప్రదేశాల్లో చాలామంది తమ పని కానిస్తుంటారు. అయితే ఇప్పటివరకు శృంగారం జరగని ప్రదేశం ఒకటి ఉందంటే నమ్మగలరా..అదే అంతరిక్షం.ఒక్క అంతరిక్షంలోనే ఇప్పటి వరకు ఎవరూ సెక్స్‌లో పాల్గొనలేదు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ రేంజ్‌లో వస్తోందా..? లీకయిన స్పెషిఫికేషన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాధారణ ప్రజలను అక్కడి పంపే ప్రయత్నాలు

ఇప్పటికే వ్యోమగాములు విజయవంతంగా అంతరిక్షంలో అడుగుపెట్టడం, క్షేమంగా భూమికి తిరిగిరావడంతో సాధారణ ప్రజలను అక్కడి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అక్కడికి వెళ్లిన తరువాత వీరు తమ పని కానిచ్చే అవకాశం ఉందా..అంటే కష్టమేనంటున్నారు శాస్త్రవేత్తలు.

స్పేస్ టూరిజం పేరుతో

అయితే స్పేస్ టూరిజం పేరుతో కొంత మంది పర్యాటకులను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపడానికి ‘స్పేస్‌ఎక్స్' అనే సంస్థ సిద్ధమవుతోంది.

అక్కడ సెక్స్‌లో పాల్గొనాలంటే

ఈ నేపథ్యంలో ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. టూరిజం అంటున్నారు కాబట్టి.. కచ్చితంగా జంటలు వెళతాయి. మరి వారు అక్కడ సెక్స్‌లో పాల్గొనాలంటే కుదురుతుందా అనే ప్రశ్న తలెత్తింది.

మొదట ఏకాంతత

దీనిపై నాసా హ్యూమన్ రీసెర్చ్ ప్రోగ్రాం మాజీ చీఫ్ సైంటిస్ట్ మార్క్ షెల్హమెర్ స్పందిస్తూ ‘సెక్స్‌కి మొదట ఏకాంతత కావాలని, ఒక వేళ స్పేస్‌ఎక్స్ ఇద్దరు పర్యాటకుల్ని చంద్రుడి మీదికి పంపితే.. వారితో పాటు ఒక నిపుణుడైన వ్యోమగామి కూడా వెళ్తాడు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య అది ఎలా కుదురుతుందని గిజ్మోడో అనే వెబ్‌సైట్‌కి మార్క్ వెల్లడించారు.

జీరో గ్రావిటీలో

అంతరిక్షంలో మైక్రో‌గ్రావిటీ అనేది శృంగారానికి పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని అండర్సన్ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ జాన్ మిల్లిస్ చెప్పారు. ‘జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఒకరికొకరు ఎదురెదురుగా ఉండి దగ్గర కావడం సాధ్యం కాదు' అని గిజ్మోడో‌కు వెల్లడించారు.

గుండె పనితీరు

అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ అనేది మెదడుకు చాలా సులభంగా జరుగుతుందట. కాబట్టి గుండె పనితీరు కాస్త మందగిస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎక్కువ ఉత్సాహానికి గురికావడం, సెక్స్‌లో పాల్గొనడం వల్ల ప్రాణహాని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వచ్చే ఏడాది ఏడుగురిని

వాస్తవానికి స్పేస్ఎక్స్ పంపే ‘క్రూ డ్రాగన్' ద్వారా వచ్చే ఏడాది ఏడుగురిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sex in space: Why it may not be an out of the world experience read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting