పురాణాల్లో క్లోనింగ్ ఉందంటున్న శాస్త్రవేత్తలు,ఈ దేవుళ్ల పుట్టుకకు కారణం అదేనట

దేవతలు అలాగే దేవుళ్ల పుట్టుకకు సైన్స్ కు సంబంధం ఏంటీ..వారి పుట్టుక నిజంగానే సైన్స్ పరంగా జరిగిందా..లేక అద్వితీయ శక్తులతో జరిగిందా...

|

దేవతలు అలాగే దేవుళ్ల పుట్టుకకు సైన్స్ కు సంబంధం ఏంటీ..వారి పుట్టుక నిజంగానే సైన్స్ పరంగా జరిగిందా..లేక అద్వితీయ శక్తులతో జరిగిందా...ఆ రహస్యం వెనుక అనేక అంశాలను ఇప్పుడు సైంటిస్టులు బయటకు తెస్తున్నారు. పురాతన కాలంలోనే సైన్స్ కొత్త పుంతలు తొక్కిందనేదానికి చాలామంది సైంటిస్టులు అవుననే సమాధాన మిస్తున్నారు. దేవతల కాలం నుంచే సైన్స్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లిందనడానికి వారు అనేక కారణాలను చెబుతున్నారు. మరి వారు చెబుతున్న సైన్స్ టెక్నాలజీ ఏంటో మీరే చూడండి.

మహాభారత యుధ్దంలో ఆటంబాంబు పేలిందా..?

మహాభారతం యుద్ధ విమాానాలు

మహాభారతం యుద్ధ విమాానాలు

మహాభారతంలో యుద్ధానికి విమానాలు వాడారని కొందరు వాదిస్తారు.అర్జునుడు ఈ విమానం లాంటి వాహనం పైనే హిమాలయాలు మొత్తం తిరిగాడని దేవతల భూభూగాలను సందర్శించాడని వాదిస్తారు. ద్వారకా సిటీని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులపై ఈ విమానంపై నుంచే యుద్ధం చేశారని చెబుతారు. ఇక శివుడు ఒకే ఒక్క ఆయుధంతో రాక్షసులందర్నీ అంతం చేశాడని మరొక కథనం కూడా ఉంది.

అణ్వాయుధాలు

అణ్వాయుధాలు

మహా భారత యుద్ధంలో వాడిన ఆయుధాలు అత్యంత భయంకరమైన ఆయుధాలని ఇప్పుడు ఆయుధాల కన్నా వేయి రెట్లు ఎక్కువ పవర్ గలవని కొందరి ధియరిస్టులు చెబుతారు. వారు ప్రయోగించన ఆయుధాలు కొన్ని వందల మైళ్ల దూరం వరకు ప్రభావం చూపాయని వాదిస్తారు.

అణ్వాయుధాలు
 

అణ్వాయుధాలు

దాదాపు 18 రోజుల పాటు సాగిన ఈ యుధ్ధంలో 1.6 బిలియన్ల మంది మరణించారు. ఇదెలా సాధ్యమయింది. ఇప్పుడున టెక్నాలజీ పరంగా చూస్తే అంతటి పవర్ పుల్ ఆయుధాలు ఇప్పుడు లేనే లేవు. ఇదే విషయాన్ని హరప్పా మహంజదారో ప్రదేశంలో శాస్త్రవేత్తలు ధృవీకరించారు.

క్లోనింగ్

క్లోనింగ్

పురాతన కాలంలోనే ఈ క్లోనింగ్ అనేది ఉంది. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో చూడవచ్చు. అందులో మంతనగరంలో నిమి అనే రాజు యాగం చేస్తూ చనిపోయినప్పుడు ఆ చనిపోయిన దేహం నుంచి ఓ పాప జన్మిస్తుంది. ఆ పాప ఎవరో కాదు మిధిల రాజు జనక మహరాజు. ఆ మంత దేశమే తర్వాత మిథిలా నగరంగా మారింది. ఇది సైన్స్ పరంగా ఆలోచిస్తే అద్భుతమైన టెక్నాలజీనే అని వాదిస్తారు.

క్లోనింగ్ మరొక ఉదాహరణ

క్లోనింగ్ మరొక ఉదాహరణ

రామాయణంలో సీత రాముల కుమారులైన లవకుశలను వాల్మికీ మహర్షి గడ్డి నుంచి పుట్టిస్తారు. ఇది క్లోనింగ్ టెక్నాలజీ అని సైంటిస్టులు వాదిస్తారు

 

 

కౌరవుల పుట్టుక

కౌరవుల పుట్టుక

హస్థినలో గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భం ధరించినా ముందుగా ప్రసవించ లేక పోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు అక్కడకు వచ్చి ఆ మాసం ముక్కలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు.అలా పుట్టిన వారే కౌరవులు. మరి టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ అప్పట్లో రానే లేదు. ఇది కూడా అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నదేనని చెబుతారు.

రోమన్స్ నానో టెక్నాలజీ

రోమన్స్ నానో టెక్నాలజీ

1600 ఏళ్ల క్రితమే రోమన్స్ కలర్స్ కి సంబంధించిన నానో టెక్నాలజీని ఉపయోగించారు.గ్రీన్ ఎరుపు రంగులను ఉపయోగించారని 1990లో మిస్టరీని చేధించేదాకా ఎవరికీ తెలియదు.

బలరాముడి పుట్టుక

బలరాముడి పుట్టుక

ఈ రోజుల్లో వాడుతున్న ఫలదీకరణం ( Vitro Fertilization) ఆ రోజుల్లో బలరాముడి పుట్టుకతోనే జరిగింది. కంసుడి బార్య దేవకీ గర్భం నుంచి బలరాముడి పిండాన్ని తీసుకుని వసుదేవుని భార్య రోహిణి గర్భంలోకి ప్రవేశపెడతారు. అలా బలరాముని జననం జరుగుతుంది. ఆ కాలంలోనే గర్భమార్పిడి పద్ధతి జరిగిందనేదానికి ఇదే పెద్ద నిదర్శనం.

అభిమన్యుడి పుట్టుక

అభిమన్యుడి పుట్టుక

మహాభారతంలో అర్జునుడి భార్య సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి వింటూ నిద్రలోకి జారుకుంటుంది. అభిమన్యుడు ఏమి విద్యలు నేర్చుకోకుండానే ఓ యోధుడిగా అవతరిస్తాడు. సైన్స్ కి ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెబుతున్నారు డాక్టర్ మకాటో సిచిడియా. దీనికి సంబంధించిన వివరాలు ఆయన Right Brain Education in Infancy బుక్ లో పొందుపరిచారు.

రామసేతు నిర్మాణం

రామసేతు నిర్మాణం

ఆనాడు ఇంజనీరింగ్ టెక్నాలజీ అభివృధ్ధి చెందిదనడానికి గొప్ప ఉదాహరణ ఈ నిర్మాణం. ఎన్ని సునామిలు వచ్చినా చెక్కు చెదరని నిర్మాణం ఇది. మరి ఏం టెక్నాలజీ వాడారనేది మాత్రం అర్థం కాని విషయం. అంత పెద సముద్రంలో ఈ నిర్మాణం సాధ్యమా ఇప్పుడు.

వినాయకుని పుట్టుక ( Organ transplants)

వినాయకుని పుట్టుక ( Organ transplants)

వినాయకుని జననం గురించి అందరికీ తెలిసే ఉంటుంది.దీన్ని ఇప్పటి తరం శాస్త్రవేత్తలు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ గా అభివర్ణిస్తున్నారు.

వినాయకుని పుట్టుక ( Organ transplants)

వినాయకుని పుట్టుక ( Organ transplants)

శనీశ్వరుడు పార్వతి బిడ్డ అయిన వినాయకుడిని చూడగా అతని తల పగిలిపోయిందని అప్పుడు దేవతలంతా తల్లడిల్లుతున్న వేళ విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడని ఇదే ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కి మార్గదర్శకమని సైంటిస్టులు చెబుతారు.

ధృత రాష్ట్రుడు లైవ్ టెలికాస్ట్

ధృత రాష్ట్రుడు లైవ్ టెలికాస్ట్

అంధుడి అయిన ధృత రాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ గా చూస్తాడు. అదెలా సాధ్యం. ఇది మోడరన్ టెలివిజన్ లైట్ టెలికాస్ట్ కి ఇప్పుడు దర్ఫనం పడుతోంది.

విమానాలు

విమానాలు

పురాతన కాలంలోనే విమానాలు ఉన్నాయనడానికి నిదర్శనం భరద్వాజ మహర్షి ఉపయోగించిన వాహనం.

బ్రెయిన్ సర్జరీ

బ్రెయిన్ సర్జరీ

4300 ఏళ్ల క్రితమే బ్రెయిన్ కు సంబంధించి సర్జరీ జరిగిందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో బయటపడింది. అప్పట్లో బాణం బ్రెయిన్ కి దెబ్బతగిలి దాన్ని సర్జరీ చేసిన ఫోటోలు వారికి తవ్వకాల్లో దొరికాయి.

 

 

Best Mobiles in India

English summary
Here Write Shocking science in Hindu mythology. Mythological stories are normally treated as a literature material or sometimes a science fiction

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X