కిమ్ జాంగ్‌కి ముచ్చెమటలు ? నార్త్ కొరియాను వణికిస్తున్న బ్లాకౌట్ బాంబు

అణ్వాయుధ పరీక్షలతో బెంబేలెత్తిస్తున్న ఉత్తర కొరియాకు చెక్‌ పెట్టేందుకు దక్షిణ కొరియా అత్యాధునిక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటోంది.

By Hazarath
|

అణ్వాయుధ పరీక్షలతో బెంబేలెత్తిస్తున్న ఉత్తర కొరియాకు చెక్‌ పెట్టేందుకు దక్షిణ కొరియా అత్యాధునిక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్తరకొరియాలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చేందుకు బ్లాకౌట్ బాంబును దక్షిణ కొరియా తయారు చేసింది. ఉత్తరకొరియా కయ్యానికి కాలు దువ్విన పక్షంలో దక్షిణ కొరియా ఈ బాంబును ప్రయోగించేందుకు సిద్దంగా ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

 

ఆ ఫోన్ మిస్టరీ వెనుక రహస్యం ఏమిటీ..?ఆ ఫోన్ మిస్టరీ వెనుక రహస్యం ఏమిటీ..?

సరికొత్త టెక్నాలజీతో చెక్..

సరికొత్త టెక్నాలజీతో చెక్..

ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా సరికొత్త టెక్నాలజీతో చెక్ పెట్టనుంది. బ్లాకౌట్‌ బాంబును తయారుచేసి కిమ్ జాంగ్ మీదకు వదిలేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఉత్తరకొరియా యుద్ధ సామగ్రికి..

ఉత్తరకొరియా యుద్ధ సామగ్రికి..

యుద్ధ సమయంలో `బ్లాక్‌ ఔట్‌ బాంబు' టెక్నాలజీతో ఉత్తరకొరియా యుద్ధ సామగ్రికి కరెంటును సరఫరా చేసే సిస్టమ్స్‌(బ్యాటరీలు, జనరేటర్లు, సాధారణ విద్యుత్తు సరఫరా వ్యవస్థ)ను పని చేయకుండా నిలిపేయాలని వ్యూహాలు రచిస్తోంది.

ఉత్తర కొరియా విద్యుత్‌ వ్యవస్థను

ఉత్తర కొరియా విద్యుత్‌ వ్యవస్థను

ఈ బ్లాకౌట్‌ బాంబు ఉత్తర కొరియా విద్యుత్‌ వ్యవస్థను కుప్పకూల్చేయగలదు. ఈ విషయాన్ని మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే శత్రుదేశ విద్యుత్తు వ్యవస్థ దాదాపు కుప్పకూలుతుంది.

ప్రాణ నష్టం..
 

ప్రాణ నష్టం..

ఈ ఆయుధాన్ని 'సాఫ్ట్‌బాంబ్‌'గా కూడా పిలుస్తారు. ఈ బాంబుతో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం ఉండదు. విద్యుత్‌ వ్యవస్థ స్తంభిస్తే విద్యుత్‌, బ్యాటరీ, జనరేటర్‌ ఆధారంగా ఆయుధాలను ప్రయోగించడం సాధ్యం కాదు.

ఇది ఎలా పనిచేస్తుందంటే..

ఇది ఎలా పనిచేస్తుందంటే..

బ్లాకౌట్‌ బాంబు తయారీకి రసాయన మార్పులు చేసిన అత్యంత తేలికపాటి పలుచని కార్బన్‌ గ్రాఫైట్‌ ఫిలమెంట్లను వినియోగిస్తారు. ఇవి గాలిలో దూదిపింజల్లా తేలుతాయి.

గ్రిడ్‌ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో ..

గ్రిడ్‌ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో ..

వీటిని ఉత్తర కొరియా విద్యుత్‌ గ్రిడ్‌ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో వదులుతారు. గ్రాఫైట్‌ ఫిలమెంట్లు విద్యుత్‌ పరికరాలపైకి చేరతాయి. దీంతో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి... పవర్‌ గ్రిడ్‌ కుప్పకూలుతుంది.

 దక్షిణ కొరియాకు చెందిన ఓ న్యూస్‌ ఏజెన్సీ..

దక్షిణ కొరియాకు చెందిన ఓ న్యూస్‌ ఏజెన్సీ..

ఈ సాంకేతికతకు సంబంధించిన సమాచారాన్ని దక్షిణ కొరియాకు చెందిన ఓ న్యూస్‌ ఏజెన్సీ బహిర్గత పరచింది.

బ్లాకౌట్‌ బాంబుతోనే ..

బ్లాకౌట్‌ బాంబుతోనే ..

బ్లాకౌట్‌ బాంబుతోనే గల్ఫ్‌ యుద్ధ సమయంలో ఇరాక్‌ విద్యుత్‌ వ్యవస్థను కుప్పకూల్చారు. 1999లో నాటో కూటమి సెర్బియాపై ప్రయోగించింది. దీని ఫలితంగా సెర్బియా పవర్‌ గ్రిడ్‌ 70శాతం కుప్పకూలింది. 2007లో బాగ్దాద్‌లోని అల్‌ ఖైదా అవుట్‌పోస్టుపై ప్రయోగించి సఫలీకృతులయ్యారు.

మరో మారు కిమ్‌ దేశం క్షిపణి ప్రయోగాలు

మరో మారు కిమ్‌ దేశం క్షిపణి ప్రయోగాలు

ఉత్తరకొరియా అధికార పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరో మారు కిమ్‌ దేశం క్షిపణి ప్రయోగాలు చేయొచ్చనే రిపోర్టులు వస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుని దక్షిణ కొరియా నార్త్‌ కొరియాకు 'సాఫ్ట్‌ బాంబ్‌'తో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది.

Best Mobiles in India

English summary
South Korea secures technology to develop ‘blackout bomb’, says report Read more news At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X