Home
Scitech

అంతరిక్షంలో టూర్, రెస్టారెంట్ మరియు ప్రపంచంలో అత్యంత ఖరీదైన భోజనం!

ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ ఊహించని రీతిలో, ఒక లగ్జరీ స్పేస్ టూరిజం సంస్థ SpaceVIP అంతరిక్షంలో మిచెలిన్-స్టార్ తో కూడిన భోజనాన్ని మరియు అత్యంత ఖరీదైన ధరకు అందించాలని ప్రణాళిక వేస్తోంది.

SpaceVIP సంస్థ, అతి తక్కువ సంఖ్యలో ఉన్న మొట్టమొదటి లగ్జరీ స్పేస్-టూరిజం కంపెనీలలో ఒకటిగా ఉంది, డెన్మార్క్ కు చెందిన మిచెలిన్-స్టార్ చెఫ్ రాస్మస్ మంక్ వంటకాల ఆహారంతో అంతరిక్షంలో భోజనం చేసే అరుదైన అనుభవాన్ని ప్రజలకు అందించనుంది.

SpaceVIP Space Tourism Company
ఈ స్పేస్ టూర్ మిషన్‌లో, ఆరు గంటల ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఆరుగురు యాత్రికులు "భూమి యొక్క వాతావరణంలో భోజనాన్ని ఆస్వాదించడం ద్వారా చరిత్ర సృష్టిస్తారు" మరియు దీని టిక్కెట్ ధర $495,000 అవుతుంది.

ఈ స్పేస్ టూర్ మిషన్‌లో వచ్చిన డబ్బు మొత్తం నేరుగా స్పేస్ ప్రైజ్ ఫౌండేషన్‌కు వెళుతుంది. ఈ ఫౌండేషన్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తుంది.

స్పేస్‌షిప్ నెప్ట్యూన్‌లో ఈ భోజనం అందించబడుతుంది
2025 చివరలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి లాంచ్ కాబోయే ఈ మిషన్ సమయంలో, ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ స్పేస్‌షిప్ అయిన స్పేస్ పెర్స్‌పెక్టివ్ యొక్క స్పేస్‌షిప్ నెప్ట్యూన్‌లో ఉన్న ఆరుగురు యాత్రికులకు ఈ ఖరీదైన భోజనం అందిస్తారు.

స్పేస్‌షిప్ నెప్ట్యూన్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
స్పేస్‌షిప్ నెప్ట్యూన్ అనేది ఒక ప్రెజర్ క్యాప్సూల్, ఇది స్పేస్ బెలూన్ ద్వారా నెమ్మదిగా పైకి కదులుతుంది. "Space perspective సంస్థ అంతరిక్ష అనుభవాన్ని మునుపెన్నడూ లేనంతగా అందుబాటులోకి తెస్తోంది" అని స్పేస్ పెర్స్పెక్టివ్ వ్యవస్థాపకుడు మరియు సహ-CEO జేన్ పోయింటర్ ఒక ప్రకటనలో తెలిపారు.

"మా ప్రత్యేకమైన అంతరిక్ష విమానాలతో, ప్రజల కోసం పూర్తిగా జీవితాన్ని మార్చే క్షణాన్ని మేము ప్రారంభిస్తున్నాము - ఈ టోర్ ద్వారా మానవులు ప్రపంచాన్ని మరియు దానిలోని మన స్థానాన్ని చూసే విధానంలో లోతైన మార్పు వస్తుంది."అని తెలియచేసారు.

ఈ స్పేస్‌షిప్ లో ప్రయాణికులు సముద్ర మట్టానికి 100,000 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత కూడా, ప్రయాణికులు విమానంలో Wi-Fiకి యాక్సెస్ పొందుతారు మరియు వారి అంతరిక్ష అనుభవాన్నిభూమిపై ఉన్న వారికి లైవ్ స్ట్రీమ్ కూడా చేయవచ్చు. ఇంకా, భూమిపై ఉన్న తమ కుటుంబం మరియు స్నేహితులతో కూడా కనెక్ట్ అవ్వగలరు.

ఇంకా, ఈ స్పేస్‌షిప్ లో నుంచి భూమి యొక్క కర్వ్ పై సూర్యోదయాన్ని వీక్షించే అవకాశం కూడా వారికి లభిస్తుంది. ఈ అంతరిక్ష టూర్ లో ప్రయాణించడం "అత్యంత సురక్షితమైన మరియు అందుబాటులో ఉండే" మార్గం అని మరియు దీనికి "ఏ శిక్షణ లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా పూర్తిగా కొత్త అంతరిక్ష ప్రయాణ అనుభవం" అని Poynter వివరించారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
SpaceVIP Space Tourism Company Announces Tourists Will be Served World's Most Expensive Meal In Space Dining.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X