ప్రమాదంలో ఎలాన్ మస్క్ రాకెట్ కారు, ప్రయోగం విజయవంతమైన రెండో రోజే..

Written By:

చంద్ర, అరుణగ్రహ యానాన్ని సులభతరం చేయటమే లక్ష్యంగా చేసుకుని నిర్మించిన 'ప్రపంచపు అత్యంత శక్తివంతమైన రాకెట్‌' స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగపరీక్ష విజయ వంతమైన సంగతి అందరికీ తెలిసిందే. ఫ్లోరిడాలోని కేప్‌ కెనవెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 18, 747 జెట్‌ లైనర్ల వేగంతో ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. కారును అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్‌ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్‌ ఎక్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది.అయితే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న అగ్ని, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన నిజాలివే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారకుడి అవతల ఆస్టరాయిడ్‌ ప్రభావిత ప్రాంతంలో..

ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో.. ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్‌ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్‌ మస్క్‌ తెలిపడంతో వీరంతా నిరాశలో మునిగిపోయారు.

సూర్యుడి కాస్మిక్‌ కిరణాలు తగిలి..

ఒకవేళ ఈ కారు ఆ పరిధి దాటి సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్‌ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. ఇదే ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది.

230 అడుగుల ఎత్తు..

ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్‌ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ సుమారు 64 మెట్రిక్‌ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది.

737 జెట్‌లైనర్ల బరువుతో సమానం

ఇది నిండుగా నింపిన 737 జెట్‌లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్‌ హెవీ కంటే శాటర్న్‌ వీ రాకెట్‌ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్‌ హెవీ ప్రయోగం అతిపెద్దది. దీంతో పాటు పునర్వినియోగించుకోగల ప్రత్యేకత ఫాల్కన్‌ హెవీ సొంతం.

సుదూర అంతరిక్ష ప్రాంతాలను..

తొలుత ఫాల్కన్‌ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్‌ మస్క్‌ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

27 ఇంజిన్లను మండించడం ద్వారా..

కాగా ఫాల్కన్‌ హెవీ రాకెట్‌లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు నిమిషాల తర్వాత రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. సముద్రంలో ల్యాండ్‌ అవ్వాల్సిన రాకెట్‌లోని మూడో బూస్టర్‌ కాలిపోయినట్లు ఎలన్‌ చెప్పారు.

ప్రయోగ సమయంలో పెద్ద ఎత్తున పొగలు..

చంద్రుడిపైకి అపోలో 11 అంతరిక్ష వ్యోమ నౌకను ప్రయోగించిన లాంచ్‌పాడ్‌ నుంచి ఈ ప్రయోగం చేయడం గమనార్హం. ప్రయోగ సమయంలో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలా కనిపించింది. ఫాల్కన్‌ రాకెట్‌ చేసిన శబ్దానికి ఫ్లారిడా స్పేస్‌ కోస్ట్‌ కంపించిపోయింది.

మొత్తం ఆరు గంటల పాటు..

మొత్తం ఆరు గంటల పాటు ఈ ప్రయోగం కొనసాగింది. ఫాల్కన్‌ హెవీ అత్యధికంగా 1,41, 000 పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు. ఫాల్కన్‌ హెవీ పేరుతో నిర్మించిన ఈ రాకెట్‌ వినియోగంపై నాసా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
SpaceX rocket set to overshoot Mars and hurtle towards asteroid belt More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot