ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
మిస్టరీగా మారిన తొమ్మిదో గ్రహాన్ని సూర్యుడు 4,500 కోట్ల క్రితమే మింగేసి ఉంటాడని శాస్ర్తవేత్తలు ఇప్పుడు అంచనా వేస్తున్నారు.మన సౌర కుటుంబంలో అదే మొదటి బయటి గ్రహం కావచ్చని వారు చెబుతున్నారు. శాస్త్రీయ అంచనాల ఆధారంగా ఆ గ్రహం సౌర కుటుంబానికి వెలుపల ఉండాలి అయితే అది వెలుపల ఉన్నప్పటికీ అది సౌర కుటుంబంలో భాగమే. అయితే అది ఇప్పుడు మిస్టరీగా మారి కనపడటం లేదు. ఈ విషయాన్ని స్వీడన్ లోని లండన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయంటున్నారు. నక్షత్రాలు సమూహాలుగా ఉన్నప్పుడు అవి ఒకదాని మరోకటి దాటుకుని వెళుతుంటాయి.ఆ సంధర్భంలోనే ఈ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read more : వైరల్‌గా మారిన వీడియో.. చిన్నారిని గొరిల్లా చంపేస్తుందా..?

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
ఈ తొమ్మిదో గ్రహం భూమి ద్రవ్యరాశికి సుమారు 10 రెట్లు, ఫ్లూటో ద్రవ్యరాశికి 5000 రెట్లు ఉంది. ఈ గ్రహం అంతా పూర్తిగా వాయువులతో నిండి ఉండవచ్చని శాస్ర్తవేత్తలు ఎప్పటి నుంచో భావిస్తున్నారు.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
ఈ గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దాదాపు 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
భూమి సూర్యుల మధ్య దూరానికి 700 రెట్లు దూరంలో ఈ తొమ్మిదో గ్రహం తిరుగుతూ ఉండొచ్చని దాని వ్యాసార్ధం భూమి కంటే 3.7 రెట్లు ఎక్కువని, ఉపరితల ఉష్ణోగత్ర మైనస్ 226 డిగ్రీలని వారు లెక్కకట్టారు.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
ఫూట్లోని సౌర కుటుంబం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని వాయువులతో ఈ కూడిన గ్రహం దక్కించుకునే అవకాశం ఉందని నిర్ధారణ కూడా జరిగింది.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
అయితే మరి కొందరి శాస్ర్తవేత్తల అభిప్రాయం ప్రకారం మన సౌర కుటుంబంలో ఫ్లూటోకు ఆవల సూర్యుడి చుట్టూ తిరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్పిన ‘ప్లానెట్ 9' ఉపగ్రహం ఉనికిలో లేకపోవచ్చని వాదిస్తున్నారు.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
దాదాపు నెప్ట్యూన్ బరువున్న ఈ ‘ప్లానెట్ 9' దీర్ఘవృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ 22500 కోట్ల కి. మీ. దూరంలో పరిభ్రమిస్తున్నట్టు భావించారు. ఆ దిశగా ప్రయోగాలు కూడా జరిపారు. కొన్ని సత్ఫలితాలు ఇచ్చినా అవి నిర్థారణ కాలేదు.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
ఇది నిజంగానే ఉంటే అంత దూరంలో తిరుగుతూ సూర్యుని ఆకర్షణ శక్తికి లోబడి పరిభ్రమించడం అసాధ్యం కనుక తొమ్మిదో గ్రహం ఉనికి ఉండకపోవచ్చని ఆ ఆధారాలు తెలియజేశాయి.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
సౌర వ్యవస్థ వయసు 4.5 బిలియన్ ఏళ్లు. సూర్యుడి నుంచి దూరంగా వెళ్లిన ఆ గ్రహం పూర్తిగా వాయు రూపంగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నెప్టూన్, యురానెస్ గ్రహాల తరహాలోనే కొత్త గ్రహం వాయు రూపంలో ఉందంటున్నారు.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు
అయితే ఇప్పుడు దాన్ని సూర్యుడు మింగేశాడని దీనికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మరి నిజమెంతనేది ముందు ముందు గాని తెలియదు.


Click it and Unblock the Notifications








