జనవరిలో ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది

గతేడాది జనవరిలోనే మనం సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌ను చూసిన విషయం పాఠకులందికీ గుర్తుండే ఉంటుంది.

|

గతేడాది జనవరిలోనే మనం సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌ను చూసిన విషయం పాఠకులందికీ గుర్తుండే ఉంటుంది. ఇది అత్యంత అరుదుగా కనిపించే చంద్రగ్రహణం. అయితే ఈ ఏడాది కూడా ప్రారంభంలోనే అలాంటి మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఈ ఏడాది జనవరిలో అలాంటిదే మరో చంద్ర గ్రహణం ఏర్పడబోతున్నది. ఈ నెల 20, 21న (ఆయా దేశాల టైమ్ జోన్స్ ప్రకారం) ఈ అరుదైన చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. కాగా దీనికి సైంటిస్టులు సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ అని పేరు పెట్టారు.

అనిల్ అంబానీకి షాకిచ్చిన ఎరిక్సన్, ఏకంగా జైలుకే !అనిల్ అంబానీకి షాకిచ్చిన ఎరిక్సన్, ఏకంగా జైలుకే !

మూడు ఈవెంట్ల కలయిక

మూడు ఈవెంట్ల కలయిక

అయితే ఇది మొత్తం మూడు ఈవెంట్ల కలయిక అని చెప్పుకోవాలి. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్, వోల్ఫ్ మూన్ కలిస్తే ఈ అరుదైన సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ ఏర్పడుతుంది.

 

 

ఇండియాలో అవకాశం లేదు

ఇండియాలో అవకాశం లేదు

అయితే ఈ అరుదైన సంపూర్ణ గ్రహణాన్ని ఇండియాతోపాటు ఆసియాలోని ప్రజలు పూర్తిగా చూసే అవకాశం లేదు. అమెరికా, యూరప్, ఆఫ్రికా ప్రజలకు ఇది పూర్తిగా కనిపిస్తుంది.

సమయం

సమయం

నేషనల్ జాగ్రఫిక్ ప్రకారం భారత కాలమానం ప్రకారం జనవరి 21 ఉదయం 10:11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుంది. మొత్తం 62 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి ప్రక్రియకు 3 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది.

సూపర్ బ్లడ్ మూన్ అంటే...

సూపర్ బ్లడ్ మూన్ అంటే...

సాధారణంగా చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే పెద్ద సైజులో కనిపిస్తాడు. దీనినే మనం సూపర్ మూన్ అంటాం. బ్లడ్ మూన్ విషయానికి వస్తే.. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో సూర్య కిరణాలు భూవాతావరణం నుంచి వెళ్లి చంద్రుడిపై పడినప్పుడు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అందువల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.

 

 

వోల్ఫ్ మూన్ అంటే..

వోల్ఫ్ మూన్ అంటే..

వోల్ఫ్ మూన్ అంటే శీతాకాలంలో కనిపించే పౌర్ణమి చంద్రుడికి ముద్దు పేరు అనే విషయం తెలిసిందే. అమెరికన్ గిరిజనులు దీనికి ఈ పేరు పెట్టారు. జనవరి 21న కనిపించే చంద్రుడిని సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్‌గా అక్కడి వారు పిలుస్తున్నారు.

Best Mobiles in India

English summary
Super Blood Wolf Moon, partial solar eclipse: Date, timings, where and how to watch in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X