భూమికి దగ్గరలో గ్రహశకలంను కనుగొన్న 14ఏళ్ల చిన్నారులు

|

సూరత్‌కు చెందిన మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల వైదేహి వెకారియా మరియు రాధిక లఖాని ఇద్దరు జంటగా 'స్పేస్ హంట్ కాంపెయిన్' ప్రోగ్రాంలో పాల్గొంటున్నప్పుడు భూమికి సమీపంలో ఉన్న ఒక గ్రహశకలంను కనుగొన్నారు. ఈ విషయాన్ని ఈ ప్రోగ్రాంను నిర్వహించిన ప్రైవేట్ స్పేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ SPACE ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ 14 ఏళ్ల విద్యార్థుల బృందం యొక్క అద్భుతమైన ఖగోళ ఆవిష్కరణను అభినందించారు.

ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ (AIASC)
 

ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ (AIASC)

ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ (AIASC) ను SPACE ఇండియా మరియు నాసా అనుబంధ పౌర శాస్త్రవేత్తల సమక్షంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సెర్చ్ కోలబిరేషన్ (IASC) ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాయి. 2020 నాటి కాంపెయిన్ యొక్క ఫేస్ -1 ఇతరేషన్ జట్లలో వెకారియా మరియు లఖాని బృందం కూడా ఒకరు. AIASC ఫేజ్ -1 2020 సమయంలో వీరిద్దరూ HLV2514 అని పిలువబడే గ్రహశకలం కనుగొన్నారు. ఇది భూమికి దగ్గరలో ఉన్న గ్రహశకలం అని గుర్తించబడింది. ఇది ప్రస్తుతానికి అంగారక గ్రహానికి సమీపంలో ఉంది. అయితే భవిష్యత్తులో కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత భూమికి దగ్గరగా వచ్చి భూమి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా ఎగురుతుందని భావిస్తున్నారు.

గ్రహశకలం HLV2514

గ్రహశకలం HLV2514

వెకారియా మరియు లఖాని బృందం కనుగొన్న ఈ విషయాన్ని IASC డైరెక్టర్ జె. పాట్రిక్ మిల్లెర్ SPACE ఇండియాకు ఇమెయిల్ ద్వారా ధృవీకరించారు. " గత ప్రచారంలో మీ బృందం HLV2514 ను కొత్త గ్రహశకలం వలె నివేదించింది. వాస్తవానికి ఇది ఒక NEO (భూమికి సమీపంలో ఉన్న వస్తువు). ఈ NEO ప్రస్తుతం మార్స్ గ్రహం దగ్గర ఉంది మరియు కాలక్రమేణా ఇది ఒక గ్రహంలాగ భూమిగా మారుతుంది అని భావించవచ్చు. "

HLV2514 గ్రహశకలం ఆవిష్కరణ

HLV2514 గ్రహశకలం ఆవిష్కరణ

ఈ అద్భుత ఆవిష్కరణ జూన్‌ నెలలో జరిగింది. హవాయిలోని హాలెకాల అబ్జర్వేటరీలో పనోరమిక్ సర్వే టెలిస్కోప్ మరియు రాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ (పాన్-స్టార్స్) ఉపయోగించి తీసిన కొన్ని చిత్రాలను ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఖగోళ కెమెరాలు, టెలిస్కోపులు మరియు అంతరిక్షంలో వస్తువులను కనుగొనటానికి నిరంతరం కంప్యూటింగ్ సదుపాయాన్ని ఉపయోగించి ఆకాశాన్ని సర్వే చేసే యూనివర్శిటీ ఆఫ్ హవాయి ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ ఆబ్జెక్ట్ టెలిస్కోప్ ద్వారా భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాన్ని కనుగొన్నారు.

SPACE ఇండియా
 

SPACE ఇండియా

పాన్-స్టార్స్ సహాయంతో కనుగొనబడిన అనేక వస్తువులలో HLV2514 అనే గ్రహశకలం కూడా ఒకటి. అయితే దాని కక్ష్యను నాసా ఇంకా ధృవీకరించలేదు. కావున దీని యొక్క కక్ష్యను కనుగొన్న తర్వాత మాత్రమే ఆ వస్తువు పేరు పెట్టవచ్చు అని SPACE ఇండియా ప్రతినిధి మీడియాకు తెలిపారు. దీనిని కనుగొన్న వారిలో ఒకరైన వైదేహి వెకారియా మీడియాతో మాట్లాడుతూ "ఎప్పుడెప్పుడు గ్రహశకలం పేరు పెట్టడానికి మాకు అవకాశం లభిస్తుంది అని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు."

Most Read Articles
Best Mobiles in India

English summary
Surat Secondary School Girls Found New Asteroid Near on Earth

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X