అమెరికాను వణికిస్తున్న చైనా స్పేస్‌ల్యాబ్, నేలమట్టం దిశగా మిచిగాన్ సిటీ..?

|

కొన్నాళ్లుగా నియంత్రణ కోల్పోయిన చైనీస్ స్పేస్‌ల్యాబ్ భూమ్మీద కూలిపోనుందనే వార్త అందరినీ భయపెడుతోంది. అటు శాస్త్రవేత్తలు, ఇటు సాధారణ జనం కూడా ఇది ఎప్పుడు, ఎక్కడ కూలుతుందో తెలియక వణికిపోతున్నారు. అయితే ఈ స్పేస్‌ల్యాబ్ ఎప్పుడు, ఎక్కడ కూలుతుందనే విషయంలో తాజాగా మరింత సమాచారం తెలిసింది. 2011లో చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తియాంగోంగ్-1 అంతరిక్ష కేంద్రాన్ని ప్రయోగించింది. 2016 నుంచి ఈ స్పేస్‌స్టేషన్ నియంత్రణ కోల్పోయిందని, భూమిని ఢీకొట్టబోతున్నదని వార్తలు వస్తూనే ఉన్నాయి. అది వింతగా ప్రవర్తిస్తోందని దీని కదలికలను గమనిస్తున్న నిపుణులు చెబుతున్నారు.

 

భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన చైనా, శ్మశానపు దిబ్బగా మారనున్న 5 నగరాలు !భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన చైనా, శ్మశానపు దిబ్బగా మారనున్న 5 నగరాలు !

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ స్పేస్‌ల్యాబ్ ఎప్పుడు, ఎక్కడ కూలుతుందో తెలిసిపోయింది. ఏప్రిల్ 3వ తేదీన అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో స్పేస్ స్టేషన్ తియాంగాంగ్-1 కూలనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మిచిగాన్ ప్రాంతంలో దాదాపు 10 వేల మంది నివస్తున్నారు.

2016 నుంచి ఈ స్పేస్‌స్టేషన్

2016 నుంచి ఈ స్పేస్‌స్టేషన్

2016 నుంచి ఈ స్పేస్‌స్టేషన్ నియంత్రణ కోల్పోయిందని, భూమిని ఢీకొట్టబోతున్నదని వార్తలు వస్తూనే ఉన్నాయి. అది వింతగా ప్రవర్తిస్తున్నదని స్పేస్‌స్టేషన్ కదలికలను గమనిస్తున్న నిపుణులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా అది ఎక్కడ కూలుతుందో అన్న ఆందోళన వ్యక్తమైంది. సైంటిస్టులు కూడా కచ్చితంగా అంచనా వేయలేకపోయారు.

 మిషిగాన్ అని చెబుతున్నా
 

మిషిగాన్ అని చెబుతున్నా

ఇప్పుడు మిషిగాన్ అని చెబుతున్నా.. ఉత్తర చైనా, మధ్య ఇటలీ, ఉత్తర స్పెయిన్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, టాస్మానియా, సౌత్ అమెరికాలలోనూ కూలే అవకాశం ఉన్నట్లు గతంలో సైంటిస్టులు చెప్పారు.

ప్రమాదకరమైన ఇంధనం

ప్రమాదకరమైన ఇంధనం

ఈ స్పేస్‌స్టేషన్‌లో ప్రమాదకరమైన ఇంధనం ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఈ ఎనిమిదిన్నర టన్నుల స్పేస్‌స్టేషన్ భూవాతావరణంలోకి రాగానే చాలా వరకు మండిపోతుందని, పది నుంచి 40 శాతం శకలాలు భూమిపై పడతాయని అంచనా వేస్తున్నారు.

తొలిసారి కెమెరాకు..

తొలిసారి కెమెరాకు..

కాగా నియంత్రణ కోల్పోయిన ఈ చైనా స్పేస్‌ల్యాబ్ తియాంగాంగ్-1 తొలిసారి కెమెరాకు చిక్కింది. ఓ ఆస్ట్రానామర్ దీనికి ఫొటో తీయగలిగాడు. ఫొటోలో ఓ స‌న్న‌ని గీత‌లాగా స్పేస్‌స్టేష‌న్ క‌నిపించ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. బహుషా ఈ స్పేస్‌స్టేషన్ చివరి ఫొటో ఇదే కావచ్చు.

మార్చి 9న

మార్చి 9న

రోమ్‌లో ఉన్న ఆస్ట్రోఫిజిసిస్ట్ గియాన్‌లుకా మాసి ఈ స్పేస్‌స్టేషన్ ఫొటోను తీశారు. మార్చి 9న ఆయన ఈ ఫొటో తీసినట్లు ద సన్ పత్రిక వెల్లడించింది. అయితే ఇప్పటికీ అది కనిపిస్తున్నదని మాసి చెబుతున్నారు. మార్చి 18, 19, 20 తేదీల్లో కొన్ని ప్రాంతాల నుంచి ఈ స్పేస్‌స్టేషన్ కనిపిస్తుందని మాసి చెప్పారు.

తర్వాత నిమిషంలోనే..

తర్వాత నిమిషంలోనే..

అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మార్చి 18 రాత్రి 7.29 గంటలకు తియాంగాంగ్-1 స్పష్టంగా కనిపిస్తుందని, తర్వాత నిమిషంలోనే కనిపించకుండా పోతుందని మాసి వెల్లడించారు. ఇది ఏప్రిల్ 3న అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో కూలుతుందని అంచనా వేస్తున్నారు.

ఆసియాకు చెందిన తొలి స్పేస్‌స్టేషన్‌

ఆసియాకు చెందిన తొలి స్పేస్‌స్టేషన్‌

కాగా ఆసియాకు చెందిన తొలి స్పేస్‌స్టేషన్‌ ఇదే. ఇందులో ప్రమాదకరమైన ఇంధనంతో పాటు ఎనిమిదిన్నర టన్నుల స్పేస్‌స్టేషన్ ఉంది. ఇది భూవాతావరణంలోకి రాగానే చాలా వరకు మండిపోతుందని, పది నుంచి 40 శాతం శకలాలు మాత్రమే భూమిపై పడతాయని అంచనా వేస్తున్నారు.

జనవరి నెలలో ఓ ఉల్కాపాతం

జనవరి నెలలో ఓ ఉల్కాపాతం

కాగా జనవరి నెలలో ఓ ఉల్కాపాతం ఈ మిచిగాన్ సిటి వాసులను వణికించింది. ఓ ఉల్క తమ వైపు దూసుకొచ్చి పేలిపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం అమెరికాలోని పశ్చిమతీరం, కెనడాల్లో ఈ ఉల్కపాతం కనిపించింది.

ఒహియో, మిచిగాన్, ఆంటారియోల్లో..

ఒహియో, మిచిగాన్, ఆంటారియోల్లో..

ఒహియో, మిచిగాన్, ఆంటారియోల్లో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆకాశంలో నుంచి ప్రకాశవంతంగా మెరుస్తూ దూసుకొస్తున్న గ్రహశకలాన్ని పలువురు తమ కెమెరాల్లో బంధించారు.

2.0 తీవ్రతతో భూమి కంపించింది

2.0 తీవ్రతతో భూమి కంపించింది

కొంతమంది ఈ ఉల్కాపాతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఉల్క పేలుడుకు తూర్పు మిచిగాన్‌లోని సెయింట్ క్లెయిర్ తీరంలో 2.0 తీవ్రతతో భూమి కంపించింది.

అది ఉల్కపాతమేనని..

అది ఉల్కపాతమేనని..

అది ఉల్కపాతమేనని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. మొదట్లో అది మెరుపో లేక పిడుగో అనుకున్నా.. చివరికి అది ఉల్కపాతమేనని తేలినట్లు డెట్రాయిట్‌లోని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) వెల్లడించింది.

ఊహిచని విధంగా ఉల్కాపాతం సంభవించడం..

ఊహిచని విధంగా ఉల్కాపాతం సంభవించడం..

అయితే ఊహిచని విధంగా ఉల్కాపాతం సంభవించడం, అత్యంత ప్రకాశవంతంగా ఉండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిని గమనించిన పలువురు భూమిపైకి ఏలియన్స్ వచ్చారా? లేక భూమి అంతం అవుతోందా? అంటూ ట్వీట్లు చేశారు.

 

 

Best Mobiles in India

English summary
The Chinese space station with toxic substances will fall to the Ground More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X