గుండెలు జలదరించే వేగం, దీని స్పీడ్ గంటకు 4 వేల కి.మీ..

హైపర్‌లూప్..ఇప్పుడు ఈ పదమే ఓ వైబ్రేషన్..ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దాని వేగం తలుచుకుంటనే వణుకు పుడుతోంది.

By Gizbot Bureau
|

హైపర్‌లూప్..ఇప్పుడు ఈ పదమే ఓ వైబ్రేషన్..ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దాని వేగం తలుచుకుంటనే వణుకు పుడుతోంది. మరి దానిలో ప్రయాణం గురించి తలుచుకుంటే ప్రాణాలు గాలిలోకే..అలాంటి టెక్నాలజీ కోసం ఇప్పుడు యావత్ ప్రపంచం ఇప్పుడు ఎదురుచూస్తోంది. అసలేంటి ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ. దీనికి ఆధ్యులు ఎవరు..దీని వేగమెంత..ఓ సారి ధైర్యం తెచ్చుకుని చదవండి.

4000 కిలోమీటర్ల వేగంతో..

4000 కిలోమీటర్ల వేగంతో..

తొలుత గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత 4000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే దీన్ని.. రైలు అనాలో లేక నేలమీద నడిచే విమానం అని అనాలో తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే దీని వేగంపై ఎవరికీ క్లారిటీ లేదు.

టెక్నాలజీకి ఆధ్యుడు ఇలాన్ మస్క్

టెక్నాలజీకి ఆధ్యుడు ఇలాన్ మస్క్

ఈ భీకర టెక్నాలజీకి ఆధ్యుడు ఇలాన్ మస్క్. టెక్నాలజీ ప్రపంచంలో ఈయన గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాలో పుట్టి, కెనడాలో చదివిన ఈ టెక్ మేధావి 12 ఏళ్లకే ఓ గేమ్‌ను తయారుచేసి దాన్ని అమ్మి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.

పాతికేళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌

పాతికేళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌

పాతికేళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌ ను రూపొందించి న్యూయార్క్ టైమ్స్, షికాగో ట్రిబ్యూన్ వంటి పత్రికల్ని తన క్లయింట్లుగా చేసుకున్న అపర మేధావి కూడా ఇతనే.

అక్కడి నుంచి అన్నీ సంచలనాలే.

అక్కడి నుంచి అన్నీ సంచలనాలే.

అక్కడి నుంచి అన్నీ సంచలనాలే. పేమెంట్ దిగ్గజం ‘పే పాల్', ఎలక్ట్రిక్ కార్ల సంచలనం ‘టెస్లా' ప్రయివేటు ‘నాసా'గా మారిన ‘స్పేస్ ఎక్స్' ఇవన్నీ అతని మస్తిస్కం నుంచి పుట్టిన ఆలోచనలే.

 మరో సంచలన విషయం ఏంటంటే

మరో సంచలన విషయం ఏంటంటే

ఇక మరో సంచలన విషయం ఏంటంటే..అంగారకుడిపై కాలనీని నిర్మిస్తానని చెప్పడం. చౌక అంతరిక్ష ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తానని, అంగారకుడిపై కాలనీ నిర్మిస్తానంటూ మళ్లీ ప్రపంచానికి షాకిచ్చాడు. షాకివ్వడమే కాదు..అందుకోసం రాకెట్ల తయారీ సంస్థ ‘స్పేస్‌ఎక్స్'ను ఏర్పాటు చేసి, విజయవంతంగా రాకెట్లను తయారు చేసి చూపించాడు మస్క్.

హైపర్‌లూప్

హైపర్‌లూప్

ఇప్పుడు మరో సంచలనపు విషయాన్ని బయటకు తెచ్చారు. వాక్యూమ్ ట్యూబ్‌ల వంటి సాధనాల్లో భూమ్మీద అతి వేగంగా ప్రయాణించవచ్చనే కాన్సెప్ట్‌ను 2013లో మస్క్ బయటపెట్టి... దానికి ‘హైపర్‌లూప్' అనే పేరు పెట్టాడు. అంతేకాక ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ఎవరైనా అభివద్ధి చేయొచ్చునని ప్రకటించాడు.

హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్

హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్

అది జరిగిన ఏడాదికి ఈ టెక్నాలజీ కోసం తాము నిధులు సమీకరించామని ‘హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్ (హెచ్‌టీటీ)' సంస్థ ప్రకటించింది. తరువాత... తామూ రేసులో ఉన్నట్లు ‘హైపర్‌లూప్ ఒన్' అనే మరో సంస్థ ప్రకటించింది.

ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కోట్లకు

ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కోట్లకు

వీటిల్లో ప్రధానమైనది హెచ్‌టీటీ కంపెనీ. దీనిలో ఇప్పుడు 500 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వీరికి జీతాలు లేవు. ప్రాజెక్టు వాటాలు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కోట్లకు పడగలెత్తుతారు.

ఇప్పుడిప్పుడే పరుగులు

ఇప్పుడిప్పుడే పరుగులు

ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతోంది. అనేక దేశాలు దీనివెంట పరుగులు పెడుతున్నాయి. ఇందులో ఇండియా కూడా ఉంది. ఇక చైనా అయితే ఇప్పటికే దీని పోటీగా టీ-ప్లైట్ పేరుతో సరికొత్త టెక్నాలజీని తయారుచేస్తోంది.

లాస్ ఏంజిలిస్- లాస్‌వెగాస్ మధ్య..

లాస్ ఏంజిలిస్- లాస్‌వెగాస్ మధ్య..

దీనిపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలిసారిగా దీన్ని ప్రయోగించేందుకు లాస్ వెగాస్ ని ఎంచుకున్నారు. లాస్ ఏంజిలిస్- లాస్‌వెగాస్ మధ్య హైపర్‌లూప్ నడపాలని ఆలోచిస్తున్నామంటూ 2015లో ప్రకటించారు. దీనికి నిధులు కూడా భారీగానే వచ్చాయి. దాదాపు 9 కోట్ల డాలర్లకు పైగానే నిధులను సేకరించారు.

150 మిలియన్ డాలర్ల వ్యయంతో

150 మిలియన్ డాలర్ల వ్యయంతో

ముందుగా 150 మిలియన్ డాలర్ల వ్యయంతో (రూ.1,000 కోట్లు) రెండున్నరేళ్లలో కాలిఫోర్నియాలో టెస్ట్ ట్రాక్‌ను నిర్మించే ప్రయోగం పూర్తి చేయాలనేది ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ట్రాక్ నిర్మాణంలో సహకారానికి ఓర్లికాన్ లేబోల్డ్ వాక్యూమ్, ఏకామ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది

ఇంకో కంపెనీ హైపర్‌లూప్ ఒన్

ఇంకో కంపెనీ హైపర్‌లూప్ ఒన్

అయితే ఇంకో కంపెనీ హైపర్‌లూప్ ఒన్ గతేడాది మే 11న తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రత్యక్షంగా పరీక్షించింది. జులైలో... హెల్సింకీ- స్టాక్‌హోమ్ మధ్య హైపర్‌లూప్‌కు అవకాశాలు బాగున్నాయంటూ తమ అధ్యయన నివేదికను బయటపెట్టింది.

మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే.

మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే.

ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం అర్ధగంటకు పరిమితమవుతుందని, నిర్మాణ వ్యయం 19 బిలియన్ యూరోలుంటుందని అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే.

ఇది ఎలా పనిచేస్తుందంటే

ఇది ఎలా పనిచేస్తుందంటే

అసలింతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే గాలి లేని ట్యూబ్ లో ఈ వాక్ ట్రెయిన్ నడుస్తుంది. ఎంత వేగంగా వెళ్లినా గాలి నిరోధం అక్కడ ఉండదు. యంత్రపరికరాల మధ్య ఘర్షణ ఉండదు. అలాగే తక్కువ ఇంధనం తీసుకుంటుంది.

పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం

పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం

కాబట్టి పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం చేసి... ఆ ట్యూబ్‌లో చిన్న చిన్న ‘పోడ్'లాంటి వాక్ ట్రయిన్లు నడుపుతారన్న మాట. తొలి డిజైన్ ప్రకారం... ఈ పోడ్‌ల ఎత్తు కేవలం 7.4 అడుగులే ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 1,220.

2021 నాటికి ప్రపంచానికి పరిచయం

2021 నాటికి ప్రపంచానికి పరిచయం

ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో బయటకొస్తుందనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. స్పేస్ ఎక్స్ అధినేత మాత్రం ఇది 2021 నాటికి ప్రపంచానికి పరిచయం అవుతుందని చెబుతున్నారు. అది అయ్యే పనేనా అని అందరూ పెదవి విరుస్తున్నారు కూడా. సో..వెయిట్ అండ్ సీ..

Best Mobiles in India

English summary
the Future of Passenger Transportation Hyperloop All You Need to Know Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X