శవ పరీక్షలలో సరికొత్త కోణం!

నేటి ఆధునిక సమాజంలో, శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వాలకు ప్రధాన సవాల్‌గా నిలిచింది. శాంతి భద్రతల పర్యవేక్షణ నిరంతరం సజావుగా సాగాలంటే పోలీసు శాఖ ఎప్పటిప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అవసరం.

శవ పరీక్షలలో సరికొత్త కోణం!

Read More : ఫోన్ మెమరీ సరిపోవటం లేదా..?

పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు 10 సరికొత్త టెక్నాలజీలు త్వరలోనే విస్తృతరూపం దాల్చనున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లయితే పోలీసు నిఘా నేత్రం నుంచి నేరస్తులు తప్పించుకునేందుకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు. పోలీస్ పని వ్యవస్థనే పూర్తిగా మార్చేసే భవిష్యత్ టెక్నాలజీలను ఓ సారి చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెక్స్ట్ జెనరేషన్ హ్యాండ్‌కఫ్స్

 మైక్రోఫోన్, కెమెరా ఇంకా ఇతర సెన్సార్ వ్యవస్థలను కలిగి ఉండే ఈ నెక్స్ట్-జెన్ హ్యాండ్‌కఫ్స్ నిందితుడిని పరవ్యేక్షించటంతో పాటు ప్రతిఘటించిన సమయంలో ఎలక్ట్రిక్ షాక్‌‍కు గురి చేస్తుంది.

ట్రాకింగ్ బుల్లెట్స్

తప్పించుకుని పారిపోతున్న వాహానానికి ఓ ప్రత్యేకమైన జీపీఎస్ డివైస్‌ను షూట్ చేస్తారు. సదరు వాహనంలోకి చొచ్చుకుపోయే ఈ జీపీఎస్ డివైస్, వాహనం లోకేషన్‌‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు సూచిస్తుంది.

అగ్రెషన్ ప్రెడిక్టింగ్ కెమెరాలు

ప్రస్తుతానికి డెవలెప్‌మెంట్ స్థాయిలో ఉన్న అగ్రెషన్ ప్రెడిక్టింగ్ కెమెరాలు నేరస్థుడి కదిలికలను మందుగానే పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి.

ఎన్‌వై‌పీడీ 2020

 పోలీస్ ఫోర్స్ మొత్తానికి అందుబాటులో ఉండే ఎన్‌వై‌పీడీ2020 ప్రోగ్రామ్ పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటంలో కీలక భూమిక పోషిస్తుంది.

3డీ-ఐడీ టెక్నాలజీ

అనుమానాస్పద మృత దేహాలకు సంబంధించి నిర్వహించే శవ పరీక్షలలో ఈ 3డీ-ఐడీ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. 

క్విక్ డీఎన్ఏ ప్రొఫైలింగ్

ఎల్‌జీసీ ఫారెన్సిక్స్ అనే సంస్థ డిజైన్ చేసిన రాపిడ్ డీఎన్ఏ సిస్టం, వ్యక్తి డీఎన్ఏ ప్రొఫైల్‌ను ఓ గంటలోపే విశ్లేషించేస్తుంది.

కార్నియల్ ఇమేజింగ్

ఈ కార్నియల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మనుషులను సలువుగా గుర్తించవచ్చు.

డిజిటల్ ఆటోస్పై

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ టెక్నాలజీ అనుమానాస్పదంగా మృతి చెందిన వారి శరీరాలను 3డీ టెక్నాలజీ సాయంతో క్షుణ్నంగా జల్లెడ పడుతుంది.

రోబోటిక్ కాప్స్

రోబోటిక్ టెక్నాలజీ పై స్పందించే ఈ రోబో కాప్స్ నేరరహిత సమాజం కోసం పాటు పడగలవు. పోలీసులు నిర్వర్తించే అన్నిరకాల విధులను ఈ రోబో కాప్స్ నిర్వర్తిస్తాయి.

 

సూపర్ రికగ్నైజర్స్

మనుషుల ముఖాలను గుర్తించటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ సూపర్ రికగ్నైజర్స్ తమ ఆసాధారణ తెలివితేటలతో నేరస్తులను ఇట్టే గుర్తించేస్తారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Future of Policing Is Here, and It's Terrifying. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting