సముద్రంలో నీటిపై తేలియాడే దేశం,దిమ్మతిరిగే షాకిస్తున్న సృష్టికర్తలు

ఇప్పటివరకు నీటిపై తేలియాడే ఇళ్లు చూశాం.. హోటళ్లు చూశాం.. చిన్న చిన్న విల్లాలను కూడా చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా నీటిపై తేలియాడే దేశాన్నే చూడబోతున్నాం.

|

ఇప్పటివరకు నీటిపై తేలియాడే ఇళ్లు చూశాం.. హోటళ్లు చూశాం.. చిన్న చిన్న విల్లాలను కూడా చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా నీటిపై తేలియాడే దేశాన్నే చూడబోతున్నాం. ఏందీ నమ్మలేకున్నారా..కొన్ని విషయాలను నమ్మి తీరాల్సిందే...ఎందుకంటే అవి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఈ నీటిపై తేలియాడే దేశానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశ్లేషకులను, శాస్త్రవేత్తలను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇది ఎలా సాధ్యం అని అందరూ ముక్కున వేలేసుకునేలా వీడియో ఉంది. కావాలంటే మీరు చూడొచ్చు.

మళ్లీ అదిరే డిస్కౌంట్లతో దూసుకొచ్చిన జియోమళ్లీ అదిరే డిస్కౌంట్లతో దూసుకొచ్చిన జియో

2022 నాటికి..

2022 నాటికి..

పసిఫిక్‌ మహాసముద్రంలో 2022 నాటికి నీటిపే తేలియాడే దేశం ప్రపంచానికి పరిచయం కానుంది. ఇప్పటికే దీని మీద అనేక రకాలైన పరిశోధనలు కూడా సాగాయి.

Image source : Seasteading Institute

 పేపాల్‌ కంపెనీ యజమాని పీటర్‌ థీల్‌

పేపాల్‌ కంపెనీ యజమాని పీటర్‌ థీల్‌

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పేపాల్‌ కంపెనీ యజమాని పీటర్‌ థీల్‌ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలుత ఈ దేశంలో 300 ఇళ్లను పాలినేసియా దేశం సాయంతో నిర్మించనున్నారు.

సిలికాన్ వ్యాలీలాగా

సిలికాన్ వ్యాలీలాగా

అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలాగా దీన్ని నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. వ్యాపార సముదాయల కోసమే ప్రధానంగా దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

2020 నాటికల్లా డజను బిల్డింగ్ లను,,

2020 నాటికల్లా డజను బిల్డింగ్ లను,,

2020 నాటికల్లా డజను బిల్డింగ్ లను నిర్మించే లక్ష్యంతో పేపాల్‌ కంపెనీ యజమాని పీటర్‌ థీల్‌ ముందుకెళుతున్నారు. దీనికోసం $60 million డాలర్లను లాభాపేక్ష లేకుండా పెట్టుబడులకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

Image source : Seasteading Institute

island of Tahiti అనే నామకరణం

island of Tahiti అనే నామకరణం

కాగా ఈ దేశానికి island of Tahiti అనే నామకరణం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని Seasteading Institute అధ్యక్షుడు Joe Quirk కూడా ధృవీకరించారు. ఈ సంస్ధ southern Pacificలో 100 ఎకరాల్లో 2 లక్షల జనాభా నివసించే విధంగా 118 దీవులను 2050 కల్లా నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Image source : Seasteading Institute

వేరియాన్‌' అనే సొంత క్రిప్టోకరెన్సీ..

వేరియాన్‌' అనే సొంత క్రిప్టోకరెన్సీ..

ఈ దేశానికి ‘వేరియాన్‌' అనే సొంత క్రిప్టోకరెన్సీని కూడా ఏర్పాటు చేసుకోనున్నారు. పైగా ఈ దేశానికి సరిహద్దు సమస్యలు, ప్రపంచ వాణిజ్య సమస్యలు ఉండబోవని రాజకీయ విశ్లేషకుడు నథాలీ మెజా గార్సియా పేర్కొన్నారు.

Image source : Seasteading Institute

నివాసాలు కోల్పోయే శరణార్థులకు

నివాసాలు కోల్పోయే శరణార్థులకు

భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా నివాసాలు కోల్పోయే శరణార్థులకు ఆశ్రయం కల్పించొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Image source : Seasteading Institute

 దాదాపు రూ.300 కోట్లు ఖర్చు

దాదాపు రూ.300 కోట్లు ఖర్చు

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ నిర్మించబోయే ప్రతి ఇల్లు కూడా పర్యావరణ హితంగా, వెదురు చెట్ల కర్రలతో నిర్మిస్తారని చెబుతున్నారు.

Image source : Seasteading Institute

సముద్రం ఎప్పుడూ ఆటుపోట్లకు..

సముద్రం ఎప్పుడూ ఆటుపోట్లకు..

అయితే సముద్రం ఎప్పుడూ ఆటుపోట్లకు గురి అవుతుందనే విషయం తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకెళుతుందనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ ఆటుపోట్లకు అనుగునంగానే నిర్మాణాలు ఉంటాయని పీటర్‌ థీల్‌ చెబుతున్నారు.
Image source : Seasteading Institute

మొట్టమొదటి నగరం రూపురేఖలు

మొట్టమొదటి నగరం రూపురేఖలు

ఫస్ట్ నగరం 11 దీర్ఘచతురస్రాకార, ఐదు-ద్విపార్శ్వ ప్లాట్ ఫామ్ నెట్వర్క్లతో నిర్మించబడుతుందని, నీటిపై తేలియాడుతూ నివాస అవసరాలకు అనుగుణంగా ఈ నిర్మాణం ఉంటుందని ప్రాజెక్ట్ ప్రతినిధి జో క్విర్క్ తెలిపారు.

 100 ఏళ్ల వరకు

100 ఏళ్ల వరకు

ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు అత్యాధునికి టెక్నాలజీని వాడుతున్నామని 100 ఏళ్ల వరకు చిన్న సమస్య కూడా లేకుండా ప్లాన్ చేస్తున్నామని వారు చెబుతున్నారు.

ఈ చోటనే..

ఈ చోటనే..

సముద్రంలో ఈ చోటనే నీటిపై తేలియాడే దేశం రూపుదిద్దుకోనుంది. 

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే 

Best Mobiles in India

English summary
The world's first floating nation designed to 'liberate humanity from politicians' will appear in the Pacific Ocean by 2020 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X