ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

Written By:

లోకానికి వెలుగులు ప్రసరించే సూర్యుడు ఒక్కరే ఉంటారు. ఉషోదయాన ఆ భానుడి కిరణాల మన మేనుపై పడితే ఆ అనుభూతే వేరు..అయితే అలాంటిది ముగ్గురు సూర్యుళ్లు ఒకేసారి ఉదయిస్తే...ఆ కిరణాలు మన మేనుపై పడితే ఎలా ఉంటుంది. ఆ అనుభూతిని పొందాలంటే మీరు ఆ గ్రహానికి వెళ్లాల్సిందే..ఇంతకీ ఏంటా ఆ గ్రహం..ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా..అయితే స్టోరీ చూడాల్సిందే.

ఆ పర్వతంలో కళ్లు చెదిరే దేవ రహస్యాలు దాగున్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

అంతరిక్ష శాస్త్రవేత్తలు కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కొత్త గ్రహంలో చాలా ఆసక్తిరమైన విశేషాలున్నాయి.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

దీని బరువు బృహస్పతి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మూడు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహానికి మూడు సూర్యుళ్లు ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

అంతేకాకుండా.. ఈ మూడు సూర్యుళ్ల పుణ్యంతో ప్రతినిత్యం సూర్యోదయాలు, మూడు సూర్యాస్తమయాలు ఉంటాయి. నక్షత్రాల గుంపు సెంటారస్‌లో గుర్తించిన ఈ గ్రహానికి హెచ్‌డీ 131399 ఏబీ అని పేరుపెట్టారు.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

కానీ ఈ గ్రహంలో ఒక రోజు అంటే.. మనిషి జీవిత కాలం కంటే ఎక్కువేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని గుర్తించారు. ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా ఫోటోలు తీయగలిగారు. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత జస్ట్ 580 డిగ్రీలు మాత్రమే. ఒక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే మరో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడట.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

ఇప్పటి వరకు కనుగొన్న అతి పిన్న ఎక్సో గ్రహాల్లో ఇది ఒకటట. ప్రత్యక్షంగా ఫొటోలు తీసిన అతి కొద్ది గ్రహాల్లో ఇది ఉంది. ఒక నక్షత్రం ఉదయిస్తున్నపుడు మరొకటి అస్తమిస్తుంది. ఇలా ఇక్కడ ఏడాదిలో 4వ వంతు స్థిరంగా పగలే ఉంటుంది.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

ఏడాదిలో నాలుగో వంతు వరకూ సూర్యోదయంలోనే ఈ గ్రహం ఉండటంతో.. రాత్రి అనేది ఈ గ్రహంలో లేదనే చెప్పాలి. అంతేకాదు.. ఈ గ్రహం వయస్సు 1.6 కోట్ల సంవత్సరాలకుపైగా వుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

ఆ గ్రహం పూర్తి గ్యాస్ తో నిండి ఉందట. ఆ గ్రహంలో మానవుడు అడుగుపెట్టే పరిస్థితి అయితే లేదు. అడ్డుపెట్టాలనుకుంటే ముగ్గురు సూర్యుళ్ల వేడి ధాటికి మనుష్యులు మలమల మాడిపోవాల్సిందే.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Three suns for one planet
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot