షాక్ : టైమ్‌షిప్ బిల్డింగ్..50 వేల శవాలకు ప్రాణం పోస్తుందట

By Hazarath
|

50 వేల శవాలను భద్రపరిచి వాటికి తిరిగి ప్రాణం పోయడానికి పెద్ద బిల్డింగ్ రెడీ అవుతోంది. దాదాపు వంద ఎకరాల్లో ఈ బిల్డింగ్ తయారవుతోంది. శాస్ర్తవేత్తలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదన్నట్లుగా ఇప్పుడు చనిపోయిన మనుషులను బతికించడానికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరి కొద్ది సంవత్సరాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. దీని కోసం అమెరికాలో వందకు పైగా ఎకరాల్లో అదే టైమ్‌షిప్ బిల్డింగ్ రెడీ అవుతోంది. మరి ఆ టెక్నాలజీ వస్తుందా....శాస్ర్తవేత్తలు ఏం చేస్తున్నారు.. వారు చేస్తున్న ప్రయోగం పేరేంటి.. వాచ్ దిస్ స్టోరి.

షాక్..షాక్ : పుతిన్‌కు చావే లేదు!

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

చనిపోయిన మనిషిని ఎప్పటికైనా బతికించగలమా? అవుననే అంటున్నారు ఈ దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్న క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు. ఎప్పటికైనా మనిషిని బతికించే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి కచ్చితంగా వస్తుందని క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

అందుకే చనిపోయిన కొన్ని శవాలను ఇప్పటినుంచే క్రియోనిక్స్ సాంకేతిక పరిజ్ఙానం ద్వారా భద్రపరుస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఙానం ద్వారా ప్రాణంపోసే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడే ఆ శవాలకు ప్రాణం పోయవచ్చని క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..
 

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

క్రియోనిక్స్ అంటే శీతలం అనే అర్థంలో వస్తుంది. ఇదొక గ్రీకు పదం. అతిశీతలంలో అంటే, మైనస్ 130 డిగ్రీల నుంచి మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ శీతలీకరణంలో మానవ శరీరాలు, అంగాలను భద్రపర్చడాన్నే క్రియోనిక్స్ గా పిలుస్తారు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

మొత్తం మానవ మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల వద్ద, అవయవాలను మైనస్ 130 సెల్సియస్ డిగ్రీల శీతల పరిస్థితుల్లో భద్రపరుస్తారు. మృదదేహంలో ఏ జన్యువు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ శరీరం రక్తనాళాల్లోని రక్తాన్ని బయటకు తీసి ఆ స్థానంలో ‘గ్లుటారల్ డిహైడ్' అనే ప్రమాదకరమైన రసాయనాన్ని ఎక్కిస్తారు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

దీనివల్ల మానవ మృతదేహంలోని ఏ అణువు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. అయితే క్రయోనిక్స్ పద్ధతిలో మానవ దేహాలను భద్రపరిచే ప్రక్రియను మరణించిన కొన్ని క్షణాల్లోనే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో అతిశీతల వాతావరణంలో మానవ శరీరాలను భద్రపర్చినప్పటికీ మంచు పేరుకొని గడ్డకట్టుకుపోవు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

ఈ క్రయోనిక్స్ పద్ధతిలో మానవ శరీరాలను అంటే తల, గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు లాంటి అవయవాలను భధ్రపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నాలుగు ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మూడు ల్యాబ్‌లు అమెరికాలో ఉండగా, ఒక ల్యాబ్ రష్యాలో ఉంది.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

ఇక అమెరికాలోని ల్యాబ్‌లు మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 28 వేల డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక అవయవాలను భద్రపర్చేందుకు 12 వేల నుంచి 36 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లు అయితే బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

2014లో అమెరికా క్రైయోనిక్స్ ల్యాబుల్లో 250 మంది భద్రపర్చగా మరో 1500 మందిని భద్రపర్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇది సామాన్యులకు అందుబాటులో లేవు. కేవలం డబ్బుగల వారికే ఈ ల్యాబ్‌లు అందుబాటులో ఉంటున్నాయి.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

అయితే వీటికి తోడు ఇప్పుడు అమెరికాలో మరో ల్యాబ్ పుట్టుకొస్తోంది. టెక్సాస్‌లోని కమ్‌ఫర్ట్‌లో వందకుపైగా ఎకరాల సువిశాల ప్రదేశంలో ‘టైమ్‌షిప్ బిల్డింగ్' పేరిట ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

పర్యావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను, టెర్రరిస్టులుల దాడులను తట్టుకునేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం నేలను చదును చూసే ప్రక్రియ ప్రారంభమైందని, రెండు, మూడు రోజుల్లో పునాదులు పడతాయని దీనికి ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టీఫెన్ వాలెంటైన్ తెలిపారు.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

ఈ భవనం పూర్తయితే ఏకంగా 50 వేల మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంచెలంచెలుగా ఎలాంటి ముప్పులేకుండా ఈ భవనానికి పటిష్ట భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ‘న్యూసైంటిస్ట్' తాజా సంచిక చూడాల్సిందే.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

ఇక చనిపోయిన మనిషిని బతికించేందుకు పరిశోధనలు 1962లోనే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ ఎట్టింగర్ 1962లోనే ‘ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ' అనే పుస్తకం ప్రచురణ ఈ పరిశోధనలకు దారిచూపింది.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోవున్న ఈ పుస్తకం 2005 పునర్ముద్రణకు నోచుకుంది. 

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

డాక్టర్ జేమ్స్ బెడ్‌ఫోర్డ్ అనే వ్యక్తి మృతదేహాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1967లో క్రయోనిక్స్ పద్ధతిలో భద్రపరిచారు. ఆయన మృతదేహం ఇప్పటికీ అమెరికా ల్యాబ్‌లో అలాగే ఉంది.

 50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

50 వేల శవాలకు ప్రాణం పోసేందుకు టైమ్‌షిప్ బిల్డింగ్..

మరి ముందు ముందు ఈ టెక్నాలజీ వస్తుందా..అలా వస్తే జరిగే పరిణామాలు ఏంటి అన్నది ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. 

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ..

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ..

 క్లిక్ చేయండి  క్లిక్ చేయండి 

 

Best Mobiles in India

English summary
Here Write timeship to house 50000 frozen bodies that could be brought back to life

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X