వణికించిన ప్రయోగాలు..?

Written By:

మనిషి తన మనుగడ పోరాటంలో భాగంగా భవిష్యత్ ఉనికిని కాపాడుకునేందుకు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నాడు. వివిధ అంశాల పై ఇప్పటి వరకు మనుషులు సాగించిన పరిశోధనల్లో కొన్ని సత్పలితాలను ఇవ్వగా మరికొన్ని మాత్రం వినాశనానికి దారి తీసాయి. ప్రపంచ చరిత్రలో పెను ప్రమాదాలకు దారితీసన 10 వివాదాస్పద పరిశోధనల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వణికించిన ప్రయోగాలు..?

సైంటిఫిక్ టెక్నాలజీ విభాగంలో విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోన్న అమెరికా 1940 ప్రాంతంలో ఓ తుఫాన్ ను బలహీనపరిచేందుకు నిర్వహించిన ప్రయోగం ప్రమాదానికి దారితీసింది. Irwin Langmuir అనే వైద్యులు తుఫాన్లను బలహీనపరిచేందుకు ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. ఐస్ క్రిస్టల్స్‌ను ఆకాశం నుంచి అల్పపీడన ద్రోణి పై గుమ్మురించటం ద్వారా దానిని బలహీనపరచవచ్చన్నది ఆయన అంచనా. అనుకున్న విధంగానే జెట్ విమానాల సహాయంతో టన్నుల కొద్ది ఐస్ క్రిస్టల్స్ ఆకాశం నుంచి గుమ్మరించారు. దీంతో ఒక్కసారిగా తన దిశను మార్చుకున్న తుఫాను జార్జియా తీర నగరం సవన్నాను అతలాకుతలం చేసేసింది.

 

వణికించిన ప్రయోగాలు..?

మగ ఏనుగుల ప్రవర్తన పై అధ్యయనం చేసే క్రమంలో "Truko"అనే ఏనుగుకు తాత్కాలిక పిచ్చికి లోనుచేసే LSD అనే ఓ మత్తు డ్రగ్‌ను పరిశోధకులు ఇంజెక్ట్ చేసారు. మనుషులకు ఇచ్చేదానికంటే 3,000 రెట్లు ఎక్కువ మోతాదు డ్రగ్‌ను ఈ ఏనుగులో ఇంజెక్ట్ చేయటంతో 40 నిమిషాల వ్యవధిలోనే ఆ ఏనుగు మరణించింది. అప్పట్లో ఈ పరిశోధన పెద్ద వివాదాస్పదమే అయ్యింది.

వణికించిన ప్రయోగాలు..?

నాజీ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు హిట్లర్. జ‌ర్మ‌న్ నియంత హిట్ల‌ర్ అరాచకాలు అన్నిఇన్ని కావు. హిట్లర్ పాలనలో చోటుచేసుకున్న ప్రయోగాల కారణంగా ఎంతో మంది అమాయకులు బలయ్యారట.

వణికించిన ప్రయోగాలు..?

పరిశోధనల నిమిత్తం ఏకంగా 40,000 అడుగుల లోతైన బోర్‌హోల్‌ను రష్యన్లు సృష్టించారు. 1979, మే 24న ప్రారంభమైన ఈ తవ్వకం భూమి పై లోతైన కృత్రిమ పాయింట్‌గా నిలిచింది. ఈ బోర్‌హోల్ అనేక భూభౌతిక అధ్యయనాలు కేంద్రంగా నిలిచినప్పటికి భూంకపాలతో పాటు ఇతర పెను విపత్తులకు కారణమయ్యేఅవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

వణికించిన ప్రయోగాలు..?

ప్రపంచంపు శక్తివంతమైన పార్టికల్ కొలైడర్‌గా గుర్తింపుపొందిన లార్జ్ హాడ్రోన్ కొలైడర్ను స్విట్జర్లాండ్ భూగర్భంలో ఏర్పాటు చేసారు. లార్జ్ హాడ్రన్ కొలైడర్‌లో పదార్ధ పుంజాలను కాంతి వేగంతో ఢీ కొట్టించారు. ఈ ప్రయోగం ద్వారా విశ్వ ఆవిర్భావినికి కారణమైన రహస్యాన్ని తెలుసుకుందామని శాస్త్రవేత్తల భావించారు. భూమి అంతర్భాగంలో నిర్వహించనున్న ఈ ప్రయోగం వల్ల భూమి అట్టడుగు పొరల్లో కంటికి కన్పించని కృష్ణ బిలాలు ఏర్పడుతాయని దానివల్ల భవిష్యత్‌లో భూమి, దానిమీది జీవరాశులు అంతరించిపోతాయన్న వాదనలు కూడా వెల్లివెత్తాయి.

వణికించిన ప్రయోగాలు..?

1962 జూలై 9న అమెరికా చేపట్టిన హైయాటిట్యూట్ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది.

 

వణికించిన ప్రయోగాలు..?

చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికిచ్చేందుకు డాక్టర్ Robert E. Cornish చేపట్టిన ప్రయోగాలు పూర్తిగా విఫలమయ్యాయి.

 

వణికించిన ప్రయోగాలు..?

స్పానిష్ ప్రొఫెసర్ Jose Delgado అభివృద్ధి చేసిన మైండ్ కంట్రోలింగ్ టెక్నిక్‌ను తొలత జుంతువుల మెదడుకు ఇంప్లాంట్ చేసారట. విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ టెక్నిక్ ను జంతువుల పై ప్రయోగించటం కారణంగా దారుణమైన ఫలితాలను చెవి చూడాల్సి వచ్చిందట.

 

వణికించిన ప్రయోగాలు..?

జూలై 16, 1945లో అమెరికా మొదటి న్యూక్లియర్ వెపన్ ప్రయోగాన్ని చేపట్టింది. Trinity కోడ్ నేమ్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కారణంగా 20 కిలోటన్నుల భారీ పేలుడును ఉపయోగించారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Most Terrifying Experiments In History.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot